9న బంద్ విజయవంతం చేయండి - వైఎస్సార్‌సీపీ పిలుపు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 9న బంద్ విజయవంతం చేయండి - వైఎస్సార్‌సీపీ పిలుపు

9న బంద్ విజయవంతం చేయండి - వైఎస్సార్‌సీపీ పిలుపు

Written By news on Thursday, April 4, 2013 | 4/04/2013


 విద్యుత్తు పోరులో భాగంగా ఈ నెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్త బంద్‌కు వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చిందని, రాష్ట్ర ప్రజలందరూ స్వచ్ఛందంగా స్పందించి బంద్‌ను విజయవంతం చేయాలని  పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ పిలుపునిచ్చారు. చంద్రబాబు అసమర్థ పాలన వల్లే విద్యుత్తు రంగంలో రూ. 24 వేల కోట్ల నష్టాలు వచ్చాయని, దానిని దివంగత వైఎస్సార్ లాభాల బాటలో పెట్టారని అన్నారు. విద్యుత్తు ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని, వైఎస్సార్‌పై కాంగ్రెస్, టీడీపీ కలిసి నిందలు వేయటం సిగ్గుచేటన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే: మేకపాటి

విద్యుత్ సమస్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం ఫలితమేనని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి విమర్శించారు. కరెంట్ కోతలు, వాతలకు నిరసనగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేపట్టిన సత్యాగ్రహం దీక్షా శిబిరాన్ని ఆయన బుధవారం సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. థర్మల్ విద్యుత్తుకు చర్యలు తీసుకోవడంలో పాలకులు విఫలమయ్యారన్నారు. సమన్వయంతో వ్యవహరించి నిపుణులతో చర్చించి ఉంటే ఈ పరిస్థితి దాపురించేది కాదన్నారు. అన్నివర్గాల సంక్షేమానికి విజయమ్మ చేస్తున్న దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

చంద్రబాబు మళ్లీ గెలవలేరు: నల్లపురెడ్డి
ప్రతిపక్ష నేత చంద్రబాబు మళ్లీ గెలిచే ప్రసక్తే లేదని, ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి సీఎం కాలేరని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. కరెంటు సత్యాగ్రహం శిబిరం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈ సారి ఎన్నికల్లో గెలవకపోతే జెండా పీకేయాల్సిందేనని బాబు తమ పార్టీ కార్యకర్తలకు చెబుతున్నారు. అది అక్షరాలా నిజం అవుతుంది. ప్రజలు కచ్చితంగా ఆయన్ను మూడోసారీ ఓడించబోతున్నారు. ఇక హైదరాబాద్‌లోని టీడీపీ ఆఫీస్‌ను హెరిటేజ్ సంస్థ కార్యాలయంగా మార్చుకోవాల్సిందే’ అని ప్రసన్న విమర్శించారు.
Share this article :

0 comments: