నేరారోపణలతో సంబంధంలేని ఆస్తిని అటాచ్‌మెంట్ చేసే అధికారం ఎవరిచ్చారు?.ఇడిపై న్యాయాధికార సంస్థ ప్రశ్నల వర్షం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేరారోపణలతో సంబంధంలేని ఆస్తిని అటాచ్‌మెంట్ చేసే అధికారం ఎవరిచ్చారు?.ఇడిపై న్యాయాధికార సంస్థ ప్రశ్నల వర్షం

నేరారోపణలతో సంబంధంలేని ఆస్తిని అటాచ్‌మెంట్ చేసే అధికారం ఎవరిచ్చారు?.ఇడిపై న్యాయాధికార సంస్థ ప్రశ్నల వర్షం

Written By news on Tuesday, January 1, 2013 | 1/01/2013

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆస్తుల కేసుకు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇడి)పై ఇడి న్యాయాధికార సంస్థ ప్రశ్నల వర్షం కురిపించింది. క్విడ్‌ప్రోకోతో సంబంధంలేని ఆస్తులను ఎలా అటాచ్ చేస్తారు? నేరారోపణ ఆస్తుల విలువను మించి ఎక్కువ ఆస్తులు ఎలా అటాచ్ చేస్తారు? అని ప్రశ్నించింది. 

సీబీఐ ఛార్జిషీట్,ఇన్‌కమ్ టాక్స్ నివేదికల ఆధారంగానే అటాచ్‌మెంట్ చేసినట్లు ఇడి తరపు న్యాయవాది తెలిపారు. ఆస్తుల అటాచ్‌మెంట్ తుదిచర్య కాదని, ప్రాథమిక చర్యేనని చెప్పారు. ప్రాథమిక అటాచ్‌మెంట్‌కు, తుది అటాచ్‌మెంట్‌కు తేడా ఏంటి? అని న్యాయాధికార సంస్థ ప్రశ్నించింది. నేరారోపణలతో సంబంధంలేని ఆస్తిని అటాచ్‌మెంట్ చేసే అధికారం ఎవరిచ్చారు? అని కూడా అడిగింది. భవనాలను అటాచ్ చేసి భూములను వదిలేశారు, ఈ అటాచ్‌మెంట్ ఎలా సాధ్యం? అని ప్రశ్నించింది.

http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=515739&Categoryid=14&subcatid=0
Share this article :

0 comments: