చంద్రబాబు ‘తప్పు’టడుగులు.. ! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు ‘తప్పు’టడుగులు.. !

చంద్రబాబు ‘తప్పు’టడుగులు.. !

Written By news on Friday, January 4, 2013 | 1/04/2013

చంద్రబాబు ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్రపై టీడీపీ అంకెల గారడీ ప్రదర్శిస్తోంది. 2012 అక్టోబర్ 2న యాత్ర ప్రారంభించిన బాబు గురువారం నాటికి 94 రోజుల్లో 1,399.1 కిలోమీటర్లు నడిచారు. ఆయన ఏ రోజు ఎంత దూరం నడిచారన్న వివరాలను ‘సాక్షి’ ప్రతి రోజూ పాఠకులకు అందజేస్తూ వస్తోంది కూడా. కానీ టీడీపీ నాయకులు మాత్రం గురువారంతో బాబు పాదయాత్ర 1,500 కిలోమీటర్లకు చేరిందంటూ ప్రకటించేశారు. పైగా ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వరంగల్ జిల్లా సంగెం మండలం పల్లారుగూడలో శిలాఫలకం కూడా ఏర్పాటు చేశారు. 

తొలి రోజు నుంచీ పాదయాత్ర దూరాన్ని ఇష్టానుసారం లెక్కిస్తూ వచ్చిన టీడీపీ తమ్ముళ్లు, తాజాగా దాన్ని 1,500 కిలోమీటర్లకు ‘చేర్చారు’. అందుకోసం పొలాలు, పాఠశాలల్లోకి ఆయన వెళ్లిన దూరాలను కూడా యాత్ర లెక్కలో చేర్చడంతో పాటు, టీడీపీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లినా పాదయాత్ర ఖాతాకు కలపడం వంటి పలు విన్యాసాలు చేశారు. ప్రజా సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల 3,000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నట్టు ప్రకటన రాగానే బాబు యాత్ర లెక్కలన్నింటినీ మార్చే ప్రక్రియ జోరందుకుంది. 

అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలోని సుగూరు ఆంజనేయస్వామి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభించిన బాబు, జిల్లాలో 13 రోజుల పాటు 226.4 కి.మీ. నడిచారు. కానీ టీడీపీ నేతలు మాత్రం సుమారు 250 కి.మీ. నడిచారని ప్రకటించారు. ఉదాహరణకు అక్టోబర్ 9న కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నారాయణపురం క్రాస్ నుంచి ఉరవకొండ నియోజకవర్గం విరూపపల్లి దాకా బాబు 18.4 కిలోమీటర్లు నడిచారు. కానీ టీడీపీ నేతలు మాత్రం కళ్యాణదుర్గం, దొడగట్టల్లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ వేదికలు, వాల్మీకుల సదస్సు ఏర్పాటైన ప్రదేశం, మధ్యలో బాబు పొలంలోకి వెళ్లిన దూరం... ఇలా మరో 1.6 కిలోమీటర్లను జోడించి ఆ రోజు పాదయాత్రను 20 కి.మీ.కి పెంచేశారు. ‘బాబు రోడ్డుపై నడిచిన దూరాన్ని మాత్రమే మేము తొలుత పరిగణనలోకి తీసుకున్నాం. 

ఆయన చాలా గ్రామాల్లో రోడ్డు దిగి ఊళ్లోకి, పొలాల్లోకి, పాఠశాలల్లోకి వెళ్లారు. ఆ లెక్కన జిల్లాలో బాబు 250 కిలోమీటర్ల దాకా నడిచారు’ అంటూ వివరణ కూడా ఇచ్చుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు కూడా ఈ సూత్రాన్నే వర్తింపజేశారు! జిల్లాలో బాబు నడిచింది 193.6 కిలోమీటర్లయితే, దాన్ని 200 కిలోమీటర్లకు పెంచేశారు. ఇక కరీంనగర్ జిల్లాలో ఒకరిద్దరు పార్టీ నేతల ఇళ్లకు వెళ్లి వ్యక్తిగత కార్యక్రమాల్లో బాబు పాల్గొంటే ఆ దూరాన్నీ యాత్ర ఖాతాలోనే జమ చేశారు. పలుచోట్ల బాబు శివార్ల నుంచి వెళ్లినా, గ్రామాల మధ్య దూరాన్ని పరిగణనలోకి తీసుకొని లెక్కలు పెంచేసుకున్నారు! నిజామాబాద్‌లో యాత్ర 115 కి.మీ. జరిగేలా పార్టీ వర్గాలు రూట్‌మ్యాప్ ఖరారు చేశాయి. కానీ బాబు కాళ్లకు బొబ్బలు రావడం, షుగర్ శాతం పెరగడంతో జిల్లాలో 111.6 కిలోమీటర్లే నడిచారు. డిసెంబర్ 3న బోధన్ మండలంలోని పాత సాలంపాడ్, కుమ్మన్‌పల్లి, కొప్పర్తి క్యాంపులకు వెళ్లలేదు. అలా 3.4 కిలోమీటర్లు తగ్గింది. 

టీడీపీ వర్గాలు మాత్రం బాబు గుళ్లకు, గ్రామంలో పలువురి ఇళ్లకు వెళ్లడాన్ని కూడా పాదయాత్ర ఖాతాకే కలిపి జిల్లాలో ఆయన 115.5 కిలోమీటర్లు పూర్తి చేసినట్టు పేర్కొన్నాయి! ఇక ఆదిలాబాద్ జిల్లాలో అయితే బాబు పాదయాత్ర 136 కిలోమీటర్లు ఉంటుందని పార్టీయే ప్రకటించింది. చివరికి మాత్రం జిల్లాలో ఆయన 146 కిలోమీటర్లు నడిచారని ప్రకటించింది. అందుకోసం బాబు రోడ్డు పక్కన ఉండే పొలాల్లోకి, వ్యవసాయ కూలీల వద్దకు 50, 150 మీటర్ల చొప్పున నడిచి వెళ్లిన దూరాలను కూడా కలిపి లెక్కించింది!
Share this article :

0 comments: