ఎన్నికల తర్వాత కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఒప్పందం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎన్నికల తర్వాత కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఒప్పందం

ఎన్నికల తర్వాత కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఒప్పందం

Written By news on Monday, May 6, 2013 | 5/06/2013

కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు నిజమే

అవసరమైతే.. ఎన్నికల తర్వాత కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఒప్పందం
వచ్చే ఎన్నికల్లో జగన్ గెలుస్తారనే భయమే కుమ్మక్కుకు కారణం
కిరణ్ ప్రభుత్వాన్ని నిలబెట్టాలనే పట్టుదల బాబులో ఉంది

సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌తో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరిన దాడి వీరభద్రరావు చెప్పారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కయ్యాయని.. తమ రహస్య ఒప్పందం విషయం బయటపడకుండా ఉండేందుకు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ అసత్య ప్రచారం చేసిందని తెలిపారు. ఆదివారం ఆయన సాక్షి టీవీతో మాట్లాడారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసం పణంగా పెట్టారని విమర్శించారు. ‘చంద్రబాబు ఢిల్లీలో కాంగ్రెస్‌తో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారు. కాంగ్రెస్ వాళ్లతో సయోధ్యగా ఉండాలని పార్టీ నేతలందరికీ బాబు సంకేతాలిచ్చారు. ఎన్నికలయ్యే వరకూ కాంగ్రెస్‌తో సన్నిహితంగా మెలగాలని సూచనలున్నాయి. ఎన్నికలయ్యాక కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఒప్పందం కూడా జరిగినట్టు సమాచారం ఉంది’ అని దాడి చెప్పారు. 

బాబు సూచనల మేరకే..

చంద్రబాబు సూచనల మేరకే పార్లమెంటులో ఎఫ్‌డీఐ బిల్లు అంశంలో దేవేందర్‌గౌడ్, సుజనా చౌదరిలు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని దాడి తెలిపారు. ఎన్నికలొస్తాయనే భయంతోనే కిరణ్ సర్కారుపై అవిశ్వాసం పెట్టేందుకు బాబు వెనకడుగు వేశారని చెప్పారు. అవిశ్వాసం పెట్టాలని తాము ఎంతగా కోరినా పట్టించుకోలేదన్నారు. ‘‘కాంగ్రెస్‌కు మద్దతుగా ఉండాలని బాబు ముందుగానే నిర్ణయించుకున్నారు. కిరణ్ ప్రభుత్వాన్ని నిలబెట్టాలనే పట్టుదల ఆయనలో ఉంది. వచ్చే ఎన్నికల్లో జగన్ గెలుస్తారన్న విషయం టీడీపీకి తెలుసు. ఆయన్ను అడ్డుకునేందుకే టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయి’ అని దాడి వీరభద్రరావు చెప్పారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు గనుకే జగన్‌ను జైల్లో ఉంచారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ జగన్ పాలన కోరుకుంటున్నారన్నారు. జగన్ కనీసం పదేళ్లు సీఎంగా ఉంటారని చెప్పారు
Share this article :

0 comments: