జగనన్న వస్తేనే బతుకులు బాగుపడతాయి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగనన్న వస్తేనే బతుకులు బాగుపడతాయి

జగనన్న వస్తేనే బతుకులు బాగుపడతాయి

Written By news on Saturday, July 20, 2013 | 7/20/2013

- కిరణ్ సర్కారుపై తమకు నమ్మకం పోయిందంటున్న జనం
- కష్టాలన్నీ షర్మిలకు చెప్పుకుంటున్న ప్రజానీకం
- జగనన్న వస్తేనే బతుకులు బాగుపడతాయని విశ్వాసం
- జగనన్న వస్తారని, రాజన్న రాజ్యం తెస్తారని భరోసా ఇస్తున్న షర్మిల

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: ‘సర్కారుపై ప్రజలకు నమ్మకం పోయింది. రాజన్న ఉండుంటే ఇన్ని కష్టాలు ఉండేవి కాదు.. ఇప్పుడు ఆయన లేరు. జగనన్నే మమ్మల్ని ఈ కష్టాల కడలి నుంచి గట్టెక్కించాలమ్మా’ అంటూ ప్రజలు దివంగత మహానేత కుమార్తె షర్మిలను కలిసి వేడుకుంటున్నారు. వారికి షర్మిల ధైర్యం చెబుతూ ‘త్వరలోనే జగనన్న వస్తారు.. మనందరినీ రాజన్న రాజ్యం దిశగా నడిపిస్తారు. మీకు మంచి రోజులు వస్తాయి’ అని భరోసా ఇస్తూ చిరునవ్వుతో ముందుకు సాగుతున్నారు. ప్రజల గోడు పట్టని రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయు డు వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శుక్రవారం విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో సాగింది. ఈ సందర్భంగా షర్మిల ను కలిసిన పలువురు ప్రజలు తమ సమస్యలు చెప్పుకొన్నారు.


కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవడం లేదు..
అంటిపేటలో రైతులు వెలమల దానబాబు, పైల నాగభూషణరావు షర్మిలతో మాట్లాడుతూ.. ‘‘వెంగళరాయ సాగర్ నుంచి శివారు భూములకు చుక్క నీరు రావడం లేదమ్మా.. లచ్చయ్యపేట నుంచి నీరు ఇటు వచ్చేసరికే కాలువ ఎండిపోతోంది. చూడండమ్మా...అప్పట్లో సుజయ్ కృష్ణ రంగారావు ఎమ్మెల్యేగా ఉన్నపుడు ఇచ్చిన నిధులతో మరమ్మతులు చేశారు. ఆ తరువాత దీన్ని పట్టించుకోనేలేదు. దీంతో 24,700 ఎకరాలకు నీరు అందాల్సి ఉన్నా అందడం లేదు. దీంతో పంటలు ఎండిపోతున్నాయి. అప్పట్లో మహానేత మరో ఐదువేల ఎకరాలకు నీరు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆయనే ఉండుంటే నీరు వచ్చేది. ఇప్పటి కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవడం లేదమ్మా’’ అంటూ ఆవేదన చెందారు. దీనికి షర్మిల స్పందిస్తూ.. ‘‘కొన్నాళ్లు ఓపిక పట్టండన్నా.. మన రాజ్యం వస్తుంది.. మీ భూములన్నింటికీ నీళ్లు అందిస్తాం’’ అని భరోసా ఇస్తూ ముందుకు సాగారు.
జగనన్నే దారి చూపించాలి..
కాశయ్యపేటలో షర్మిలను పాడి రైతులు కలిశారు. ‘‘మా ఊళ్లో పాడి సమృద్ధిగా ఉంది. అయినా ఆదాయం మాత్రం లేదు. పాలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో పెట్టుబడులు పెట్టలేక పశువులను అమ్ముకుంటున్నాం. డెయిరీకి రోజుకు వెయ్యి లీటర్ల పాలు ఇస్తున్నా కష్టానికి తగ్గ ప్రతిఫలం రావడం లేదమ్మా. పశుగ్రాసం దొకరడం లేదు. దాణా ధరలు పెరిగాయి. అయినా ఏదో అలవాటు పడ్డ వృత్తికదా అని కొనసాగిద్దామంటే పశువుల కొనుగోలుకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాకైనా మాకు ఓ దారి చూపించండమ్మా’’ అంటూ మొరపెట్టుకున్నారు. ‘‘కొన్నాళ్లు ఓపిక పట్టండమ్మా.... అన్నీ సర్దుకుంటాయి. మీకు గిట్టుబాటు ధర వస్తుంది. ఆర్థికంగా స్థిరపడతారు’’ అని షర్మిల వారికి ధైర్యం చెప్పి భవిష్యత్‌పై నమ్మకం కలిగించారు.

17.5 కిలోమీటర్ల మేర యాత్ర..
పాదయాత్ర 214వ రోజు శుక్రవారం పార్వతీపురం నియోజకవర్గంలోని లచ్చయ్యపేటలో మొదలైంది. అంటిపేట, ఖాసాపేట, కాశయ్యపేట, పెదభోగిలి, చినభోగిలి, సీతానగరం, అప్పయ్యపేట, జోగింపేట, గుచ్చిమి, మరిపివలస, చిన్నరాయుడుపేట మీదుగా యాత్ర చేశారు. గుచ్చిమి, మరిపివలస, చిన్నారాయుడు పేటలో గ్రామస్తులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి షర్మిలకు ఆహ్వానం పలికారు. వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఆమె ముందుకు సాగారు. చివరగా నర్సిపురంలో మహానేత వైఎస్ విగ్రహానికి పూలమాల వేశారు. 

ఈ సందర్భంగా రోడ్డు కిక్కిరిసిపోయింది. పెద్ద ఎత్తున జనం వచ్చి షర్మిలతో కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు. నర్సిపురం శివారులో ఏర్పాటు చేసిన బసకు షర్మిల రాత్రి ఎనిమిది గంటలకు చేరుకున్నారు. శుక్రవారం ఆమె మొత్తం 17.5 కిలోమీటర్లు నడిచారు. పాదయాత్రలో పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త సుజయ్ కృష్ణ రంగారావు, పార్టీ నాయకులు ప్రసాదరాజు, కొయ్యప్రసాదరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్తలు కొయ్యా న శ్రీవాణి, జమ్మాన ప్రసన్నకుమార్, గర్భాపు ఉదయభాను, నాయకులు కొత్తపల్లి గీత, ద్వారపురెడ్డి సత్యనారాయణ, భూపతిరాజు శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: