భారత్‌కు చమురు గండం! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » భారత్‌కు చమురు గండం!

భారత్‌కు చమురు గండం!

Written By ysrcongress on Thursday, February 16, 2012 | 2/16/2012

ఇరాన్‌పై ఆంక్షలతో భారత్‌కి ముడిచమురు కష్టాలు తలెత్తే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే, భారత్‌కి అత్యధికంగా క్రూడ్ సరఫరా చేసే దేశాల్లో ఇరాన్ రెండో స్థానంలో ఉంది. ఇరాన్‌పై ఆంక్షల నేపథ్యంలో భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురు పరిమాణం కూడా భారీగా తగ్గుతోంది. 2010-11లో ఇరాన్ నుంచి భారత్ దాదాపు 9.4 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 47,000 కోట్లు) మేర ముడిచమురును దిగుమతి చేసుకుంది. గతేడాది ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో 3.1 బిలియన్ డాలర్ల ( దాదాపు రూ. 15,500 కోట్లు) మేర దిగుమతి చేసుకుంది. ఇరాన్‌పై అమెరికా, యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించినప్పటికీ.. వీటిని తోసిరాజని భారత్ ఇప్పటిదాకా ఆ దేశంతో లావాదేవీలు కొనసాగిస్తూనే ఉంది. అయితే, ఇరాన్ నుంచి దిగుమతి చేసుకునే చమురుకి సంబంధించి చెల్లింపులు జరిపే విషయంలో భారత్‌కి సమస్యలు తలెత్తాయి. 

డాలర్ల బదులు రూపాయి మారకంలో చెల్లింపులు జరిపేందుకు, ఇతరత్రా సర్దుబాటు చేసేందుకు ఇరు దేశాలు మధ్యేమార్గంగా ఒక పరిష్కారాన్ని కనుగొన్నాయి. కానీ, ఇటీవల న్యూఢిల్లీలో ఇజ్రాయెల్ దౌత్యకార్యాలయం దగ్గర జరిగిన బాంబు దాడి ఘటన.. ఏదో విధంగా ఇరాన్‌తో వాణిజ్య లావాదేవీలు జరపాలన్న భారత ప్రయత్నాలకు మరింత విఘాతంగా పరిణిమించింది. కాగా భారత్ నుంచి ఇరాన్‌కు భారీ స్థాయిలో బాస్మతి బియ్యం, టీ ఎగుమతి అవుతోంది. విదేశాలకి ఎగుమతయ్యే మొత్తం 2 మిలియన్ టన్నుల పైగా బియ్యం ఎగుమతుల్లో సగభాగం ఇరాన్‌కే వెడుతోంది. ఇప్పటికే రూ. 600 కోట్ల మేర బకాయిలు పేరుకుపోవడంతో సతమతమవుతున్న ఎగుమతిదార్లకు ఇరాన్ కరెన్సీ మారక విలువ క్షీణించడం మరింత ఆందోళనకరంగా మారింది.
Share this article :

0 comments: