సిబిఐ వాదనల్లో పొంతనలేదు: ముకుల్ రోహత్గీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సిబిఐ వాదనల్లో పొంతనలేదు: ముకుల్ రోహత్గీ

సిబిఐ వాదనల్లో పొంతనలేదు: ముకుల్ రోహత్గీ

Written By news on Monday, May 6, 2013 | 5/06/2013

సీబీఐ హైకోర్టులో చేసిన వాదనలకు, సుప్రీం కోర్టులో చేసిన వాదనలకు పొంతన లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు, ఎంపి జగన్మోహన రెడ్డి తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ చెప్పారు. జగన్ బెయిల్ పిటిషన్ పై సోమవారం సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. హైకోర్టులో ఏడు అంశాల్లో జగన్ కస్టడీ అవసరమని సీబీఐ చెప్పిందని, సుప్రీంకోర్టులో మాత్రం ఆ కేసుల్లో కస్టడీ అవసరం లేదని చెప్పిందని ఆయన తెలిపారు. దాదాపు ఏడాది కాలంగా వైఎస్ జగన్‌ను అనవసరంగా జైల్లో ఉంచారన్నారు. జగన్ ఒక రాజకీయ నాయకుడని, ఆయన ఎక్కడకూ వెళ్లే అవకాశం కూడా లేదని చెప్పారు. మరోవైపు ఎన్నికలు వస్తున్నాయి, కాని సీబీఐ ఆయనను ఎందుకు జైల్లో ఉంచాలని కోరుతోంది? అని ఆయన ప్రశ్నించారు. 

న్యాయమూర్తులు సీబీఐ వాదనలు వింటున్నారు. గంటసేపు వాదనలు వినిపిస్తామని సీబీఐ న్యాయవాది అశోక్‌ భాన్ చెప్పారు 
Share this article :

0 comments: