ఈ కాంగ్రెస్ సర్కారు నాలుగుసార్లు , చంద్రబాబు తన హయాంలో ఎనిమిదిసార్లు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈ కాంగ్రెస్ సర్కారు నాలుగుసార్లు , చంద్రబాబు తన హయాంలో ఎనిమిదిసార్లు

ఈ కాంగ్రెస్ సర్కారు నాలుగుసార్లు , చంద్రబాబు తన హయాంలో ఎనిమిదిసార్లు

Written By news on Wednesday, April 3, 2013 | 4/03/2013

ఈ కాంగ్రెస్ సర్కారు నాలుగుసార్లు కరెంట్ చార్జీలు పెంచింది
చంద్రబాబు తన హయాంలో ఎనిమిదిసార్లు పెంచారు
దీక్షలో 30 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు
ప్రజలను కాంగ్రెస్ అష్టకష్టాల పాలుచేస్తోంది: విజయమ్మ
ప్రభుత్వంతో టీడీపీ అధినేత చంద్రబాబు అంటకాగుతున్నారు
సర్కారును కాపాడుతూనే ఆయన బయట మాత్రం విమర్శిస్తున్నారు
ప్రజా సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వాన్ని విడిచిపెట్టి 
వైఎస్‌ను, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నారు
రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను భ్రష్టుపట్టించింది బాబే
బషీర్‌బాగ్‌లో ఉద్యమకారులపై కాల్పులు జరిపించింది ఆయన కాదా?
ఆయన హయాంలో 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకోలేదా?

సాక్షి, హైదరాబాద్: ‘‘గడిచిన 56 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రభుత్వం కరెంటు చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపింది. అలాంటి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం అదే ప్రభుత్వంతో అంటకాగుతోంది. ఇష్టానుసారంగా చార్జీల భారం మోపుతూ ప్రజలను అష్టకష్టాల పాలు చేస్తున్న కాంగ్రెస్‌కు, అదే ప్రభుత్వంతో అంటకాగుతూ బయటికి మాత్రం విమర్శలు చేస్తున్న ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలకు సమయమొచ్చినప్పుడు తగిన విధంగా బుద్ధి చెప్పాలి...’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పిలుపునిచ్చారు. అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు విఫలమైనందుకే ప్రజలపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా నిరవధిక నిరాహార దీక్ష చేపట్టినట్టు చెప్పారు. ప్రజలపై ఇష్టారాజ్యంగా కరెంటు చార్జీల భారం మోపడాన్ని నిరసిస్తూ విజయమ్మ మంగళవారం ఉదయం సత్యాగ్రహం పేరుతో నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. 

విజయమ్మతో పాటు 30 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు ఈ నిరాహార దీక్షలో కూర్చున్నారు. ప్రభుత్వం విధిస్తున్న విద్యుత్ కోతలు, వాతలకు నిరసనగా రాజధానిలోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రాంగణంలో సత్యాగ్రహం ప్రారంభించారు. సత్యాగ్రహం వేదికపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించి విజయమ్మ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దీక్ష ప్రారంభించారు. పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలా కుమారి సత్యాగ్రహానికి ప్రారంభ సూచకంగా విజయమ్మకు పూలమాల వేయగా, పార్టీ నేతలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పూల మాలలు వేయడంతో దీక్ష ప్రారంభమైంది. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడారు. విద్యుత్ చార్జీలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగడుతూ పాలక పక్షాన్ని నిలదీయాల్సిన టీడీపీ అందుకు భిన్నంగా సర్కారుకు అండగా నిలుస్తున్న తీరును తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ప్రజల నడ్డి విరుస్తున్న ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన టీడీపీ.. ఆ పని చేయకుండా మూడున్నరేళ్ల కిందట మరణించిన వైఎస్ రాజశేఖరరెడ్డి లక్ష్యంగా ఆయనను అప్రతిష్టపాలు చేయడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. కరెంటు చార్జీలు పెంచొచ్చా... ప్రజలు భరించే స్థితిలో ఉన్నారా అన్న విషయాన్ని కూడా అధికారంలో ఉన్న నాయకులు ఆలోచించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన మూడున్నరేళ్లుగా వరుసగా ప్రజలపై భారం మోపుతున్నారని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తన పాలనలో ప్రజలపై ఒక్క పైసా కూడా పన్ను విధించలేదని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

అయితే వైఎస్ రెక్కల కష్టంతో వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అన్నింటిపై పన్నులు వేస్తూ ప్రజల నడ్డివిరుస్తోందన్నారు. విద్యుత్ వినియోగదారులపై ఇప్పటికే రూ.32 వేల కోట్ల భారం మోపిందని చెప్పారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న ప్రతి సందర్భంలోనూ తమ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ఆందోళనలు, దీక్షలు, ధర్నాలు చేపట్టినట్టు తెలిపారు. విద్యార్థులకు ఫీజులు చెల్లించాలని, కష్టాల్లో ఉన్న రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని, సంక్షోభంలో ఉన్న నేతన్నలను ఆదుకోవాలని దీక్షలు చేసిన విషయాన్ని విజయమ్మ గుర్తుచేశారు. న్యాయమైన నీటి వాటా కోసం ఢిల్లీలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జలదీక్ష చేశారన్నారు. జగన్ బయట ఉన్నంత కాలం ప్రజా సమస్యలపై ఎన్నో దీక్షలు, పోరాటాలు చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం జగన్ జైల్లో ఉన్నా ప్రజల గురించే ఆలోచిస్తున్నారని సమస్యల పరిష్కారానికి దీక్షలు, ధర్నాలు చేయాలని చెబుతున్నారని విజయమ్మ అన్నారు. ప్రజల నుంచి ఎంత ప్రతిఘటన ఎదురవుతున్నా ఈరోజు కరెంటు చార్జీలను ప్రభుత్వం తగ్గించడానికి ముందుకు రాకపోవడంతో తామంతా నిరాహారదీక్ష చేయాలని నిర్ణయించామని వివరించారు.

అన్ని చార్జీలు పెంచేశారు..

రాష్ట్రంలో కరెంటు చార్జీలే కాదు, ఆర్టీసీ చార్జీలు, రిజిస్ట్రేషన్ పన్నులు అన్నీ పెంచేశారని, పల్లెల్లో మద్యం ఏరులై పారుతోందని విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజల పక్షంగా తాము ఈ విధానాలపై పార్టీ పరంగా ఎన్నో పోరాటాలు చేస్తూనే ఉన్నామని చెప్పారు. ‘‘చంద్రబాబునాయుడు తాను చాలా బాగా చేశానని తన ప్రభుత్వం ప్రజలకు మంచి పాలనను ఇచ్చిందని చెప్పుకుంటున్నారు. వ్యవసాయానికి తొమ్మిది గంటలు కరెంటు ఇచ్చానని చెబుతున్నారు. 

వాస్తవానికి బాబు పాలనలో 18 నుంచి 20 గంటలు కరెంటు లేకుండా ఉన్న రోజులున్నాయి. ఈ సంగతిని మరిచిపోతే ఎలా?’’ అని ఆమె ప్రశ్నించారు. ‘‘89, 99 నంబరు జీవోలు తెచ్చి బకాయిలు చెల్లించలేదనే నెపంతో రైతులను జైల్లో పెట్టించిన ఘనత చంద్రబాబుది కాదా? రైతులు ఇళ్ల వద్ద లేకుంటే వారి భార్యలను కొట్టిన మాట నిజం కాదా? నిరాశా నిస్పృహలతో బాబు హయాంలో 4 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న మాట నిజం కాదా? ఇవన్నీ బాబు మర్చిపోవచ్చు కానీ.. ప్రజలు మర్చిపోతారా? ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలన్నారు. ఎనిమిది సార్లు కరెంటు చార్జీలు పెంచిన ఘనత ఆయనది. చంద్రబాబు ఆనాడు ఎనిమిదిసార్లు కరెంటు చార్జీలు పెంచితే ఇప్పటి ప్రభుత్వం నాలుగేళ్లలో నాలుగుసార్లు పెంచింది. బాబు తన హయాంలో బషీర్‌బాగ్‌లో విద్యుత్ చార్జీల ఉద్యమంపై కాల్పులు జరపలేదా? ఆరోజున వైఎస్ 11 రోజుల పాటు దీక్ష చేశారు కూడా.. పోలీసు కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. 200 మందికి గాయాలయ్యాయి. కాల్పుల అనంతరం చంద్రబాబు పోలీసులను పరామర్శించారు గానీ రైతులను పలకరించిన పాపాన పోలేదు’’ అని విజయమ్మ నిప్పులు చెరిగారు. ‘‘ఆనాడు ప్రతి ఏటా 15 శాతం విద్యుత్ చార్జీలు పెంచుతానని ప్రపంచ బ్యాంకుతో చంద్రబాబు ఒప్పందం చేసుకున్న మాట నిజం కాదా? విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణ కోసం ప్రయత్నించింది చంద్రబాబు కాదా? విద్యుత్ వ్యవస్థను భ్రష్టు పట్టించింది చంద్రబాబే’’ అని అన్నారు.

సత్యాగ్రహంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..

విజయమ్మతో పాటుగా ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత, తానే టి వనిత, భూమా శోభా నాగిరెడ్డి, ధర్మాన కృష్ణదాస్, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, సుజయ్ కృష్ణ రంగారావు, పేర్నినాని, గొట్టిపాటి రవికుమార్, మద్దాల రాజేష్ కుమార్, కొడాలి నాని, జోగి రమేష్, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, గొల్ల బాబూరావు, బి.గుర్నాథరెడ్డి, కె.చెన్నకేశవరెడ్డి, కె.శ్రీనివాసులు, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఆళ్ల నాని, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, టి.బాలరాజు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, ఎ.వి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎన్.అమరనాథరెడ్డి, పిరియా సాయిరాజ్, ఎమ్మెల్సీలు మేకా శేషుబాబు, దేశాయి తిప్పారెడ్డి, జూపూడి ప్రభాకరరావు, ఆదిరెడ్డి అప్పారావు, సి.నారాయణరెడ్డి దీక్షలో కూర్చున్నారు. అంతకు ముందు విజయమ్మ తన నివాసం నుంచి ఎమ్మెల్యేలతో బయల్దేరి పంజాగుట్టలో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడ్నుంచి నేరుగా బషీర్‌బాగ్ విద్యుత్ అమరవీరుల స్తూపం వద్దకు వచ్చి శ్రద్ధాంజలి ఘటించారు. ‘పరిశ్రమలకు ఇచ్చింది పవర్ హాలిడే... రైతులకు మిగిలింది క్రాప్ హాలిడే...’ అని రాసి ఉన్న ప్లకార్డును విజయమ్మ స్వయంగా చేతబూని అక్కడి నుంచి పాదయాత్రగా ఆదర్శ్‌నగర్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్‌కు చేరుకుని దీక్షను ప్రారంభించారు. పార్టీ ముఖ్య నేత కొణతాల రామకృష్ణ దీక్షా కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

ఇదీ బాబు బండారం..
‘‘పాదయాత్ర చేస్తున్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక్క నిమిషం కూడా పాలించే హక్కు లేదని విమర్శిస్తున్నారు. అలా అంటూనే ప్రభుత్వంతో అంటకాగుతున్నారు. విద్యుత్‌పై ఆయన ఒక ‘బ్లాక్‌పేపర్’ విడుదల చేశారు. అందులో ఇప్పుడున్న ప్రభుత్వాన్ని, చార్జీలు పెంచుతున్న ఈ సర్కారును అస్సలు విమర్శించలేదు. కేవలం రాజశేఖరరెడ్డినే టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేశారు. మూడున్నరేళ్ల క్రితం మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా చంద్రబాబు ప్రతిరోజూ వైఎస్‌ను, ఆయన కుటుంబాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెడితే ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఇతర ప్రతిపక్షాలతో కలిసి రాలేదు. ఇపుడు బయట కూర్చుని బాబు ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో అధికార పక్షానికి అండగా నిలిచి బయట మాత్రం ఎమ్మెల్యేలతో దీక్షలు చేయిస్తున్నారు. తాను కూడా స్వయంగా దీక్ష చేశారు...’’ అని విజయమ్మ మండిపడ్డారు. ‘‘వైఎస్ మృతి చెందేనాటికి రాష్ట్ర ఆదాయం రూ.62 వేల కోట్లు ఉండేది. ఇపుడు ప్రభుత్వ ఆదాయం రూ.1.27 లక్షల కోట్లకు పెరిగింది. ప్రభుత్వ ఆదాయం ఇంతగా పెరిగినప్పుడు ప్రజల కోసం చేస్తున్నదేమిటి? ఖజానాను పెంచుకుంటున్నారే తప్ప ప్రజల ఆదాయం ఏమైనా పెరిగిందా? తాజాగా రూ.62 వేల కోట్ల అప్పు తెచ్చారు.. ఎవరి కోసం ఆ అప్పు తెచ్చారు..?’’ అని విజయమ్మ సూటిగా ప్రశ్నించారు. 

చంద్రబాబూ..
వందల కోట్లు దోచిపెట్టలేదా?

1989-94 మధ్య కాలంలో రాష్ట్ర విద్యుత్ బోర్డు మిగులులో ఉంటే టీడీపీ పాలించిన 1994-2004 కాలంలో విద్యుత్ సంస్థలకు రూ.20 వేల కోట్లు నష్టాలు వచ్చిన మాట నిజం కాదా అని విజయమ్మ ప్రశ్నించారు. ‘‘1994 మార్చి 31వ తేదీ నాటికి ఆస్తులు, అప్పుల నిష్పత్తి 101 ః 100గా ఉంటే అది చంద్రబాబు పాలనలో (1994-2004లో) అది 45 ః 100కు తగ్గిపోయింది. మళ్లీ వైఎస్ పాలించిన ఐదేళ్ల మూడు నెలల కాలంలో ఆ నిష్పత్తి 120 ః 100కు పెరిగింది..’’ అని గుర్తుచేశారు. నాడు చంద్రబాబు ప్రైవేటు రంగంలో విద్యుత్ ఉత్పాదన కోసం 23 ఒప్పందాలు చేసుకున్నారని, షార్ట్ గెస్టేషన్ ప్రాజెక్టులను నాఫ్తా ఇంధన ఆధారంగా తెచ్చారని చెప్పారు. ఆ తర్వాత వాటిని గ్యాస్ లేక పోయినా గ్యాస్ ఆధారిత ప్రాజెక్టులుగా మార్చారని గుర్తుచేశారు. 

ఆ రోజున అందరూ వాటిని బొగ్గు ఆధారిత ప్రాజెక్టులుగా ఏర్పాటు చేయాలని చెప్పినా బాబు పెడచెవిన పెట్టారన్నారు. గ్యాస్ అనుమతి లేకపోయినా వాటి ఆధారంగా విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించడం ద్వారా వందల కోట్ల రూపాయలను దోచిపెట్టిన విషయం బాబుకు గుర్తు లేదా అని విజయమ్మ నిలదీశారు. ‘‘ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు అంతటి చరిత్ర హీనుడు మరొకరు ఉండరు. ఆయన పాలనను అందరూ మరిచారనుకుంటున్నారేమో... ప్రజలు ఎన్నటికీ మరువరు. ప్రజలకు మంచి చేస్తే వారు గుండెల్లో పెట్టుకుని పూజిస్తారు..’’ అని అన్నారు. ‘‘షర్మిల పాదయాత్ర చేస్తున్నా, ఇది వరకు జగన్ ఓదార్పు యాత్ర చేసినా, సమస్యలపై దీక్షలు, ధర్నాలు చేసినా, ఇప్పు డు తాము దీక్షలు చేస్తున్నా.. అవన్నీ ప్రజల్లో చైతన్యం తేవడంతో పాటుగా వారికి ధైర్యం చెప్పడానికే...’’ అని విజయమ్మ చెప్పారు.

వర్షంలోనూ సత్యాగ్రహం...

మంగళవారం మధ్యాహ్నం జోరున వర్షం కురవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షా శిబిరం తడిసి ముద్దయింది. వర్షం పడుతున్నప్పటికీ నాయకులు దీక్షా శిబిరంపైనే ఉండిపోయారు. చాలా మంది నేతలు వర్షానికి తడిసిపోయారు. వేదిక పూర్తిగా తడవడంతో దీక్ష జరిగే చోటు పక్కనే తాత్కాలిక షామియానా ఏర్పాటు చేసి రాత్రి దీక్ష కొనసాగించే ఏర్పాట్లు చేశారు. చిత్తూరు జిల్లా బంగారుపాళెంలో ముందుగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాలు ఉండటంతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దీక్షకు రాలేక పోయారు. సొంత పనుల వల్ల దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి దీక్షలో పాల్గొనలేదని పార్టీ వర్గాలు తెలిపాయి.

వైద్య పరీక్షలు: సైఫాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో ఉస్మానియా వైద్య బృందం దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పరీక్షలు నిర్వహించారు. విజయమ్మ పల్స్ 82, షుగర్ సాధారణ స్థాయిలో ఉన్నాయని డాక్టర్లు తెలిపారు.

పరామర్శించిన నేతలు..

దీక్షలో కూర్చున్నవారిని పార్టీ నేతలు ఎంవీ మైసూరా రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, బాజిరెడ్డి గోవర్ధన్, డీఏ సోమయాజులు, కేకే మహేందర్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి తదితరులు పరామర్శించారు.
Share this article :

0 comments: