కాంగ్రెస్ పార్టీకి జీవిత, రాజశేఖర్ గుడ్‌బై - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్ పార్టీకి జీవిత, రాజశేఖర్ గుడ్‌బై

కాంగ్రెస్ పార్టీకి జీవిత, రాజశేఖర్ గుడ్‌బై

Written By ysrcongress on Thursday, February 2, 2012 | 2/02/2012

సినీనటులు జీవిత, రాజశేఖర్‌లు మరోసారి పార్టీ మార్చారు. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ సినీ దంపతులు ఇవ్వాళ హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఎల్లుండి పుట్టినరోజు సందర్భంగా ఇంట్లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని వీడిన విషయాన్ని స్పష్టం చేశారు. చిరంజీవితో బద్ధశత్రుత్వం ఉన్న ఈ దంపతులు తాజాగా పీఆర్పీ విలీనాన్ని జీర్ణించుకోలేకపోయారు. తమను ఊరురా తిప్పి ప్రచారం చేయించుకున్న కాంగ్రెస్ పార్టీ కనీసం మాట మాత్రం చెప్పకుండా చిరంజీవిని చేర్చుకున్నారని జీవిత, రాజశేఖర్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడూ పార్టీని తిట్టినవారినే ఇప్పుడు చేర్చుకున్నారని అన్నారు. 70 లక్షల ఓట్లున్న పార్టీని చేర్చుకోవడం సహజమేనని, దాన్ని తప్పనడం లేదని, తమతో ఒక మాట చెప్పి ఉంటే.. సంతోషించేవాళ్లమని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పార్టీలో కొనసాగడం సరికాదన్న ఆలోచనతో బయటికొచ్చేశామని అన్నారు. దాదాపు అన్ని పార్టీల్లోనూ చేరి బయటకు వచ్చేసిన రాజశేఖర్ దంపతులు ఇక భవిష్యత్ చేరికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు అప్పట్లో టిడిపి ఆహ్వానించినా సరైనా నిర్ణయం తీసుకోలేకపోయారని, నిస్వార్థంగా ఏ పార్టీ ప్రజలకు సేవ చేస్తే ఆ పార్టీలో చేరతామని ప్రకటించారు.
Share this article :

0 comments: