ప్రజలకు మేలు చేయడం నేరమా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజలకు మేలు చేయడం నేరమా?

ప్రజలకు మేలు చేయడం నేరమా?

Written By news on Thursday, January 24, 2013 | 1/24/2013

సర్వమత శ్రేయోభిలాషి జగనన్న కుటుంబాన్ని అమితంగా ప్రేమించే కోట్లాది కుటుంబాల్లో మాదీ ఒకటి. అలాంటి జగన్‌ను సీబీఐ అన్యాయంగా అరెస్ట్ చేసింది. కోట్లాదిమంది హృదయాల్లో చోటు సంపాదించుకున్న జగన్‌కు ఒక న్యాయం, చంద్రబాబుకు ఒక న్యాయమా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం అని ప్రజలందరి తరఫున - సీబీఐని అరచేతిలో పెట్టుకుని ఇష్టమొచ్చినట్లు నాటకం ఆడుతున్న - సోనియాగాంధీని నిలదీస్తున్నాం. ఆయనకు బెయిల్ రాకుండా సోనియా ఛార్జిషీట్లు వేయిస్తున్న సంగతిని గమనిస్తున్నాం. సోనియా అమానుష వ్యూహానికి చెంపపెట్టులా 2014లో జగన్‌కు పట్టం కట్టి సీఎంను చేస్తాం. ఆ విధంగా వైఎస్సార్ రుణం తీర్చుకుంటాం. 

రాష్ట్రంలో వైఎస్సార్ మరణానంతరం చీకట్లు అలుముకున్నాయి. ఈ చీకటి నుండి బయటపడాలంటే జగన్ సీఎం కావాల్సిందే. అవుతాడు కూడా. అందుకే సోనియాకు జగన్ ఫోబియా పట్టుకుంది. 156 మంది ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ‘జగనే మా నాయకుడు’ అని రాసి పంపినప్పుడే ఆ ఫోబియా మొదలైంది. తన మాట కాదని ఓదార్పుయాత్ర చేపట్టినప్పుడు అది ఉధృతమైంది. యాత్రలో జనస్పందన చూసి జీర్ణించుకోలేక అన్యాయంగా కాంగ్రెస్ అధిష్టానం అరెస్ట్ చేసింది. చంద్రబాబుక్కూడా జగన్ భయం పట్టుకుంది. గత మూడేళ్లుగా జగన్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఫలితంగా ఉప ఎన్నికల్లో బాబుకు ఓటమి ఎదురైంది. టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. జగన్‌ను జైల్లోపెట్టి గెలుస్తామనుకున్న తోడు దొంగలను జనం మట్టికరిపించారు. జగనన్నను ఏ శక్తీ ఆపలేదు. ఎందుకంటే ఆయన వెనుక జనం ఉన్నారు. 

అయినా ఇంతగా వైఎస్సార్ కుటుంబాన్ని వేధిస్తున్నారెందుకు? ప్రజలకు మేలు చేసినందుకా? అంటే సోనియా దృష్టిలో ప్రజలకు మేలు చేయడం పాపమా? జగనన్న మీద తప్పుడు కేసులు బనాయించి, అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అదే చంద్రబాబు మీద విజయమ్మ కేసేస్తే విచారించడానికి స్టాఫ్ లేరని చెప్పిన సీబీఐ, జగనన్నపై మాత్రం ఆగమేఘాల మీద ఎంక్వయిరీ చేశారు. అప్పుడు లేని స్టాఫ్ ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చారు? మహానాయకుడి కొడుకుకే ఇంత అన్యాయం జరిగితే మాలాంటి పేదోళ్లు కోర్టుకెళితే ఏం న్యాయం జరుగుతుంది? జగనన్నను అరెస్ట్ చేసిన తర్వాత అర్థమైంది కోర్టుల్లో జడ్జీలు, లాయర్లు దేవుళ్లు కాదు, వాళ్లూ మనుషులే అని! రాష్ట్రం కోసం అహర్నిశలు పాటుపడ్డ మహానాయకుడి కుటుంబాన్ని ఇలా అన్యాయంగా అప్రతిష్ట పాలుజేయడం ఎవరికీ తగదు.

- కె.సబీన జ్యోతి, మర్రిపూడి, ప్రకాశం

రాజన్న రాజ్యం కోసం... జగనన్న సీఎం కావాలి!

ఓ అపార ప్రజాబంధువా...
నీవు మళ్లీ వస్తావని ఆశపడుతోంది ఈ పుడమి!
నీవు లేవని తెలిసి మా జగన్‌ను ఖైదీ చేసిండ్రు
నీవు మళ్లీ రావని తెలిసి పేదలను ఈగలుగా చూస్తుండ్రు
నీవు మాలోనే ఉన్నావన్న సంగతి మర్చిపోయిండ్రు ఈ నీచ నయవంచకులు
నీవు మా పేదల కన్నీటిని తుడిచే చల్లగాలివై వస్తావని తెలియదు ఈ స్వార్ధ రాజకీయులకు
నీవు లేని ఈ పాలన బ్రిటిష్ రాజ్యాన్ని తలపిస్తోంది.
నాడు నీతో ఉండి నిన్ను కొలిచినవారు
నేడు కావ్‌కావ్‌మని కాకుల్లా నీతులు చెబుతుండ్రు
నీ తనయుడిని జైలుపాలు చేసి వేధిస్తుండ్రు.
అందుకే... మా కోసం మళ్లీ పుట్టవా రాజన్నా!
మా బాధల్ని తొలగించగ రావా రాజన్న!

అన్నా... జగనన్నా 
ఈ స్వార్థ ప్రభుత్వాల కుట్రలో భాగమే నీ అరెస్ట్
నిన్ను బంధించినంత మాత్రాన నీ ఆశయాలు ఆగవు
నిన్ను ఒక్కడిని ఖైదీ చేస్తే - కోట్ల జగన్‌లు పుట్టుకొస్తారు
ఒక్క గొంతును నొక్కేస్తే - లక్ష గొంతులు గర్జిస్తాయి
రాజన్న ఆశయాల సాధనకై జైలు గోడల్ని ముద్దాడావు
నువ్వు జైలుకెళితే కన్నీళ్లు పెట్టిన జనం కోసం 
- ఉప్పెనలా వచ్చెయ్
రాజన్న రాజ్యం కోసం ఈ రాక్షస ప్రభుత్వాన్ని కూల్చేయ్.

- గుర్రపు రాజమౌళి, చిట్యాల, వరంగల్

 చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34.
e-mail: ysjagankosam@gmail.com
Share this article :

0 comments: