చమురు ముప్పు తిరిగి దేశంలో ఆర్ధిక ఇబ్బందులకు దారితీయనుంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చమురు ముప్పు తిరిగి దేశంలో ఆర్ధిక ఇబ్బందులకు దారితీయనుంది

చమురు ముప్పు తిరిగి దేశంలో ఆర్ధిక ఇబ్బందులకు దారితీయనుంది

Written By ysrcongress on Thursday, February 16, 2012 | 2/16/2012

 
మెరికా యుద్ధోన్మాదం.. ఇరాన్‌ చమురుబావులపై ఆధిపత్యం కోసం జరగనున్న యుద్ధంతో భారత్‌ సతమతమయ్యే ప్రమాదం నెలకొంది. ఇజ్రాయెల్‌ ఎంబసీలే లక్ష్యంగా ఇరాన్‌ జరిపిన మానవబాంబుల ప్రేలుళ్ళను ఆసరాగా చేసుకుని పశ్చిమదేశాలన్నీ ఇరాన్‌పై యుద్దానికి సంసిద్ధమౌతున్నాయి. దీంతో మూడో ప్రపంచ యుద్ధ ఘంటికలు మోగుతున్నాయి. వెనుకుండి అమెరికా ఇజ్రాయెల్‌ను ఎగదోస్తోంది. అమెరికా అనుకూల దేశాలన్నీ కూడా ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో యుద్ధంలో పాలుపంచుకునే అవకాశాలున్నాయి. దీని ఫలితాలెలా ఉన్నా కొంతకాలం ఈ ప్రభావం భారత్‌ ఆర్ధికవ్యవస్థను తీవ్రంగా కుదిపేయనుంది. గత దశాబ్దంలో జరిగిన ఇరాక్‌, ఆఫ్ఘనిస్థాన్‌ యుద్ధాల్లా ఇది తక్కువ సమయంలో ముగిసే పరిస్థితి లేదు. ఇప్పటికే ఇరాన్‌కు చైనా మద్దతుగా నిలిచింది. ప్రపంచంలోని అమెరికా వ్యతిరేక ముస్లిం దేశాలన్నీ కూడా ఇరాన్‌కు మద్దతిచ్చేందుకు ముందుకొస్తున్నాయి.
 ఓ వైపు అమెరికా ఐక్యరాజ్యసమితి పేరిట వివిధ దేశాల్ని కూడగడుతుంటే వ్యతిరేక కూటమి కూడా అంతగానే బలం పుంజుకుంటోంది. గతంలోలా అమెరికా పెద్దన్నపాత్రను, ప్రపంచ పోలీస్‌ ఆధిపత్యాన్ని ఇకముందు కొనసాగనివ్వకూడదన్న ఉద్దేశ్యం ఈ దేశాల్లో వ్యక్తమౌతోంది. ఇరాన్‌ను తుడిచిపెట్టేసేందుకు మానవబాంబుల దాడిని అమెరికా వినియోగించుకుంటుంటే ఇదే అవకాశంగా తీసుకుని అమెరికా ఆధిపత్యానికి దెబ్బకొట్టాలని ఈ దేశాలన్నీ కృతనిశ్చయంతో కనిపిస్తున్నాయి. 
భారత్‌కు చమురు ఎగుమతిదేశాల్లో ఇరాన్‌ ఒకటి. భారత్‌ చమురు దిగుమతి దేశాల జాబితాలో ఇరాన్‌ది రెండోస్థానం. భారత్‌ చమురు దేశీయ అవసరాల్లో 17.5శాతం మాత్రమేస్థానికంగా సమకూరుతోంది. మిగిలిన 82.5శాతం చమురును విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. ఇందులో 18.5శాతం దిగుమతులు ఇరాన్‌ నుంచే జరుగుతున్నాయి. 
ఇదికాక సౌదీ, ఇరాక్‌, యుఎఇ, నైజీరియాల నుంచి కూడా చమురు దిగుమతౌతోంది. ఒక్క ఇరాన్‌ నుంచే రోజూ 4లక్షల బ్యారెళ్ళ ముడిచమురును కొనుగోలు చేస్తున్నాం. దీనికి నెలవారీ బిల్లుగా సుమారు బిలియన్‌ డాలర్లను చెల్లిస్తున్నాం. ఇతర దిగుమతిదారులతో పోలిస్తే సౌదీ, ఇరాన్‌లు భారత్‌కు తక్కువ ధరపైనే చమురును సరఫరా చేస్తున్నాయి. ఇరాన్‌తో ఇటీవల చెల్లింపుల వివాదం ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ పడిపోయిన నేపధ్యంలో చెల్లింపులన్నీ డాలర్లలోనే జరగాలంటూ ఇరాన్‌ పట్టుబట్టింది. జనవరి చివర్లో ఇరువర్గాలకు అంగీకారమైన రీతిలో వివాదానికి ముగింపు పలికారు. భవిష్యత్‌లో ఇరాన్‌తో విస్తృత వ్యాపార సంబంధాలు పెట్టుకోవాలని భారత్‌ భావించింది. ముడిచమురు సరఫరాలోనే కాదు.. వంట నూనెల దిగుమతితో కూడా ఇరాన్‌ భారత్‌తో వ్యాపారం చేస్తోంది. మొత్తం ఇరాన్‌లో వినియోగిస్తున్న వంటనూనెల్లో 40శాతం భారత్‌ నుంచి ఎగుమతౌతున్నవే. భారత వాణిజ్యమంత్రి ఆనందశర్మ బుధవారం ఇస్లామాబాద్‌లో మాట్లాడుతూ ఇరాన్‌తో వ్యాపారసంబంధాలు కొనసాగుతాయని ప్రకటించారు. టెర్రరిజం, వ్యాపారం రెండు వేర్వేరంటూ పేర్కొన్నారు. అయితే యుద్ధమంటూ మొదలైతే ఇరాన్‌ చమురు బావుల్నే అమెరికా మిత్రపక్షాలు లక్ష్యంగా చేసుకుంటాయి. అక్కడి నుంచి ఉత్పత్తికి విఘాతం కల్పిస్తాయి. ఇక ఎగుమతులకు అవకాశం ఉండదు. బుధవారం సౌదీ ప్రభుత్వం ముందుకొచ్చి ఇరాన్‌ నుంచి సరఫరా నిలిచిపోతే ఆ మేరకు తాము ఎగుమతులు చేస్తామంటూ భారత్‌కు హామీ ఇచ్చింది. అయితే సౌదీతో పేమెంట్ల విషయంలో భారత్‌కు పేచీ ఉంది. యూరోపియన్‌ యూనియన్‌ కూడా టెహ్రాన్‌ అణు కార్యక్రమాన్ని నిలిపేసేవరకు ఆ దేశ చమురు ఎగుమతులపై ఉక్కుపాదం మోపాలంటూ పిలుపునిచ్చింది. దీంతో భారత్‌కు చమురు సరఫరాలో ఖచ్చితంగా ఇబ్బందులు తలెత్తుతాయని తేలిపోతోంది. గత కొంతకాలంగా కేంద్రం భవిష్యత్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆహారోత్పత్తులు పెరిగాయి. పారిశ్రామికాభివృద్ధి కూడా చోటు చేసుకుంది. ఆర్ధికవ్యవస్థ కుదుటపడుతోంది. ద్రవ్యోల్బనం తగ్గే అవకాశాలేర్పడ్డాయంటూ బడ్జెట్‌ ముందు ప్రభుత్వం ప్రకటనలిచ్చింది. తద్వారా ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందంటూ భారతీయులకు భరోసా కల్పించింది. 
ఈ దశలో ముంచుకొస్తున్న చమురు ముప్పు తిరిగి దేశంలో ఆర్ధిక ఇబ్బందులకు దారితీయనుంది. ఉన్న చమురును ప్రధానంగా రైల్వేలు, మిలిటరీ, పరిశ్రమలకే కేటాయిస్తారు. దీంతో సాధారణ వినియోగానికి చమురు అందుబాటులో ఉండదు. దీంతో పాటు మధ్యప్రాచ్య యుద్ధాన్ని సాకుగా చూపి అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల్ని విపరీతంగా పెంచేస్తారు. 2003లో ఇరాక్‌ యుద్ధం భారత్‌తో పాటు అనేక దేశాల ఆర్ధికవ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. గత దశాబ్దంలో జరిగిన యుద్ధాలన్నీ చమురు దేశాలపై ఆధిపత్యమే లక్ష్యంగా సాగాయి. హైతీపై 2004లో యుఎస్‌, యుఎన్‌ సంయుక్త దాడులకు పాల్పడ్డాయి. అదే ఏడాది హమాస్‌పై ఇజ్రాయెల్‌ దాడులుచేసింది. 2006లో హతాస్‌పై హమాస్‌ యుద్ధానికి పాల్పడింది. 2006 సోమాలియా యుద్ధంలో ఆఫ్రికా దేశాలన్నీ ఒక్కటిగా నిలిచాయి. 2007లో ఫతా ఆల్‌ ఇస్లాంపై లెబనాన్‌, 2008లో హమాస్‌పై ఇజ్రాయెల్‌, జార్జియాపై రష్యా, 2010లో ఉజ్బెకిస్థాన్‌పై ఖజ్గిస్థాన్‌లు యుద్ధాలు చేశాయి. 2011లో లిబియాపై నాటో, యుఎన్‌ దళాలన్నీ సంయుక్తంగా యుద్ధానికి పాల్పడ్డాయి. ఇదే దశాబ్దంలో ఆఫ్ఘనిస్థాన్‌ను యుఎన్‌ పేరిట యుఎస్‌ దళాలు అతలాకుతలం చేశాయి. ఇరాక్‌ను సర్వనాశనం చేశాయి. 
వీటన్నింటికంటే కూడా ఇరాన్‌ బలమైన దేశం. ప్రపంచంలోని మిలటరీ శక్తిలో ఇది 12వ స్థానంలోఉంది. మొత్తం జనాభా 7,78,91,220. కాగా అందులో 4,62,47,556మంది పురుషులున్నారు. వీరిలో 3,95,56,497మంది మిలటరీలో చేరేందుకు ఎల్లపుడూ సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే 13,92,483మంది పదాతి దళాలున్నాయి. మరో 6.50లక్షల రిజర్వ్‌ దళాలున్నాయి. 12,393ల్యాండ్‌ వెపన్స్‌, 1793ట్యాంక్స్‌, 1760ఎపిసిలు, 1575టౌవ్డ్‌ ఆర్టిలరీ, 865ఎస్‌పిజిలు, 200ఎమ్‌ఎల్‌ఆర్‌ఎస్‌లు, 5వేల మోర్టార్లు, 1400ఎటి వెపన్స్‌, 1701ఎఎ వెపన్స్‌, 1200లాజిస్టికల్‌ వెహికల్స్‌, 1030 యుద్ధ విమానాలు, 357మిలటరీ హెలికాఫ్టర్లు, 313 ప్రత్యేక యుద్ధ విమానాలు, 261 యుద్ధ నౌకలు, 19సబ్‌మెరైన్‌లు, 198పెట్రోల్‌క్రాఫ్ట్‌లు ఇరాన్‌ వద్ద ఉన్నాయి. ఆ దేశం 2011..12లో 9.174బిలియన్‌ డాలర్లను రక్షణబడ్జెట్‌గా ఖర్చుపెడుతోంది. ఆ దేశానికి ఏకంగా 75.060 బిలియన్‌ డాలర్ల విలువైన బంగారు నిల్వలున్నాయి. ఇవన్నీకాక అణ్వాయుధాల్ని సమకూర్చుకుంది. ఇవన్నీ పరిశీలిస్తే యుద్ధమంటూ జరిగితే ఇది దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలున్నాయి. ఇరాక్‌లోలా క్రిమికీటకాల బాంబులు, అణ్వాయుధాలతో ప్రపంచాన్ని సర్వనాశనం చేసేందుకు సద్దాం ప్రయత్నిస్తున్నాడంటూ యుఎస్‌, యుఎన్‌, నాటో దళాలు ఏకపక్షదాడులతో వేగంగా సర్వనాశనం చేసే అవకాశాలైతే లేవు. ఇదెంత దీర్ఘకాలం సాగితే భారత్‌కు అంతగా ఆర్ధిక ఇబ్బందులు ఎదురౌతాయని నిపుణులు అంచనాలు వేస్తున్నా
Share this article :

0 comments: