'చంద్రబాబు పాదయాత్ర? మార్నింగ్ వాకా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » 'చంద్రబాబు పాదయాత్ర? మార్నింగ్ వాకా?

'చంద్రబాబు పాదయాత్ర? మార్నింగ్ వాకా?

Written By news on Friday, January 4, 2013 | 1/04/2013

 చంద్రబాబు పాదయాత్ర రికార్డుల కోసమా.. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికా అని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. హైటెక్‌ పోకడలతో చేస్తోన్న చంద్రబాబు పాదయాత్రను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన అన్నారు. పాదయాత్రలో ప్రతిరోజూ వైఎస్ కుటుంబంపై విమర్శలు చేస్తున్న ఆయనకు వైఎస్ , వైఎస్ఆర్ సీపీ అంటే ఎంత భయమో అర్ధమవుతుందని ఆయన తెలిపారు. 

చంద్రబాబు పాదయాత్రకు .. వైఎస్ పాదయాత్రకు పోలికే లేదన్నారు. 9 ఏళ్లు తన హయాంలో ఏమీ చేయలేదని బాబు పాదయాత్ర చేస్తే మంచిదని ఆయన అన్నారు. చంద్రబాబు చేస్తున్నది పాదయాత్రా? లేక మార్నింగ్ వాకా అని తనకు అనుమానవస్తుందన్నారు. చంద్రబాబు మరోసారి ప్రాంతాల గురించి మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్నారు. చంద్రబాబు తన ప్రవర్తన మార్చుకోవాలని శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: