ఇలాంటి వారికి మళ్లీ ఎందుకు ఓటేయాలి? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇలాంటి వారికి మళ్లీ ఎందుకు ఓటేయాలి?

ఇలాంటి వారికి మళ్లీ ఎందుకు ఓటేయాలి?

Written By news on Friday, July 19, 2013 | 7/19/2013

- ఈ పాలకులు వైఎస్ పెట్టిన పథకాలకు తూట్లు పొడుస్తున్నారు 
- బొబ్బిలి బహిరంగ సభలో షర్మిల ధ్వజం
- ఉచిత విద్యుత్‌ను కుదించినందుకు ఓటేయాలా?
- ఫీజు రీయింబర్స్‌మెంటుకు ఆంక్షలు పెట్టి విద్యార్థుల జీవితాలతో బేరాలాడుతున్నందుకా?
- రైతులకు తగిన మద్దతు ధరలు ఇవ్వనందుకా?
- పక్కా ఇళ్లు, పెన్షన్లు ఇవ్వనందుకా?
- ప్రజలపై రూ.32 వేల కోట్ల కరెంటు చార్జీలు మోపినందుకు ఓటేయాలా?
- కాంగ్రెస్ నేతలు రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారు
- ఇలాంటి సర్కారును సాగనంపాల్సిన చంద్రబాబు వాళ్లతో కుమ్మక్కయ్యారు 

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో విద్యార్థులు, వృద్ధులు, వికలాంగులు, కర్షకులు, కార్మికులు, పేదలు అందరూ కష్టాలు అనుభవిస్తున్నారని, ఎవరికీ సంతోషం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ఈ ప్రభుత్వం పట్ల రాష్ట్రంలో ఎవరికీ విశ్వాసం లేదని అన్నారు. ‘‘ఈ పాలకులు వైఎస్ పెట్టిన పథకాలకు తూట్లు పొడుస్తున్నారు. విద్యుత్, ఆర్టీసీ, రిజిస్ట్రేషన్ చార్జీలు, ఎరువుల ధరలను అడ్డగోలుగా పెంచుతున్నారు. అసలు ప్రజలపై పగబట్టిందా? అన్నట్లుంది ఈ సర్కారు వైఖరి. 

ఈ కాంగ్రెస్ నేతలు తమకు ఓటేయాలంటూ మీ ముందుకు వస్తారు. ఇలాంటి వారికి మళ్లీ ఎందుకు ఓటేయాలి? వీరు నాలుగేళ్లలో ఒక్కసారైనా ప్రజల గురించి ఆలోచించారా? కరెంటు చార్జీల పేరుతో అడ్డగోలుగా 32 వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపినందుకు ఓటేయాలా? ఎరువుల ధరలు 300 నుంచి 800 శాతం పెంచినందుకా? ఉచిత విద్యుత్‌ను 4, 3 గంటలకు కుదించినందుకా? పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయినా మద్దతు ధర పెంచనందుకు ఓటేయాలా?’’ అని ఆమె ప్రశ్నించారు. ప్రజల్ని గాలికి వదిలేసిన ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కైన టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రలో భాగంగా ఆమె గురువారం బొబ్బిలి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

నాలుగేళ్లు గడిచిపోతున్నా వాగ్దానాలు నిలబెట్టుకోలేదు: 
‘‘ఈ ప్రభుత్వం సరిగా కరెంటు ఇవ్వకపోవడంతో రాష్ట్రంలో చాలా పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో 20 లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. అందుకు ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలా? ఆరోగ్యశ్రీ నుంచి 133 వ్యాధుల తొలగించారు. 97 ఆస్పత్రులనూ తొలగించారు.. అందుకు ఓటేయాలా? 104 కనబడకుండా పోయినందుకా? పక్కా ఇళ్ల పథకానికి పాడి కట్టినందుకా? ఒక్క కొత్త రేషన్‌కార్డూ ఇవ్వనందుకా? కనీసం ఒక కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయనందుకా? ఫీజు రీయింబర్స్‌మెంటు పథకానికి ఆంక్షలు పెట్టి విద్యార్థుల జీవితాలతో బేరాలాడుతున్నందుకు ఓటేయాలా? 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని, 30 కిలోల బియ్యమిస్తామని మేనిఫెస్టోలో వాగ్దానాలు ఇచ్చి.. నాలుగేళ్లు గడచిపోతున్నా సిగ్గులేకుండా మాట నిల బెట్టుకోనందుకు ఓటేయాలా? అసలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఈ నాయకులు ఏ మొఖం పెట్టుకుని అడుగుతున్నారు?’’ అని షర్మిల నిలదీశారు. ప్రజలకు ఏమీ చేయని కాంగ్రెస్ నేతలు రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారని దుయ్యబట్టారు.

సర్కారుకు చంద్రబాబు అండ..
‘‘ప్రజలను ఇన్ని రకాలుగా వేధిస్తున్న ప్రభుత్వాన్ని సాగనంపే ఉద్దేశంతో అన్ని ప్రతిపక్ష పార్టీలూ అవిశ్వాస తీర్మానం పెడితే చంద్రబాబు కాంగ్రెస్‌ని రక్షిస్తూ వస్తున్నారు. అవినీతి వ్యవహారాల్లో తనపై కేసులు పెట్టకుండా ఉండేందుకుగాను ఆయన కాంగ్రెస్‌ని కాపాడుతున్నారు. ఈయన తీరు చూస్తుంటే రాబందులు రాజ్యం చేస్తుంటే.. గుంట నక్కలు తాళం వేస్తున్నట్లు ఉంది’’ అని షర్మిల మండిపడ్డారు. వైఎస్ మీద అభిమానంతో పలువురు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే వాటిని మార్చిలోగా ఆమోదించకుండా జూన్‌కు వాయిదా వేశారని, ఉప ఎన్నికలు వస్తే ఓడిపోతామన్న భయంతోనే ఇలా చేశారని షర్మిల అన్నారు.

ఉప ఎన్నికలను కూడా ఎదుర్కొనలేని వీళ్లు ఓ నాయకులా? అని ప్రశ్నించారు. ‘‘జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనలేక కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై ఆయన్ను అక్రమంగా జైల్లో పెట్టించాయి. దేవుడున్నాడు. త్వరలోనే జగనన్న బయటికి వచ్చి రాజన్న రాజ్యం తెస్తాడు. విలువలు, విశ్వసనీయత గల ప్రభుత్వం ఏర్పాటవుతుంది. అప్పుడు జగనన్న పేదలందరికీ పక్కా ఇళ్లు, వృద్ధులు, వితంతువులకు రూ.700, వికలాంగులకు రూ.1,000 పెన్షన్ అందిస్తారు. వైఎస్సార్ అమ్మ ఒడి పథకం కింద పిల్లలు చదువుకుంటే తల్లిదండ్రులకు ఆర్థిక ప్రోత్సాహకం అందిస్తారు. పదోతరగతి వరకూ నెలకు రూ.500, ఇంటర్ చదివితే రూ.700, డిగ్రీవారికి రూ.వెయ్యి చొప్పున తల్లి ఖాతాలో వేస్తారు. మహిళలు, రైతులకు వడ్డీలేని రుణాలు ఇస్తారు’’ అని భరోసా ఇచ్చారు.

15.3 కిలోమీటర్ల పాదయాత్ర: పాదయాత్ర 213వ రోజు గురువారం బొబ్బిలి నియోజకవర్గం రొంపిల్లిలో పాదయాత్ర ప్రారంభించిన షర్మిల.. పారాది, సీతారాంపురం, మెట్టవలస, బొబ్బిలి మీదుగా యాత్ర చేశారు. బొబ్బిలిలో పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తర్వాత లచ్చయ్యపేట మీదుగా యాత్ర చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు.

గురువారం ఆమె మొత్తం 15.3 కిలో మీటర్లు నడిచారు. దీంతో 2,850.9 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. ఈ కార్యక్రమంలో పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త సుజయ్ కృష్ణ రంగారావు, పార్టీ జిల్లా కన్వీనర్ పెన్మత్స సాంబశివరాజు, పార్టీ సీజీసీ సభ్యుడు కొణతాల రామకృష్ణ, పార్టీ నేతలు ప్రసాదరాజు, బేబీ నాయన, దాడి వీరభద్రరావు, గండి బాబ్జీ, తిప్పల నాగిరెడ్డి, గద్దె బాబూరావు, కొయ్య ప్రసాదరెడ్డి, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, బోకం శ్రీనివాస్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. 

గాంధేయవాదమా? బ్రాందేయవాదమా?
‘‘నేను పాదయాత్రలో ఉండగా ఓ రోజు పన్నెండేళ్ల కుర్రాడు నాతోబాటు చెప్పుల్లేకుండా నడిచాడు. చెప్పులేస్కోలేదేం తమ్ముడూ.. మీ అమ్మా, నాన్నా ఏం చేస్తుంటారు అని ప్రశ్నిస్తే ‘అక్కా మా అమ్మానాన్నా ఇద్దరూ కూలికి వెళ్తారు. అయితే మా నాన్న అమ్మను కొట్టి కూలీ డబ్బులు లాక్కుని తాగేస్తాడు. తాగొచ్చి మళ్లీ కొడతాడు. ఇంట్లో డబ్బుల్లేవు.. అందుకే చెప్పులు వేసుకోలేదక్కా’ అని చెప్పాడు. ఇది విన్నాక నాకు చాలా బాధ వేసింది. ఈ విషయం ఎన్నిసార్లు గుర్తొచ్చిందో తెలీదు. ఈ పాలకులు రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. గాంధీ వారసులమని, గాంధేయవాదులమని చెప్పుకుంటూ బ్రాందేయవాదాన్ని అమలు చేస్తున్నారు.’’ - షర్మిల
Share this article :

0 comments: