14 వరకూ కొనసాగనున్న ప్రజా బ్యాలెట్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 14 వరకూ కొనసాగనున్న ప్రజా బ్యాలెట్

14 వరకూ కొనసాగనున్న ప్రజా బ్యాలెట్

Written By news on Saturday, April 6, 2013 | 4/06/2013

కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కును ఎండగట్టాలి: విజయమ్మ
అవిశ్వాసానికి బాబు మద్దతిచ్చి ఉంటే చార్జీలు పెరిగేవి కాదు
కోతల సీఎంకు ప్రజల వాతలు తప్పవు: నోముల
14 వరకూ కొనసాగనున్న ప్రజా బ్యాలెట్

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి ఇంటికి, ప్రజలకు భారంగా మారిన విద్యుత్ సమస్యపై అందరూ స్పందించాలని, ‘ప్రజా బ్యాలెట్’ ద్వారా ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యల్ని తెలియజెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విజ్ఞప్తి చేశారు. కరెంటు చార్జీల మోత, విద్యుత్ కోతలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘ప్రజా బ్యాలెట్’ను విజయమ్మ, సీపీఎం నేత నోముల నర్సింహయ్య సంయుక్తంగా ప్రారంభించారు. కరెంటు సత్యాగ్రహం నాలుగో రోజు అయిన శుక్రవారం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని దీక్షా ప్రాంగణంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ.. ప్రతిపక్షాల పోరాటంతో ప్రభుత్వం చార్జీలను ఉపసంహరించినప్పటికీ ఆ నిర్ణయం బిక్షం వేసినట్లుగా ఉందన్నారు. ‘ప్రభుత్వం చార్జీలు పెంచడం వల్ల రైతులు మోటార్లు ఉపయోగించలేని పరిస్థితి ఏర్పడింది. ఇంట్లో లైట్లు వేసుకునేందుకు సైతం సామాన్యులు జంకుతున్నారు. విద్యుత్ చార్జీల మోతతో వందలాది పరిశ్రమలు మూతపడ్డాయి. లక్షలాది మంది కార్మికులు రోడ్డునపడ్డారు.

అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేలా టీడీపీ తన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. అవిశ్వాసం సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ ఓటు వేసి ఉంటే చార్జీల పెంపు నిర్ణయం అమల్లోకి వచ్చేది కాదు. అన్ని వర్గాలకూ ఇబ్బందులు తప్పేవి. సర్కారుతో కుమ్మక్కు అయిన టీడీపీ వైఖరికి నిరసనగా ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తున్నాం. ఈ ప్రజా బ్యాలెట్ 14 వరకు కొనసాగుతుంది. ప్రతి ఒక్కరికీ భారంగా మారిన విద్యుత్ సమస్యపై అందరూ స్పందించాలని కోరుతున్నాం. ప్రజా బ్యాలెట్ ద్వారా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యల్ని తెలియజెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వ వైఖరికి నిరసనగా 9న బంద్‌ను ప్రజలంతా విజయవంతం చేయాలని కోరుతున్నాం. బంద్ రోజు నాటికి వైఎస్ పాదయాత్ర ప్రారంభించి 10 ఏళ్లు పూర్తవుతుంది. ఆ సందర్భంగా పార్టీ శ్రేణులు వైఎస్సార్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పాదయాత్రగా వెళ్లాలని కోరుతున్నా’ అని తెలిపారు. దీక్షకు సంఘీభావం తెలిపిన అనంతరం నోముల నర్సింహయ్య మాట్లాడుతూ.. సామాన్యుడికి, రిలయన్స్ అధినేతల వంటి వారికి ఒకేవిధమైన చార్జీలుంటాయా? అని ప్రశ్నించారు. ‘గతంలో విద్యుత్ వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న కిరణ్ ఇప్పుడు చార్జీల పెంపు వంటి అప్రజాస్వామిక చర్యలకు ఎలా పాల్పడుతున్నారు? కోతల సీఎంకు ప్రజలు వాతలు పెడతారు’ అని హెచ్చరించారు.

దీక్షా శిబిరంలో జగ్జీవన్‌రామ్ జయంతి

భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్‌రామ్ జయంతిని కరెంటు సత్యాగ్రహం దీక్షా శిబిరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించింది. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ.. దళితుల అభివృద్ధికి జగ్జీవన్‌రామ్ ఎంతో కృషి చేశారని, సమసమాజ స్థాపన దిశగా ఆయన రూపొందించిన విధానాలు అందరికీ ఆమోదయోగ్యమని అన్నారు. జగ్జీవన్‌రామ్ మార్గంలో ప్రయాణించిన వైఎస్ దళితుల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను రూపొందించారని గుర్తు చేశారు. ఎమ్మెల్యేలు ఎం.సుచరిత, తెల్లం బాలరాజు, గొల్ల బాబూరావు, కొరుముట్ల శ్రీనివాసులు, మద్దాల రాజేశ్ మాట్లాడుతూ.. దళితుల సంక్షేమం కోసం వైఎస్సార్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికోసం జగ్జీవన్‌రామ్ ఆశయసాధనలో వైఎస్ ముందుకుసాగారని కొనియాడారు. బాబూ జగ్జీవన్‌రామ్ గొప్ప రాజనీతిపాలకుడని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలకమండలి సభ్యుడు జూపూడి ప్రభాకరరావు కొనియాడారు. దళితుల హ క్కులను కాపాడటంలో జగ్జీవన్‌రామ్ ఎంతో కృషి చేశారని తెలిపారు. దళితుల అభివృద్ధికి వైఎస్సార్ కాంగ్రెస్ ఎంతో కృషి చేస్తోందని చెప్పారు. వైఎస్ రెక్కల కష్టంతో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన కుటుంబాన్ని అనేక రకాలుగా వేధిస్తున్న తీరును చూసి రాష్ట్రంలోని దళితులు ఆవేదన చెందుతున్నారని పార్టీ నేత నల్లా సూర్యప్రకాశ్‌రావు పేర్కొన్నారు.

విద్యుత్ చార్జీలపై ప్రజాగ్రహం
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రజా బ్యాలెట్‌లో వెల్లడి

రాష్ట్ర ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో పెంచిన విద్యుత్ చార్జీలపై ప్రజాగ్రహం వ్యక్తమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరవధిక నిరాహార దీక్షా శిబిరం వద్ద నిర్వహించిన ప్రజా బ్యాలెట్ కార్యక్రమంలో ఈ విషయం వెల్లడైంది. కరెంటు సత్యాగ్రహం దీక్షా శిబిరం వద్ద పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఏర్పాటు చేసిన బ్యాలెట్ పెట్టెలో ఓట్లు వేసిన 4,755 మంది ప్రజలు విద్యుత్ చార్జీల పెంపును తీవ్రంగా వ్యతిరేకి ంచారు. శుక్రవారం రాత్రి ఈ ఫలితాలను పార్టీ శాసనసభాపక్ష ఉప నాయకుడు ధర్మాన కృష్ణదాస్ వెల్లడించారు. చార్జీల పెంపును ఒక్కరు కూడా సమర్థించ లేదంటే ప్రజలెంత ఆగ్రహంతో ఉన్నారో తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రజల్లో ఇంతటి వ్యతిరేకత ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజా బ్యాలెట్ నడుస్తోందని, తమకు ఇప్పటికి అందిన సమాచారం ప్రకార ం యావత్ రాష్ట్ర ప్రజలు విద్యుత్ చార్జీల పెంపును మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నారని కృష్ణదాస్ స్పష్టం చేశారు. ప్రభుత్వం కరెంటు చార్జీలను తగ్గించేంత వరకూ వైఎస్ విజయమ్మ నేతృత్వంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరాహారదీక్షను కొనసాగిస్తారని కృష్ణదాస్ చెప్పారు.
Share this article :

0 comments: