ఆటుపోట్లని తట్టుకుని...ఎదిగిన నాయకుడు జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆటుపోట్లని తట్టుకుని...ఎదిగిన నాయకుడు జగన్

ఆటుపోట్లని తట్టుకుని...ఎదిగిన నాయకుడు జగన్

Written By news on Monday, May 6, 2013 | 5/06/2013

నేను మొదట్లో ఎన్టీఆర్ అభిమానిని. వై.ఎస్. పాదయాత్ర తర్వాత ఆయన అభిమానినయ్యాను. 2004లో సీఎం అయిన తర్వాత వై.ఎస్. ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజ్ రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్ పథకాలు పేదల మనసుల్లో చిరస్మరణీయం అయ్యాయి. అందువల్లనే ప్రజలు 2009లో వై.ఎస్. నాయకత్వాన్ని బలపరిచి ఎన్నికల్లో గెలిపించారు. ఏపీలో కాంగ్రెస్ అంటే వై.ఎస్., వై.ఎస్. అంటే కాంగ్రెస్ అనేది నిర్వివాదాంశం. అయితే వై.ఎస్.ను, ఆయన కుటుంబాన్ని విస్మరించి, విమర్శించి, వేధిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. మాట మీద నిలబడ్డ వ్యక్తుల్లో జగన్ ప్రథముడని ఘంటాపథంగా చెప్పొచ్చు. నల్లకాలువ లో ప్రజలకిచ్చిన మాట (ఓదార్పు) కోసం జగన్ ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నాడు.

ఇచ్చిన మాటను విస్మరిస్తే ఎన్నో ఉన్నత పదవులిస్తామని కాంగ్రెస్ ప్రలోభపెట్టినా, మాట తప్పని, మడమ తిప్పని ధీశాలి జగన్. ప్రజలకు, జగన్‌కు మధ్యగల మానసిక అనుబంధమే ఓదార్పుయాత్ర. ఇది చారిత్రాత్మకం. నిరంతరం ప్రజలమధ్య ఉంటూ, జలదీక్ష, జనదీక్ష, రైతుదీక్ష, ఫీజు పోరు మొదలైన దీక్షలను విజయవంతంగా అమలుచేసి, ప్రజాసమస్యలను ఎలుగెత్తి చాటాడు. అందువల్లనే ప్రజలు ఆయన పైనే నమ్మకం పెట్టుకున్నారు. సీబీఐ దాడులు, కేంద్రం హుంకరింపులు, జైలుగోడలు జగన్‌ను ప్రజల నుండి వేరు చేయలేవు. ఓర్పు, సహనం, మాట మీద నిలబడటం లాంటి లక్షణాలు జగన్‌ను జాతీయనాయకునిగా నిలబెట్టాయి.

ఈ సందర్భంగా ఎల్లో మీడియా గురించి కూడా ఒక మాట చెప్పుకోవాలి. అవి జగన్‌పై వీలైనంత దుష్ర్పచారం చేసి, బాబును అర్జెంటుగా సీఎంను చేయాలని పరితపిస్తూ, పడరాని పాట్లు పడుతున్నాయి. ఎల్లో మీడియా విశ్వసనీయతకు ఒక ఉదాహరణ: లోటస్‌పాండ్‌లోని జగన్ నివాసంలో డెబ్బై బెడ్‌రూమ్‌లు, స్విమ్మింగ్ పూల్, ఫారిన్‌బార్ ఉన్నాయని దుష్ర్పచారం జరిగింది. సాక్షి మీడియా గ్రూప్ ‘దమ్ముంటే నిరూపించాలి’ అని ఎల్లో మీడియాకు సవాలు విసిరితే, అది తోకముడిచి పారిపోయింది. కాబట్టి ఎల్లో మీడియా ఎన్ని కుయుక్తులు పన్నినా జగన్‌కున్న విశ్వసనీయతను దెబ్బతీయలేదు.

ఇక సీబీఐ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే హైకోర్టు ఆదేశాలతో జగన్‌పై అతివేగంగా, బాబుపై నత్తనడకన దర్యాప్తును ప్రారంభించిన సీబీఐ పూర్తిస్థాయిలో విశ్వసనీయతను కోల్పోయింది. అంతేకాక, జేడీ దర్యాప్తు అధికారిగా ఉంటూ ముఖాముఖిగా జరిగిన విచారణ వివరాలను, ఎల్లో మీడియాకు లీక్ చేసినట్టు ఆయన కాల్ లిస్ట్ ద్వారా బహిర్గతమైంది. ఆయన నిజాయితీపరుడంటూ ఎల్లో మీడియా సన్మానం చేస్తే, నమ్మడానికి ప్రజలు అమాయకులు కారు. ప్రజలు మెచ్చిన నాయకుడు జగన్‌పై ఇప్పటికైనా వేధింపులు మానకపోతే వీరంతా ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. ఇటువంటి ఎన్నో ఆటుపోట్లని తట్టుకుని, సంఘర్షణ నుండి పుట్టిన నాయకుడే జగన్!

- ఎస్.శ్రీనివాసరెడ్డి, పత్తికొండ, కర్నూలు జిల్లా

కుటిల రాజకీయానికి బలైంది జగన్‌మోహనరెడ్డి ఒక్కరే కాదు... 

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ప్రజారంజకమైన పరిపాలన అందించిన మహానేత డాక్టర్ రాజశేఖర్‌రెడ్డిగారి మరణం రాష్ట్రానికి అశనిపాతం. బహుశా వై.ఎస్. మీద భయంతో కూడిన ద్వేషమేదో సోనియాకి ఉండి ఉండవచ్చు. ఆయనలాంటి స్వతంత్రభావాలు గల నాయకుడు మరొకరు తయారుకావడానికి మనస్కరించని ఆమె... ఓదార్పుయాత్రపై ఆంక్షలు విధించడం ద్వారా జగన్‌ను కట్టడి చేసి ప్రజల నుండి దూరం చేయడానికి కుయుక్తులు పన్నినట్లు కనిపిస్తోంది. తల్లి, చెల్లితో కలిసి ఢిల్లీలో సోనియా నివాసంలో ఓదార్పు యాత్రను అడ్డుకోవద్దని చేసిన అభ్యర్థన కూడా ఆమె మనసును కరిగించలేకపోయింది. ఆమె వైఖరితో విసిగిపోయిన జగన్ పదవులను త్యాగం చేసి రాజకీయ పోరాటానికి తెరతీశారు. 

అదిగో అప్పుడే మొదలైంది రాజకీయ వికృతక్రీడ. రాజకీయంగా ఆయనను ఎదుర్కోలేక అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్‌పై కక్ష తీర్చుకోవాలన్న ప్రయత్నాన్ని ప్రజలు సహించలేకపోయారు. ఫలితంగా కడప లోక్‌సభకు జరిగిన ఉపఎన్నికలో చరిత్రాత్మకమైన తీర్పునిచ్చారు. అయినా సోనియాకు కనువిప్పు కలగలేదు. ‘క్విడ్ ప్రో కో’ ఆయుధాన్ని సంధించడానికి సిద్ధపడ్డారు. ఇక సీబీఐ పని తీరు చూస్తే కేంద్ర ప్రభుత్వ కనుసన్నలలో పని చేయడమే తప్ప స్వతంత్రంగా పనిచేయగల శక్తియుక్తులను కోల్పోవడం నిజంగా ఈ దేశ దౌర్భాగ్యం. 

సోనియాగాంధీ కక్షకు, కుటిల రాజకీయానికి బలైంది నిజానికి జగన్మోహన్‌రెడ్డిగారొక్కరే కాదు, యావత్తు రాష్ట్రప్రజలు కూడా. రాష్ట్ర ముఖ్యమంత్రిగా... సమర్థుడైన నాయకుడు, సుస్థిర ప్రభుత్వాన్ని అందించగల దిట్ట కాకపోతే రాష్ట్ర ప్రగతి ఏ విధంగా కుంటుపడుతుందో ఈ మూడు సంవత్సరాల్లో ప్రజలు గ్రహించారు. నదీజలాల వాటా కోసం పోరాడే పటిమగానీ, కేంద్రాన్ని ఒప్పించి నిధులు తేగల శక్తిగానీ నేటి పాలకులకు లేవు. తద్వారా ఉత్పన్నమవుతున్న విద్యుత్ సమస్య, వ్యవసాయరంగంలో ఎదుర్కొంటున్న సమస్యలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ రద్దు, ధరల పెరుగుదల వంటి సమస్యల పట్ల్ల స్పందించే సమయంగాని, పరిష్కరించే శక్తి సామర్థ్యాలు కానీ ఒక్క నాయకుడికైనా లేకపోవడం రాష్ట్ర ప్రజల దురదృష్టం. 

- పి. మోహన్‌రెడ్డి, వేదాంతపురం, తిరుపతి
Share this article :

0 comments: