జగన్ అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేస్తారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేస్తారు

జగన్ అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేస్తారు

Written By news on Monday, May 6, 2013 | 5/06/2013

మహిళా నగారా ప్రతినిధుల సభలో విజయమ్మ
ఐక్యపోరాటాలతోనే లైంగిక దాడులకు అడ్డుకట్ట

బాపట్ల (గుంటూరు) నుంచి సాక్షి ప్రతినిధి: మహిళలపై దాడులకు గ్రామాల్లో విస్తరించిన బెల్టుషాపులే కారణమని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ చెప్పారు. మొన్న తెనాలి, నిన్న ఢిల్లీ, ఇటీవల చీరాలలో జరిగిన లైంగిక దాడులన్నీ మద్యం మత్తులో జరిగినవేనని గుర్తు చేశారు. వైఎస్ హయాంలో రాష్ట్రానికి మద్యం ఆదాయం రూ. రెండువేల కోట్లయితే ఇప్పుడది రూ.25 వేల కోట్లకు పెరిగిందనీ, దీనిని బట్టే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. జగన్ అధికారంలోకి రాగానే బెల్టుషాపులు ఎత్తివేసేలా చర్యలు తీసుకుంటారని విజయమ్మ హామీ ఇచ్చారు. 

పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా బాపట్లలో ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి మహిళా నగారాకు విజయమ్మ హాజరయ్యారు. ఉదయం ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన మహిళా ప్రతినిధుల సదస్సులో ప్రసంగించారు. మహిళలపై జరుగుతున్న అకృత్యాల్లో మన రాష్ట్రం అగ్రభాగాన ఉండటం దురదృష్టకరమని పేర్కొన్నారు. నామమాత్రంగా మృగాళ్లను అరెస్టు చేస్తున్నా నాలుగైదు రోజులకే బెయిల్‌పై బయటకు వచ్చేస్తున్నారని, అందుకే ఎవరూ భయపడటం లేదని అన్నారు. చట్టాలు సక్రమంగా అమలు చేసిన ప్పుడే మహిళలపై జరుగుతున్న దాడులు అరికట్టేందుకు వీలుంటుందని వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మహిళలను ఇబ్బంది పెట్టినవారిపై కఠిన చర్యలుండేవనీ, అందుకే దాడులుండేవి కాదని తెలిపారు. ఇప్పటి సర్కారు చట్టాల అమలులో ఉదాసీన వైఖరి అవలంభిస్తోందని, అందువల్లే దాడులు పెచ్చుమీరుతున్నాయని విమర్శించారు. మహిళలంతా ఐక్యంగా ఉంటే ఈ దురాగతాలను అరికట్టవచ్చని చెప్పారు.
మహిళాభ్యున్నతికి వైఎస్ కృషి

మహిళలను అన్నిరంగాల్లో ఆదుకునేందుకు వైఎస్ తీసుకున్న నిర్ణయాలు అమోఘమని విజయమ్మ పేర్కొన్నారు. సర్కారు పరంగా అందించే పలు సౌకర్యాలు మహిళల పేరునే ఇచ్చేవారన్నారు. చట్టసభల్లోనూ మహిళలకే ఎక్కువ అవకాశాలు ఇచ్చారని, ఆ క్రమంలోనే ఓ మహిళకు రాష్ట్ర హోంశాఖ బాధ్యతలు అప్పగించారంటూ గుర్తు చేశారు. ట్రిపుల్ ఐటీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాల ద్వారా రాష్ట్రంలో విద్యాభివృద్ధికి వైఎస్ కృషి చేశారని చెప్పారు. 

ఎమ్మెల్యే సుచరిత మాట్లాడుతూ మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్న వారిపై నిర్భయ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్లీనరీలోనే మహిళల కోసం ప్రత్యేక చట్టాలు అమలు చేయాలని తీర్మానించిన విషయం గుర్తుచేశారు. పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి మాట్లాడుతూ మహిళలకు మేమున్నామంటూ.. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ ఇవ్వని విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భరోసానిస్తోందనీ, అందుకు ఉదాహరణ ఈ మహిళా నగారా సదస్సు అని చెప్పారు. పార్టీ నాయకురాలు రోజా మాట్లాడుతూ బెల్టుషాపుల ప్రభావంతో ఎన్నో చిన్న కుటుంబాలు చితికి పోతున్నాయన్నారు. బెల్టుషాపులు మూయిస్తామని పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మహిళా తల్లులు స్వాగతిస్తున్నారని చెప్పారు. నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఉందని తెలిపారు. సీఈసీ సభ్యురాలు ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ మహిళలకోసం ఏర్పాటైన చట్టాలు అమలు చేసే నాయకత్వం త్వరలో రానుందని అన్నారు.

ఇవీ తీర్మానాలు

పోలీసు వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా సంస్కరణలు తీసుకురావాలి. ప్రతి పదివేల మంది జనాభాకు పది మందికి తక్కువ కాకుండా మహిళా కానిస్టేబుళ్ళను నియమించాలి. ప్రతి పట్టణం, ముఖ్య ప్రదేశాల్లో మహిళా పోలీసు స్టేషన్లు ఏర్పాటుచేయాలి. 

మహిళలపై జరుగుతున్న అత్యాచారాల విచారణకు ప్రత్యేకంగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలి. అత్యాచార కేసుల్లో విచారణ కాలపరిమితిని ఆరునెలలు మించకుండా నిర్దేశించాలి. 
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలి
ఇంటర్నెట్ వాడకం, పోర్నోగ్రఫీపై కఠిన చర్యలు చేపట్టాలి. 
సినిమాలు, టీవీల్లో అశ్లీలతపై కొరడా ఝళిపించే విధంగా సెన్సార్‌షిప్‌ను బలోపేతం చేయాలి. లైగింక వేధింపులు, అత్యాచారానికి గురైన బాధితులకు, వారి కుటుంబాలకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుని వైద్య సదుపాయం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలతోపాటు పునరావాసం కల్పించాలి.
Share this article :

0 comments: