YS Vijayamma representation to Collector - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » YS Vijayamma representation to Collector

YS Vijayamma representation to Collector

Written By ysrcongress on Tuesday, February 14, 2012 | 2/14/2012


పులివెందులలో పోలీసుల తీరుపై వైఎస్‌ఆర్ జిల్లా కలెక్టర్ అనిల్‌కుమార్‌కు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ ఫిర్యాదు చేశారు. సోమవారం ఆయన ఛాంబర్‌లో కలిసి వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు బనాయిస్తున్న తప్పుడు కేసుల వివరాలను వినతిపత్రం ద్వారా కలెక్టర్‌కు అందించారు. 2011 ఉపఎన్నికల అనంతరం అధికార పార్టీ నేతలకు తలొగ్గిపోలీసులు ఇలా తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు. ధర్నా, ఆందోళనలాంటి చిన్నిచిన్నవాటిపై కూడా రెండు, మూడు కేసులు పెట్టి ఆపై రౌడీషీట్లు తెరుస్తున్నారని వివరించారు. అలాగే మరి కొందరిని ఎర్రచందనం కేసులు నమోదు చేయించి పీడీ యాక్ట్ కింద ఇరికించే వ్యూహంలో ఉన్నారన్నారు. ముఖ్యంగా వైఎస్‌ఆర్ సీపీ నేతలైన దేవిరెడ్డి శంకర్‌రెడ్డి, కొమ్మా చిన్నప్పరెడ్డి, తొండూరు మల్లికార్జునరెడ్డిలపై తప్పుడు కేసులను నమోదు చేశారన్నారు. క్రిమినల్ కేసులో నిందితుడైన నాగస్వరం మల్లికార్జున కోర్టుకు హాజరు కాకపోవడంతో 2008 నుంచి అరెస్టు వారెంట్ పెండింగ్‌లో ఉందన్నారు. నాటి నుంచి పరారీలో ఉన్న అతడిని పోలీసులే రప్పించి దేవిరెడ్డి శంకర్‌రెడ్డి.. మల్లికార్జున ఇంటిపై దాడి చేశారని, కులం పేరుతో దూషించారని తప్పుడు ఫిర్యాదు ఇప్పించి ఎస్సీ యాక్టు కేసును నమోదు చేయించిన వైనాన్ని వివరించారు. 

ఫిర్యాదులో మల్లికార్జున పేర్కొన్న తప్పుడు డోర్ నెంబర్ పత్రాలను కూడా కలెక్టర్‌కు అందజేశారు. పులివెందుల ప్రభుత్వాస్పత్రిలో రోగి మృతిపై ఆగ్రహించిన వెంకటాపురం వాసులు డాక్టర్లపై చేయిచేసుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఆ సంఘటనకు పాల్పడిన వారిపై చట్టపరమైనచర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ఎలాంటి సంబందం లేని శంకర్‌రెడ్డి, చిన్నప్పరెడ్డిలపై పోలీ సులు వ్యూహాత్మకంగా కేసు నమోదు చేయడాన్ని ఆమె కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. పులివెందులలో వైఎస్‌ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా నమోదవుతున్న తప్పుడు కేసులు ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. పార్టీకి చెందిన మహిళలపై కూడా తప్పుడు కేసులు బనాయిస్తున్నార న్నారు. ఉప ఎన్నికల నేపథ్యంలో వారందరినీ అరెస్టు చేయించే కుట్రకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. నమోదైన కేసులను పరిశీలించి తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయంపై స్పందించాలని విజయమ్మ కలెక్టర్‌ను కోరారు.
Share this article :

0 comments: