బాబు హయాంలోనే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు హయాంలోనే

బాబు హయాంలోనే

Written By ysrcongress on Monday, February 13, 2012 | 2/13/2012


* మూడు ఎస్‌పీవీలు ఏర్పాటయిందీ బాబు హయాంలోనే
* మూడోది ఏర్పాటైంది 2004 ఏప్రిల్ 27న; ఎన్నికలకు వారం ముందు..
*‘కొలాబరేషన్’ను ఏపీఐఐసీ ఆమోదించింది కూడా 2004 మార్చి 12న
* ప్రాజెక్టుకు టూరిజం.. ఇన్‌ఫ్రా హోదా ఇవ్వాలని 2002 నాటి జీవోతో పాటు కొలాబరేషన్‌లోనూ పేర్కొన్న బాబు
* ఆ హోదాల ప్రకారమే రాయితీలు, ప్రోత్సాహకాలు.. కన్వర్షన్ చార్జీల మినహాయింపూ దాన్లో భాగమే
* ఇవేమీ పట్టని రామోజీ... దిగజారుడు రాతలు
* 2004కు ముందు ఏం జరిగినా పట్టదంటున్న సీబీఐ దర్యాప్తు
 
వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక 2005 జనవరి 11న జారీ చేసిన జీవో ప్రకారం ఎమ్మార్ ప్రాజెక్టును అమలు చేసే సంస్థల(ఎస్‌పీవీ) సంఖ్య రెండు నుంచి మూడుకు పెరిగింది. మూడింట్లోనూ ఎమ్మార్ వాటా 74 శాతం కాగా... ఏపీఐఐసీ వాటా 26 శాతానికి తగ్గింది. ఇక భూ బదలాయింపు, అభివృద్ధి చార్జీల కింద చెల్లించాల్సిన రూ.28 కోట్లకు పైగా మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా మినహాయించారు. 

- ఇదీ... చార్జిషీట్లో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిపై గుడ్డిగా సీబీఐ చేసిన అభియోగం. ఈనాడు పత్రిక పనిగట్టుకుని మరీ ఆదివారం పూట పతాక శీర్షికలో వండిన రోత కథనం నిండా ఇదే. మరి ఇదంతా నిజమేనా?

ఎమ్మార్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది 535 ఎకరాలు. దీన్లో గోల్ఫ్‌కోర్స్, విల్లా ప్రాజెక్టుల కోసం 520 ఎకరాలు, కన్వెన్షన్ సెంటర్, హోటల్ కోసం 15 ఎకరాలు కేటాయించారు. విల్లా, గోల్ఫ్ కోర్సుల్ని నిర్మించడానికి ఎమ్మార్ హిల్స్ టౌన్‌షిప్ ప్రైవేట్ లిమిటెడ్(ఈహెచ్‌టీపీఎల్), హోటల్, కన్వెన్షన్ సెంటర్ నిర్మించడానికి సైబరాబాద్ కన్వెన్షన్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్(సీసీసీపీఎల్) ఏర్పాటయ్యాయి. వీటిలో 520 ఎకరాలిచ్చిన ఈహెచ్‌టీపీఎల్‌లో ఎమ్మార్‌కు 74%, ఏపీఐఐసీకి 26% వాటా... 15 ఎకరాలిచ్చిన సీసీసీపీఎల్‌లో ఎమ్మార్ వాటా 51 శాతం, ఏపీఐఐసీ వాటా 49% ఉండేలా 2002లో నాటి సీఎం చంద్రబాబు ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం కుదిరాక 2003 ఆగస్టు 20న పైన పేర్కొన్న రెండు సంస్థలూ ఏర్పాటయ్యాయి. 

సీబీఐ తన చార్జిషీట్లో ఈ అంశాన్ని పూర్తిగా వదిలిపెట్టేసింది. ఎందుకంటే విల్లా, గోల్ఫ్‌కోర్సుల్ని నిర్మించే ఈహెచ్‌టీపీఎల్‌లో ఏపీఐఐసీ వాటా 26 శాతంగా నిర్ణయించింది 2002లో ఒప్పందం చేసుకునేటప్పుడే. అదీ చంద్రబాబే. వైఎస్ హయాంలో ఏపీఐఐసీ వాటా తగ్గింది కేవలం కన్వెన్షన్ సెంటర్, హోటల్ ప్రాజెక్టుల్లోనే. అది కూడా రోశయ్య నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ చేసిన సూచనల మేరకు... అదీ అదనపు పెట్టుబడిని సమకూర్చకపోవటం వల్లే. అంటే మొదట్లో చంద్రబాబు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఏపీఐఐసీ తన వాటాగా భూమినిస్తుంది. దానికి తగ్గట్టే తన వాటా మేరకు ఎమ్మార్ పెట్టుబడి పెడుతుంది. ప్రాజెక్టుకు అవసరమై ఎమ్మార్ అదనపు పెట్టుబడి పెడితే... ఏపీఐఐసీ తన వాటా మేరకు అదనపు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 

హోటల్, కన్వెన్షన్ సెంటర్లకు సంబంధించి లాభాలు రావటానికి సుదీర్ఘకాలం పడుతుందని, దీనికి అదనపు పెట్టుబడి అనవసరమని సబ్ కమిటీ సూచించటంతో వైఎస్ ప్రభుత్వం అదనపు పెట్టుబడికి నో అంది. దీంతో వాటా తగ్గింది. అయితే 26% ఉంటేనే ఓటింగ్ హక్కులుంటాయి కనక, నిర్ణయాల్ని అడ్డుకోవచ్చు కనక.. అంతకన్నా తగ్గకుండా జాగ్రత్తపడింది. వాస్తవంగా జరిగింది ఇదీ.. కానీ ఎల్లో, ఢిల్లీ పెద్దల కనుసన్నల్లో దర్యాప్తు చేస్తున్న సీబీఐ గానీ, వైఎస్ కుటుంబంపై ద్వేషం తప్ప మరో ఎజెండా లేని రామోజీగానీ ఈ అంశాలను అసలు పట్టించుకోవటమే లేదు. ఎందుకంటే వాళ్లిద్దరికీ ఇవి చాలా ఇబ్బందికరమైన అంశాలు కనుక. ఇవన్నీ బయటపడితే అసలు దొంగలు తెరపైకి రాక తప్పదు కనుక. 

బాబు హయాంలోనే మూడో సంస్థ కూడా...
అన్నిటికన్నా చిత్రం మరొకటుంది. వైఎస్సార్ ప్రభుత్వం 2005 జనవరి 11న ఇచ్చిన జీవో వల్లే ఎస్‌పీవీల సంఖ్య రెండు నుంచి మూడుకు పెరిగినా... ఆ మూడో ఎస్‌పీవీ ఎమ్మార్ బౌల్డర్ హిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటయింది మాత్రం బాబు హయాంలోనే. అది కూడా ఎన్నికలు మరో వారంలో జరుగుతాయనగా.. 2004 ఏప్రిల్ 27న. అంటే బాబు హయాంలోనే స్కెచ్ సిద్ధమయినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా... సీబీ‘ఐ’ మాత్రం నానాటికీ గుడ్డిదయిపోతుండటం గమనార్హం. ఇదే కాదు.. ఎమ్మార్‌లో కొత్త సంస్థలు పుట్టుకురావటానికి, మూడో పక్షానికి హక్కులు బదలాయించడానికి మూలకారణమైన ‘కొలాబరేషన్ అగ్రిమెంట్’ కుదిరింది కూడా చంద్రబాబు హయాంలోనే.. 2003 ఆగస్టు 19న. దీన్ని ఏపీఐఐసీ హడావుడిగా ఆమోదించిందెప్పుడో తెలుసా? 2004 మార్చి 12న. అంటే ఎన్నికలకు నిండా రెండునెలలు కూడా లేనప్పుడు. ఇవన్నీ కుట్రను బయటపెట్టడం లేదూ?

28 కోట్లూ మినహాయించింది బాబే!
‘ఈనాడు’ కథనం చూస్తే ఇంతలా బరితెగించటం భూమ్మీద మరెవ్వరికీ సాధ్యం కాదనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ హయాంలోనే భూ బదలాయింపు చార్జీలు రూ.28 కోట్లు మినహాయించారంటూ... అలా చేయటం నిబంధనలకు విరుద్ధమని అధికారులు చెప్పినా వినిపించుకోలేదంటూ నానా రోత రాతలూ రాసేసింది. కానీ జరిగిందేమిటో తెలుసా?

-ఎమ్మార్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టుకు ‘టూరిజం’ హోదాతో పాటు ఆ కేటగిరీలో కల్పించే అన్ని రాయితీలూ ఇస్తామని 2002 సెప్టెంబర్ 4న ఇచ్చిన జీవో నంబరు-359లో చంద్రబాబు స్పష్టంగా పేర్కొన్నారు. అంతేకాదు.. కొలాబరేషన్ అగ్రిమెంట్ 9వ పేజీలోని 15, 16 పేరాల్లో... ‘‘ఎమ్మార్ ప్రాజెక్టుకు ‘టూరిజం’, ‘ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ హోదాలు దక్కేందుకు ఏపీఐఐసీ తగిన చర్యలు తీసుకోవాలి. ఆయా హోదాల కింద దక్కే రాయితీలు, ప్రోత్సాహకాలు అన్నీ అందేలా దగ్గరుండి చూసుకోవాలి’’ అని స్పష్టంగా పేర్కొన్నారు. నిజానికి టూరిజం ప్రాజెక్టులకు భూ వినియోగమార్పిడి ఛార్జీల్ని పూర్తిగా మినహాయించటం, ఇంపాక్ట్ ఫీజు రద్దుచెయ్యటం, ఇంకా 50 శాతం స్టాంపు డ్యూటీ మినహాయించటం వంటివి ప్రభుత్వ విధానంలోని అంశాలే. మరి ఇవన్నీ నిబంధనలకు వ్యతిరేకమని ఏ అధికారులు ఎందుకు చెప్పారో, బాబు దీనికి టూరిజం హోదా ఇచ్చినపుడు ‘ఈనాడు’ ఎందుకు అడ్డుపడలేదో ఎవ్వరికీ అర్థంకాని అంశాలు. ఈ మతిలేని రాతల్ని జనం ఏవగించుకుంటారన్న ఇంగితజ్ఞానం కూడా రామోజీకి కరువవటం దురదృష్టకరం. 

సునీల్‌కు సంబంధమేంటి?
ఈ ప్రాజెక్టు కోసం 2000వ సంవత్సరం నుంచి ఎమ్మార్ తరఫున బాబుతో కోనేరు ప్రసాద్ సంప్రదింపులు జరిపినట్లు సీబీఐ తన రిమాండ్ రిపోర్టులో స్పష్టంగా చెప్పింది. మరి ఈ వ్యవహారంలో ముడుపులేమైనా చేతులు మారితే... అవి ఎమ్మార్‌లో డెరైక్టర్‌గా వ్యవహరించిన కోనేరు చేతికి అందితే... అక్కడి నుంచి ఎక్కడికెళతాయన్నది ఎవరైనా తేలిగ్గా ఊహించుకోవచ్చు. ఇక స్టైలిష్ హోమ్స్ ఏర్పాటుకు కారణమైన కొలాబరేషన్ ఒప్పందానికి పచ్చజెండా ఊపి... ఎమ్మార్ నిర్ణయాల్ని అడ్డుకోకుండా ఏపీఐఐసీకి ఎర్రజెండా చూపించింది కూడా చంద్రబాబే. మరి స్టైలిష్ హోమ్స్ వసూలు చేసిన డబ్బులు ఎక్కడికెళతాయన్నది కూడా ఊహించటం కష్టమేమీకాదు. సీబీఐ మాత్రం ఇలాంటి ఆలోచనలేవీ చేయకుండా... వైఎస్ కుటుంబానికి సన్నిహితుడు కావటంతో వైఎస్ ప్రతిష్టను ఎలాగైనా దిగజార్చే ఉద్దేశంతో సునీల్‌రెడ్డిని అరెస్టు చేసింది. కానీ తన చర్యనెలా సమర్థించుకోవాలో తెలీక ‘‘సునీల్‌రెడ్డికి కోనేరు ప్రసాద్, తుమ్మల రంగారావు ద్వారా డబ్బులందాయి. అవి ఎవరికి చేరాయో తేలాల్సి ఉంది’’ అని పేర్కొనటం దాని దిగజారుడుతనానికి పరాకాష్టన్నది న్యాయ నిపుణుల మాట. 

కుట్రపూరితంగా కట్టబెట్టింది బాబే... 
టెండర్ల దశలో ఐదు కంపెనీలు ముందుకురాగా... కుట్ర పూరితంగా షాపుర్జీ పల్లోంజీ, సోమ్ ఏసియా సంస్థల్ని తప్పించి... తర్వాత ఎల్ అండ్ టీ, ఐఓఐ ప్రాజెక్ట్స్‌లు టెండరు వేయకుండా వెనక్కెళ్లేలా చేసిన ఘనత బాబుదే. ఎమ్మార్ టెండర్ ఒక్కటే మిగిలేలా చేసి, దానికే ప్రాజెక్టును కట్టబెట్టిన బాబు... సింగిల్ టెండర్ ఉంటే రద్దు చేస్తారు కదా? అన్న ప్రశ్నకు ఎన్నటికీ సమాధానమివ్వలేరు. ఎల్ అండ్ టీతోను, చుక్కపల్లి సురేష్‌కు చెందిన ఐఓఐతోను బాబుకున్న సంబంధాలు ఎవ్వరికీ తెలియనివీ కావు. ఇంత కుట్రచేసి హైటెక్ సిటీపక్కన 535 ఎకరాల్ని అప్పనంగా కట్టబెట్టిన బాబును ఈ కేసులో వదిలేద్దామని సీబీఐ నిర్ణయించుకోవటం... ప్రీమియర్ దర్యాప్తు సంస్థగా దానికున్న పేరును పాతాళానికి తోసేయటమే. అధికార పార్టీ చెప్పుచేతల్లో సాగే సంస్థగా ఉన్న ముద్రను మరింత పదిలం చేసుకోవటమే. 

ఎస్‌పీవీ అంటే ఆ పనికోసమే...
ఎస్‌పీవీ అంటే స్పెషల్ పర్పస్ వెహికల్. అంటే ఒక ప్రత్యేక పని కోసం ఏర్పాటు చేసే సంస్థ. రిలయన్స్ ఏర్పాటు చేసిన డొల్ల, దొంగ కంపెనీల నుంచి నిధులు తెచ్చుకున్న రామోజీకి ఈ సంగతి చాలా బాగా తెలుసు. మరి ఎమ్మార్ ఈ మూడు ఎస్‌పీవీలనూ 2004లో బాబు గద్దె దిగకముందే ఏర్పాటు చేసిందంటే దానర్థం అప్పటికే స్కెచ్ పూర్తయిందని కాదా? అందులో ఒక సంస్థను... మరో వారం రోజుల్లో ఎన్నికలు జరుగుతాయనగా 2004 ఏప్రిల్ 27న హడావుడిగా ఏర్పాటు ఏర్పాటు చేయటంలో అర్థమేంటి? సీబీఐ దీన్నెందుకు పట్టించుకోవటం లేదు?

ఈ ప్రశ్నలకు బదులేది?
* ఎమ్మార్ కోసం రైతుల నుంచి 83 ఎకరాల భూమిని సేకరించేటపుడు ‘అత్యవసరం’ అనే క్లాజును చేర్చారు బాబు. రైతుకు అవసరమైన ఏ ప్రాజెక్టునూ పట్టించుకోని బాబు దీనికెందుకు అంత ప్రాధాన్యమిచ్చారు? ఇదేమైనా దేవాదులా... లేక ప్రాణహిత-చేవెళ్లా?

* ప్రాజెక్టును కట్టబెట్టడం దగ్గర్నుంచి ‘కొలాబరేషన్’ అనుమతులివ్వటం వరకూ... దానికి రాయితీలు కల్పించటం వరకూ అంతా చంద్రబాబు హయాంలోనే జరిగినా సీబీఐ ఎందుకు అటు వైపు చూడటం లేదు?

* మంత్రివర్గ ఉపసంఘం సిఫారసుల మేరకు అదనపు పెట్టుబడి పెట్టకపోవటంతోనే వాటా తగ్గిన విషయాన్ని పట్టించుకోకుండా, దీనికి సంబంధించి కేబినెట్‌ను కూడా వదిలిపెట్టేసి.. వైఎస్‌ను, ఆయన కుటుంబీకుల్ని, సన్నిహితుల్నే ఎందుకు టార్గెట్ చేస్తోంది?

* ఎన్నికలు రెండు నెలల్లో ఉన్నాయనగా హడావుడిగా ఏపీఐఐసీ ఎందుకు కొలాబరేషన్ ఒప్పందానికి ఆమోదముద్ర వేసింది?

* ఎన్నికలకు కేవలం వారం రోజుల వ్యవధి ఉండగా... 2004 ఏప్రిల్ 27న మూడో ఎస్‌పీవీ ఎందుకు ఏర్పాటయ్యింది?

* ఇప్పుడు భూ బదలాయింపు గురించి మాట్లాడుతున్న రామోజీ తన ఫిలిం సిటీకి ఎంత చార్జీలు చెల్లించారు?
Share this article :

0 comments: