మళ్లీ కుమ్మక్కు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మళ్లీ కుమ్మక్కు

మళ్లీ కుమ్మక్కు

Written By news on Monday, July 15, 2013 | 7/15/2013

కొనసాగుతున్న కాంగ్రెస్-టీడీపీ అక్రమ బంధం
పంచాయతీ ఎన్నికల్లో చేతులు కలిపిన వైనం 
రాష్ట్రమంతటా ఇదే లాలూచీ
వీలైనన్ని చోట్ల ‘ఉమ్మడి’ అభ్యర్థులు 
వైఎస్సార్‌సీపీని అడ్డుకోవడమే లక్ష్యం

సాక్షి నెట్‌వర్క్: మళ్లీ అదే కుమ్మక్కు. మరోసారి అవే అపవిత్ర కలయికలు. తమ అక్రమ బంధం చాలా దృఢమైనదని అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ మరోసారి నిరూపిస్తున్నాయి. మూడున్నరేళ్లుగా అన్ని ఎన్నికల్లోనూ అనుసరిస్తూ వస్తున్న కుమ్మక్కు వ్యూహాన్నే తాజాగా పంచాయతీ ఎన్నికల్లోనూ నిస్గిగ్గుగా అమలు చేస్తున్నాయి. ఏం చేసైనా సరే వీలైనన్ని సర్పంచ్‌గిరీలను సొంతం చేసుకునేందుకు అన్నిరకాలుగా అవి అడ్డదారులు తొక్కుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఉమ్మడిగా అభ్యర్థులను బరిలోకి దింపుతున్నాయి! అంతకంటే నిస్సిగ్గుగా ‘కలసికట్టుగా’ ప్రచారం కూడా చేస్తున్నాయి. ఏమాత్రం వీలైనా పోటీని ‘ఏకగ్రీవం’ చేసుకోవడం, లేనిచోట ‘సమైక్యంగా’ పని చేసి సర్పంచ్‌గిరీని సొంతం చేసుకోవడమే లక్ష్యంగా లాలూచీ పడుతున్నాయి. పార్టీరహితంగా జరిగే ఈ ఎన్నికల్లో తమదే పై చేయి అని చెప్పుకునేందుకు ఇలా అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాయి. ప్రజలను, వారి ప్రయోజనాలను గాలికొదిలి, స్వీయ ప్రయోజనాలే పరమావధిగా బరి తెగిస్తున్నాయి. సహకార ఎన్నికల నాటి సీన్‌నే పునరావృతం చేస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని అడ్డుకోవడమే ఏకైక లక్ష్యంగా ఓట్ల వేటలో మునిగితేలుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏ జిల్లాలో, ఏ మండలంలో చూసినా రెండు పార్టీల కుమ్మక్కు వ్యవహారం కొట్టొచ్చేలా కన్పిస్తోంది...

‘అనంత’లో అలా...: అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సింహభాగం పంచాయతీలను ఆ పార్టీకే కేటాయించేలా, టీడీపీ ఎమ్మెల్యేల సెగ్మెంట్లలో అధిక శాతం పంచాయతీలను వారికే వదిలేలా ఇరుపక్షాల మధ్యా ‘అంగీకారం’ కుదిరింది. జిల్లాకు చెందిన మంత్రి రఘువీరారెడ్డి సమక్షంలోనే హైదరాబాద్‌లో ఈ వ్యవహారం ‘సెటిలైందని’ సమాచారం! ఆ ప్రకారం శింగనమల, గుంతకల్లు, మడకశిర, కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మెజారిటీ పంచాయతీల్లో టీడీపీ మద్దతుదారులైన అభ్యర్థులను నిలపలేదు. అలాగే రాప్తాడు, ఉరవకొండ, పెనుకొం డ, పుట్టపర్తి, హిందూపురం, కదిరి నియోజకవర్గాల్లోని చా లా పంచాయతీల్లో కాంగ్రెస్ తన మద్దతుదారులను పోటీకి దించలేదు. రాప్తాడు సెగ్మెంట్లో 51 పంచాయతీల్లోనూ, కదిరి పరిధిలోని 43 పంచాయతీల్లోనూ కాంగ్రెస్ మద్దతుదారులెవరూ బరిలోకి దిగలేదు. పుట్టపర్తి నియోజకవర్గం ఆమడగూరు మండలం చినగానిపల్లి, వెంగళమ్మచెరువు గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపాయి. పైగా శనివారం పలుచోట్ల నామినేషన్ సందర్భంగా ఇరుపక్షాలూ సంయుక్తంగా ర్యాలీ నిర్వహించారు.

మాజీ మంత్రుల ఇలాకాల్లో ఇలా..: కృష్ణా జిల్లా నందిగామ మండలం కేతవీరునిపాడు మాజీ మంత్రి ముక్కపాటి వెంకటేశ్వరరావు స్వగ్రామం. ఇక్కడ కాంగ్రెస్, టీడీపీ గతంలో ఎన్నడూ కలిసి పోటీ చేయలేదు. అలాంటి గ్రామంలో మాజీ మంత్రి కుమారుని భార్యను గెలిపించుకునేందుకు టీడీపీ నేతలతో కాంగ్రెస్ చేతులు కలపడం చూసి ప్రజలు విస్తుపోతున్నారు. ఆటోలు, సుమోలు, మోటార్ సైకిళ్లకు కాంగ్రెస్, టీడీపీ జెండాలను కలిపి కట్టి మరీ నామినేషన్ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. జిల్లా అంతటా ఇదే తీరు! శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో అత్యధిక పంచాయతీల్లో కాంగ్రెస్, టీడీపీ ఉమ్మడి అభ్యర్థులను బరిలోకి దింపాయి. శ్రీకాకుళం జిల్లాలోనూ 20 శాతం పంచాయతీల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఖమ్మం జిల్లా వైరా మండలంలో 12 గ్రామాల్లో కుమ్మక్కు డ్రామా నడుస్తోంది. ఇక తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ ముఖ్య నేత యనమల రామకృష్ణుడు సొంత నియోజకవర్గమైన తునిలో ఏకంగా 40 పంచాయతీల్లో కాంగ్రెస్-టీడీపీ ఒక్కటయ్యాయి! పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలోనూ అత్యధిక పంచాయతీల్లో ఇదే పరిస్థితి! నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్, టీడీపీ 25 పంచాయతీల్లో ఉమ్మడిగా అభ్యర్థులను బరిలోకి దించాయి. విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట మేజర్ పంచాయతీలో కాంగ్రెస్, టీడీపీ ఉమ్మడిగా సర్పంచ్ అభ్యర్థిగా గూటూరు వరల క్ష్మితో నామినేషన్ వేయించారు. కార్యక్రమంలో రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు కలసికట్టుగా పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ మద్దతుదారు ధనిశెట్టి నాగమణిని ఎదుర్కొనేందుకు ఈ ఎత్తు వేశారు.

కడపలో ‘కలసికట్టుగా’...
వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం కామనూరు పంచాయతీ కాంగ్రెస్‌కు ఏకగ్రీవమయ్యేలా టీడీపీ పూర్తిగా సహకరించింది. ఇది మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి స్వగ్రామం. మండల టీడీపీ అధ్యక్షుడైన పెద్దిరెడ్డి రామకృష్ణారెడ్డిదీ ఇదే గ్రామం. అయినా తమ పార్టీ మద్దతుదారులెవరూ నామినేషన్ వేయకుండా చేసి కాంగ్రెస్‌కు పూర్తిగా సహకరించారు! కమలాపురం నియోజకవర్గంలోని కమలాపురం మేజర్ పంచాయతీలోనూ ఇదే తంతు. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరశివారెడ్డి టీడీపీకి పూర్తిగా మద్దతు పలికారు. ఆ పార్టీ అభ్యర్థి ఖాదర్ బాషాకు సహకరించాల్సిందిగా కాంగ్రెస్ కార్యకర్తలను ఆదేశించారు! నియోజకవర్గంలోని నల్లింగాయల్లిలోనేమో టీడీపీ బరిలో నిలవలేదు. అక్కడ కాంగ్రెస్ మద్దతుదారుకు ఓట్లేయాల్సిందిగా టీడీపీ తన శ్రేణులను ఆదేశించింది. జిల్లాలోని మైదుకూరు, బద్వేలు వంటి నియోజకవర్గాల్లోనూ ఇదే తీరు.

కిరణ్, బాబుల జిల్లాలోనూ అదే తంతు
సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబుల సొంత జిల్లా చిత్తూరులో కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే పలుచోట్ల నామినేషన్లు వేయకుండా ఉమ్మడి అభ్యర్థిని ఎంచుకుని ఏకగ్రీవం చేసుకున్నారు. కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థులకు 8 చోట్ల టీడీపీ... టీడీపీ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థులకు 13 పంచాయతీల్లో కాంగ్రెస్ సహకరిస్తున్నాయి. బాబు మాజీ నియోజకవర్గమైన చంద్రగిరి పరిధిలోని తుమ్మలగుంటలో కాంగ్రెస్-టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని దించాయి. ప్రకాశం జిల్లాలో సుమారు 100 పంచాయతీల్లో కాంగ్రెస్, టీడీపీ ఉమ్మడి అభ్యర్థులను బరిలోకి దించాయి. వీటిలో ఆయా పార్టీలకు ఇప్పటిదాకా కంచుకోటలా నిలిచిన పలు గ్రామాలు కూడా ఉన్నాయి! పురపాలక మంత్రి మానుగుంట మహీధరరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కందుకూరు నియోజకవర్గంలో 12 పంచాయతీల్లో టీడీపీ, కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థులను పోటీకి దించాయి. కొండపి నియోజకవర్గం పెట్లూరు పంచాయతీలో టీడీపీ మద్దతుదారైన అభ్యర్థితో స్వయానా కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవీ శేషు శనివారం దగ్గరుండి మరీ నామినేషన్ వేయించారు. రెండు పార్టీల జెండాలనూ కలగలిపి సంయుక్తంగా ర్యాలీ తీశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని 21 గ్రామాల్లో కాంగ్రెస్, టీడీపీల్లో ఎవరో ఒకరి మద్దతుదారులే నామినేషన్ వేశారు!
Share this article :

0 comments: