సుప్రీంకోర్టును సీబీఐ డామినేట్ చేస్తోందా?: జీవన్‌రెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సుప్రీంకోర్టును సీబీఐ డామినేట్ చేస్తోందా?: జీవన్‌రెడ్డి

సుప్రీంకోర్టును సీబీఐ డామినేట్ చేస్తోందా?: జీవన్‌రెడ్డి

Written By news on Friday, May 10, 2013 | 5/10/2013

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ బెయిల్ విషయంలో సీబీఐ వ్యవహరిస్తున్న తీరును మాజీమంత్రి జీవన్‌రెడ్డి తప్పుపట్టారు. సీఆర్‌పీసీ సెక్షన్ 167(2) ప్రకారం 3 నెలల్లో దర్యాప్తు సంస్థ చార్జిషీట్ వేయకపోతే నిందితులు బెయిల్‌కు అర్హులవుతారని చెప్పారు. సీబీఐ దర్యాప్తు సరిగా జరగడం లేదని, అనుబంధ చార్జిషీట్ల పేరుతో కొత్త నిర్వచనం చెబుతోందన్నారు. ‘చార్జిషీట్ వేసి కోర్టులో ట్రయల్స్ మొద లయ్యాక విచారణ సమయంలో కొత్తగా వెలుగులోకి వచ్చే విషయాలు, లభించే ఆధారాల ఆధారంగా మాత్రమే అనుబంధ చార్జిషీట్ వేయాలి. 

కానీ సీబీఐ మాత్రం అది జరగకముందే అనుబంధ చార్జిషీట్ల పేరుతో ఇప్పుడు కొత్త నిర్వచనం చెబుతోంది. జరుగుతున్న తీరును చూస్తుంటే అసలు సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేస్తుందో లేకసీబీఐ సుప్రీంకోర్టును డామినేట్ చేస్తోందో అంతుచిక్కడం లేదు’ అని ఆందోళన వ్యక్తం చేశారు. సీబీఐ వ్యవహరిస్తున్న తీరు, కేసుల వ్యవహారం చూస్తుంటే అవన్నీ కాంగ్రెస్ మెడకే చిక్కుకునేటట్లు కన్పిస్తున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. సీబీఐ దర్యాప్తు సరిగా జరగడం లేదని, దీనిపై వస్తున్న అపవాదులన్నీ కాంగ్రెస్ భరించాల్సి వస్తోందన్నారు. 
Share this article :

0 comments: