నీటి ప్రాజెక్టులపై రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నీటి ప్రాజెక్టులపై రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యం

నీటి ప్రాజెక్టులపై రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యం

Written By ysrcongress on Wednesday, February 1, 2012 | 2/01/2012

ప్రాధాన్యత జాబితానూ పట్టించుకోని వైనం
బడ్జెట్ కేటాయింపులతో సరిపెడుతున్న ప్రభుత్వం
ఈ ఏడాది రూ.15 వేల కోట్లు కేటాయించినా రూ.6.6 వేల కోట్లే విడుదల
రెండు, మూడు కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టులకూ నిధులు కరువే
చివరి దశ పనులు సైతం ఏళ్ల తరబడి పెండింగ్

హైదరాబాద్, న్యూస్‌లైన్:

ర్యాలీవాగు ప్రాజెక్టు: కేవలం రూ.2.25 కోట్లిస్తే ఇది పూర్తవుతుంది. కానీ ప్రభుత్వానికి మనసు రాదు. 

మత్తడివాగు ప్రాజెక్టు: అదే పరిస్థితి.. రూ.2.30 కోట్లతో ఇది పూర్తవుతుందని ప్రభుత్వమే పేర్కొంది. అయినాసరే ఈ ఏడాది ఒక్క పైసా రాల్చలేదు.

వంశధార-1 ప్రాజెక్టు: రూ.20 కోట్లు బడ్జెట్ కేటాయించినా ఇచ్చింది మాత్రం సున్నా..!

గొల్లవాగు ప్రాజెక్టు: రూ.11 కోట్లు కేటాయించి కేవలం రూ.8 లక్షలు ఇచ్చారు!!

నీటిపారుదల ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతున్న రాష్ట్ర సర్కారు వాస్తవంగా ఇస్తున్న ప్రాధాన్యం ఇదీ. అసలు మొదలే పెట్టని ప్రాజెక్టుల మాట అలా ఉంచితే.. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయడానికి వీలుగా రూపొందించిన ప్రాధాన్యత జాబితాలోని ప్రాజెక్టులను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బడ్జెట్‌లో కేటాయింపులు చేస్తున్నా.. విడుదల చేయడంలో మాత్రం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సకాలంలో నిధులు సమకూర్చి పనులు నిర్వహిస్తే నాలుగైదు మాసాల్లో పూర్తయ్యే ప్రాజెక్టులను సైతం గాలికొదిలేసింది. ప్రాజెక్టుల్ని పూర్తి చేసి రైతన్నలకు నీళ్లందిస్తామని గత రెండేళ్ల నుంచి చెప్తున్నా...ఇప్పటికే రెండు ఖరీఫ్ సీజన్లు దాటిపోయినా... ఆ హామీ మాత్రం నెరవేరడం లేదు. ఇదే వైఖరి కొనసాగితే మరో పదేళ్లైనా ప్రాజెక్టులు పూర్తయ్యే పరిస్థితి లేదని కాంట్రాక్టర్లు అంటున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం జలయజ్ఞంపై ప్రభుత్వ వైఖరి పూర్తిగా మారిపోయింది. నిధుల విడుదల గగనమైపోయింది. 

ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా నిధులను విడుదల చేసి త్వరితగతిన పూర్తి చేసేందుకు వీలుగా ప్రాజెక్టుల్ని విభజించారు. నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులను ఒకేసారి పూర్తి చేయడం కష్టమనే పేరిట ప్రాజెక్టుల ప్రాధాన్యత జాబితాను రూపొందించారు. చివరి దశకు చేరుకున్న వాటిని ఈ జాబితాలో చేర్చారు. మొదటి ఆరు మాసాల్లోనే సగం ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తామని అప్పట్లో సర్కార్ ప్రకటించింది. 

ఈ జాబితాను రూపొందించి రెండున్నరేళ్లు అవుతోంది. కానీ ఇప్పటికి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. ప్రాజెక్టు పనుల్ని త్వరగా పూర్తయ్యే విధంగా ఈ రెండేళ్లలో ఏనాడూ ప్రభుత్వం పట్టించుకోలేదు. వీటికి ప్రత్యేకంగా ఒక్క పైసాను ఇవ్వలేదు. బడ్జెట్ కేటాయించినా కొన్ని ప్రాజెక్టులకు చిల్లిగవ్వ ఇవ్వలేదు. కొన్నిటికి సగం కూడా ఖర్చు పెట్టలేకపోయారు. పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల, దుమ్ముగూడెం-సాగర్ టెయిల్‌పాండ్ వంటి ప్రాజెక్టులను పూర్తిగా పక్కకు పెట్టారు. సగం పనులు పూర్తయిన వాటిని, కనీసం చివరి దశలో ఉన్న వాటిని అయినా పట్టించుకున్నారా?... అదీ లేదు. ఆదిలాబాద్‌లోని రాలివాగు ప్రాజెక్టుకు రూ.2.25 కోట్లు అవసరం ఉంది. ఈ మేరకు బడ్జెట్‌లో కేటాయింపుల్ని కూడా చేశారు. కానీ ఈ ఏడాది ఒక్క పైసాను ఖర్చు పెట్టలేదు. అలాగే మత్తడి వాగు ప్రాజెక్టు పూర్తికి రూ.2 కోట్ల 30 లక్షలు అవసరమని భావించి బడ్జెట్‌లో కేటాయించారు. ఖర్చు మాత్రం సున్నా. ఇక నిజామాబాద్‌లోని చౌటుపల్లి హన్మంతరెడ్డి లిఫ్ట్ పూర్తి కావాలంటే రూ.10 కోట్లు అవసరం కాగా ఇప్పటివరకు రూ.7.98 కోట్లను మాత్రమే సమకూర్చారు. రూ.11 కోట్లను వ్యయం చేస్తే పూర్తయ్యే గొల్లవాగు ప్రాజెక్టుకు ఇచ్చింది కేవలం 8 లక్షలు మాత్రమే. అలాగే ఝంజావతికి రూ.17 లక్షలు మాత్రమే విదిల్చారు. కల్వకుర్తి, దేవాదుల, ఎల్లంపల్లి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, హంద్రీ-నీవా, గాలేరు-నగరి వంటి భారీ ప్రాజెక్టులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. 


వీటికి సకాలంలో నిధులను సమకూర్చి, పనుల్ని పర్యవేక్షిస్తే...పూర్తయ్యే వీలు ఉంది. కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి మొదటి దశను పూర్తి చేయడానికి అవకాశం ఉంది. అయినాసరే .. సర్కార్ ప్రాజెక్టుల పూర్తిపై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు. ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.15,010 కోట్లను కేటాయించారు. రూ. 6,642 కోట్లు ఖర్చు పెట్టారు. జలయజ్ఞం పనులకు సంబంధించి సర్కార్ మొదటి నుంచీ ఏదో పేరిట కొర్రీలను వేస్తూనే ఉంది. కొంతకాలం నిధుల కొరత అంటూ బిల్లుల చెల్లింపుల్ని నిలిపివేసింది. దాంతో పెండింగ్ బిల్లులు పేరుకుపోయి పనుల నిర్వహణపై ప్రభావం పడింది. కొన్ని ప్రాజెక్టుల్ని ప్రభుత్వం కావాలనే పక్కన పెట్టిందనే విమర్శలున్నాయి. కాగా ధరలను సవరించాలనే డిమాండ్ కొద్దికాలంగా కాంట్రాక్టర్లు మొత్తానికే ప్రాజెక్టుల పనులు నిలిపివేశారు.
Share this article :

0 comments: