కారణం కాంగ్రెస్‌తో మిలాఖత్ కావడమా..? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కారణం కాంగ్రెస్‌తో మిలాఖత్ కావడమా..?

కారణం కాంగ్రెస్‌తో మిలాఖత్ కావడమా..?

Written By news on Tuesday, May 7, 2013 | 5/07/2013

లక్షల కోట్ల బొగ్గు స్కాంపై నివేదికను కేంద్రానికి చూపించింది
ఈ విషయాన్ని సాక్షాత్తూ ఆ సంస్థ డెరైక్టరే వెల్లడించారు
ఇంత తీవ్రమైన విషయంపై బాబు ఎందుకు స్పందించరు
ఏమైనా అంటే ఆయన బాగోతాలన్నీ బయటకు తీస్తారని భయమా?

సాక్షి, హైదరాబాద్: యావత్ దేశాన్ని కుదిపేస్తున్న 1.82 లక్షల కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణంలో సీబీఐ చేస్తున్న దర్యాప్తుపై, ఆ సంస్థ తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన వంది మాగధులు ఎందుకు నోరు విప్పడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యుడు భూమన క రుణాకర్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘బొగ్గు క్షేత్రాల కేటాయింపు కుంభకోణంలో దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాల్సిందిగా సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశిస్తే ఆ సంస్థ అందుకు భిన్నంగా నివేదికను ముందే ప్రధాని కార్యాలయానికి, అదనపు సొలిసిటర్ జనరల్‌కు, న్యాయ మంత్రికి చూపించింది. ఈ విషయాన్ని సాక్షాత్తూ సీబీఐ డెరైక్టరే వెల్లడించారు. సీబీఐకి ఏ మాత్రం స్వయం ప్రతిపత్తి లేదనేది దీన్ని బట్టి తేటతెల్లం అయింది.

సీబీఐ కేంద్ర ప్రభుత్వం చెప్పు చేతల్లో పనిచేస్తూ.. ఎవరిపై ఉసి గొల్పితే వారిపై పడుతుందని స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా చంద్రబాబు ఏమీ అనడం లేదెందుకు? ప్రజల కోసమే పుట్టిన కారణ జన్ముడని చెప్పుకుంటూ పనికి మాలిన విషయాలపై ఊకదంపుడు ఉపన్యాసాలు చేసే చంద్రబాబు.. బొగ్గు కుంభకోణం లాంటి అతిపెద్ద స్కాంపై ఎందుకు మాట్లాడరు..?’’ అని నిలదీశారు. ఇందుకు కారణం కాంగ్రెస్‌తో మిలాఖత్ కావడమా..? లేదా పీఆర్పీ మాదిరిగా వారితో ఒప్పందం కుదుర్చుకోవడమా అని చంద్రబాబును ప్రశ్నించారు. 

‘‘సీబీఐకి వ్యతిరేకంగా మాట్లాడితే తన తొమ్మిదేళ్ల పాలనలో అమ్ముకున్న 50 ప్రభుత్వ సంస్థల బాగోతాన్ని వెలికి తీస్తారని చంద్రబాబు భయపడుతున్నారా? మల్లెల బాబ్జీ, పింగళి దశరథరామ్ హత్యోదంతాల్లో బాబు పాత్రను వెలికి తీస్తారని భీతిల్లుతున్నారా? ఐఎంజీ సంస్థకు కారు చౌకగా భూములను కేటాయించిన వ్యవహారం బయటపడుతుందని జంకుతున్నారా? వీటన్నింటిపైనా కాంగ్రెస్, సీబీఐతో విచారణ జరిపిస్తుందనే భయం బాబులో ఆవహించినట్లుగా ఉంది’’ అని భూమన అన్నారు. కాగా.. రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలించి తొమ్మిది కోట్ల మంది తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన వైఎస్ విగ్రహాన్ని కూడా పార్లమెంటు ఆవరణలో ప్రతిష్టించాలని భూమన విజ్ఞప్తి చేశారు.
Share this article :

0 comments: