తెలుగమ్మాయి దయనీయ గాథ ఇది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తెలుగమ్మాయి దయనీయ గాథ ఇది

తెలుగమ్మాయి దయనీయ గాథ ఇది

Written By ysrcongress on Sunday, January 29, 2012 | 1/29/2012

టీటీసీ చేసి.. ఉపాధ్యాయురాలు కావాలన్నదే లక్ష్యం
తండ్రి కూలీ.. డబ్బుల్లేకపోవడంతో భిక్షాటన
శ్రావణిది అనంతపురం జిల్లా పుట్టపర్తి

అలప్పుజ(కేరళ): అనుకున్నది సాధించడానికి రాష్ట్రం కాని రాష్ట్రంలో చేతులు జోడించి భిక్షమెత్తుకుంటున్న తెలుగమ్మాయి దయనీయ గాథ ఇది. తనకు టీచర్ అయ్యేందుకు చేయూతనివ్వాలని ఆమె వేడుకుంటోంది. అనంత పురం జిల్లా పుట్టపర్తికి చెందిన పేద బాలిక శ్రావణి ‘వెనిస్ ఆఫ్ ది ఈస్ట్’గా పేరొందిన కేరళలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం అలప్పుజలో కొన్ని రోజులుగా పర్యాటకుల ముందు చేయి చాస్తోంది. 17 ఏళ్ల శ్రావణి గత ఏడాది ఇంటర్(సీఈసీ)లో వెయ్యికి 752 మార్కులతో పాసైంది. ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాతుంది. పుట్టుకతోనే ఎడమ చేయికి వైకల్యముంది. తల్లిదండ్రులు రామాంజినమ్మ, నరసింహన్న. శ్రావణి చిన్న కూతురు. తండ్రి చిన్నాచితకా కూలీ పనులు చేసుకుంటున్నాడు. తల్లి అనారోగ్యంతో పుట్టపర్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తండ్రికీ గుండెజబ్బు ఉంది. 

శ్రావణి టీచర్ ట్రైనింగ్ కోర్సు(టీటీసీ) చేసి టీచర్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఆ కోర్సుకు అవసరమయ్యే డబ్బు తండ్రి దగ్గర లేదు. దీంతో బిచ్చమెత్తుకోవాలని నిర్ణయించుకుంది. గతంలో ఒకసారి వలసకార్మికులతో కలసి కేరళ చేరుకుని నెల్లాళ్లు ఉంది. తాజాగా పదిరోజుల కిందట మళ్లీ తమ జిల్లాకు చెందిన జంగాలప్ప అనే బిచ్చగాడితో కలిసి అలప్పుజ చేరుకుంది. శ్రావణి అలప్పుజ ప్రభుత్వాస్పత్రి ముందు అడుక్కుంటుండగా ఓ ఆటోడ్రైవర్ ఆమెను గమనించాడు. ఆమె బాగా చదువుకుందని తెలుసుకుని ఆ విషయాన్ని కేర ళ సంక్షేమ కమిటీ అధికారులకు చెప్పారు. దీంతో అధికారులు ఆమెను శుక్రవారం అలప్పుజ మహిళా మందిరానికి(ఉమెన్స్ హోం) తరలించారు.


రూ.24 వేలు కావాలి: శ్రావణి విలేకర్లతో తన కష్టాలు చెప్పుకుని భోరున విలపించింది. ‘మా ఇంట్లో నేనొక్కదాన్నే చదువుకున్నా. తొలుత నర్సు కావాలనుకున్నా. నా ఎడమ చేయి సరిగ్గా లేదు. దాంతో టీచర్ అవ్వాలనుకున్నా. ఏప్రిల్‌లో మొదలయ్యే ఆ కోర్సుకు 24 వేల రూపాయలు కావాలి. గత తొమ్మిది రోజుల్లో వీధుల్లో, ఇళ్ల ముందు బిచ్చమెత్తుకుని 2,834 రూపాయలు కూడబెట్టుకున్నా. ఖాళీ సమయంలో టీటీసీ, ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరిగే విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్‌ఏ)పరీక్షలకు ప్రిపేరవుతున్నా. వీఆర్‌ఏ హాల్ టికెట్ వచ్చింది. పరీక్ష రాసేందుకు మా ఊరికి వెళ్తా’ అని చెప్పింది.
http://www.sakshi.com/main/FullStory.aspx?CatId=311297&Categoryid=1&subCatId=32
Share this article :

0 comments: