కక్షే తప్ప సాక్ష్యమేదీ! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కక్షే తప్ప సాక్ష్యమేదీ!

కక్షే తప్ప సాక్ష్యమేదీ!

Written By ysrcongress on Thursday, February 2, 2012 | 2/02/2012

ఎమ్మార్ కేసులో ఉద్దేశపూర్వకంగానే సునీల్ అరెస్టు
విల్లా కొనుగోలుదారుల నోట ఆయన పేరు చెప్పించేందుకు విఫలయత్నం
తమకు కావాల్సినట్టుగా తుమ్మలతో వాంగ్మూలం.. దాని ఆధారంగా అరెస్టు
సహ నిందితుని సాక్ష్యం చెల్లదని గతంలోనే స్పష్టం చేసిన సుప్రీంకోర్టు

ఎమ్మార్ కేసులో సునీల్‌రెడ్డిని హడావుడిగా, అత్యంత నాటకీయంగా అరెస్టు చేసిన సీబీఐ అధికారులు, చార్జిషీట్‌లో మాత్రం నిందితునిగా చేర్చలేకపోయారు! ఆధారాలు లేకుండానే సునీల్‌ను అరెస్టు చేశారని ఇప్పటికే అన్ని వైపుల నుంచీ విమర్శలు ఎదుర్కొంటున్న సీబీఐ అధికారులు, చార్జ్‌షీట్‌లో ఆయన పేరు చేర్చకపోవడం ద్వారా వాటికి తామే బలం చేకూర్చారు! దాంతో.. కేవలం ఉద్దేశపూర్వకంగానే సునీల్‌ను అరెస్టు చేశారన్న వాదనలే చివరికి నిజమయ్యాయి. ఎమ్మార్ కేసులో బుధవారం సాయంత్రం చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ అధికారులు, సునీల్‌రెడ్డి పాత్రపై అందులో కనీస స్థాయిలో కూడా నిర్దిష్టమైన ప్రస్తావనేదీ చేయలేదని తెలిసింది. 

ఎమ్మార్ కేసులో కోనేరు ప్రసాద్‌తో కలిసి విల్లాల కొనుగోలుదారుల నుంచి అధిక మొత్తాలు వసూలు చేశారన్న అంశానికి సం బంధించి సీబీఐ వద్ద నిర్దిష్టమైన ఆధారాలేవీ లేవు. సీబీఐకి కూడా ఈ విషయం స్పష్టంగా తెలుసు. అయినా సరే.. సునీల్‌రెడ్డిని ఎలాగైనా అరెస్ట్ చేయాల్సిందేనన్న ఉద్దేశంతో.. ఈ కేసులో మరో నిందితుడైన తుమ్మల రంగారావును సీబీఐ అధికారులు రంగంలోకి దించారు. ఆయన వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని సునీల్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇప్పటిదాకా రంగారావు ఇచ్చిన వాంగ్మూలాలే సీబీఐకి కీలకమవుతూ వస్తున్నాయి. ఎవరిని అరెస్టు చేయాలన్నా.. వారికి వ్యతిరేకంగా, తమకు కావాల్సినట్టుగా రంగారావుతో వాంగ్మూలాలను సంస్థ రాబట్టుకుంటూ వస్తోంది. సునీల్‌రెడ్డి విషయంలోనూ రంగారావుపైనే సీబీఐ ఆధారపడింది. 

కోనేరు ప్రసాద్, రంగారావే కలిసి ఎమ్మార్ కుట్రపన్నారని కోనేరు అరెస్టు, కస్టడీ సందర్భంగా దాఖలు చేసిన పిటిషన్‌లో సీబీఐ పేర్కొంది. కుంభకోణంలో వారిద్దరిదే కీలకపాత్ర అని కోర్టుకు నివేదించింది. కానీ సునీల్‌రెడ్డి అరెస్టు విషయంలో మాత్రం అందుకు విరుద్ధ్దంగా వ్యవహరించింది. కోనేరు, సునీల్ కలిసి కుట్రపన్నారని, విల్లాల విక్రయాన్ని కాగితాలపై తక్కువ ధరకు చూపి, వాస్తవంలో ఎక్కువకు విక్రయించడం ద్వారా సొమ్ము వెనకేసుకున్నారని సునీల్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో ఆరోపించింది. మరోవైపు విల్లాల కొనుగోలుదారుల నుం చి కోనేరు అధికంగా వసూలు చేశారని, ఆ మొత్తాలను దుబాయ్‌లోని తన కుమారుడు మధు ఖాతాల్లోకి మళ్లించారని ఇదే సీబీఐ గతంలో స్పష్టంగా తెలిపింది. మరి కోనేరు అధికంగా డబ్బు వసూలు చేస్తే, దాన్ని తన కొడుకు ఖాతాలకు మళ్లిస్తే.. ఈ ఉదంతంతో సునీల్‌రెడ్డికి ఏం సంబంధముంది? అలాంటప్పు డు ఏం నేరం చేశారని ఆయన్ను అరెస్టు చేశారు? అసలు సునీల్‌రెడ్డిని అరెస్టు చేయాల్సిన అవసరముందా? సునీల్‌రెడ్డి అధిక మొత్తాన్ని వసూలు చేశారనేందుకు సీబీఐ వద్ద ఒక్క సాక్ష్యమూ లేదు. 

ఎందుకంటే తమ నుంచి సునీల్‌రెడ్డి అధిక మొత్తాలు వసూలు చేశారని విల్లాల కొనుగోలుదారుల్లో ఒక్కరు కూడా ఇప్పటిదాకా చెప్పలేదు. నిజానికి వారితో అలా చెప్పించేందుకు విఫలయత్నం చేసిన సీబీఐ, ఆ తర్వాత రంగారావును రంగంలోకి తెచ్చింది. తమకు కావాల్సిన విధంగా, సునీల్‌రెడ్డికి వ్యతిరేకం గా ఆయనతో వాంగ్మూలం ఇప్పించింది. అందుకు ప్రతిఫలం గా.. రంగారావు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సీబీఐ వ్యతిరేకించలేదు! వాస్తవానికి ఈ కేసులో సహ నిందితునిగా ఉన్న రంగారావు ఇచ్చే వాంగ్మూలం గానీ, సాక్ష్యం గానీ చెల్లదు! సహ నిందితుల సాక్ష్యం చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు కూడా ఉంది. ఈ విషయం తెలిసి కూడా సీబీఐ పట్టించుకోలేదు. కానీ.. చార్జిషీట్‌లో నిందితునిగా చేర్చాలంటే కచ్చితంగా ఆధారాలుండి తీరాలి. సునీల్‌రెడ్డికి సంబంధించి ఎలాంటి ఆధారాలూ లేకపోవడంతో ఆయనను నిందితునిగా చేర్చకపోవడమే గాక, ప్రస్తావన కూడా చేయలేదు! చార్జిషీట్ దాఖలు గడువు దాకా సునీల్‌రెడ్డికి వ్యతిరేకంగా ఒక్క ఆధారమూ సేకరించలేకపోయిన సీబీఐ.. ఆ తరవాతెప్పుడో వాటిని సేకరించి అనుబంధ చార్జిషీట్ దాఖలు చేస్తామనడాన్ని న్యాయ నిపుణులే తప్పుబడుతున్నారు.
Share this article :

1 comments:

saraswati.salu said...

ప్రజలు ఛీ కొడుతున్నా ఇంకా మారని కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు, వైయస్ జగన్మోహన్ రెడ్డి బంధువు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకుడు వైయస్ కొండా రెడ్డిపై రౌడీ షీట్ తెరిచిన కడప జిల్లాకు చెందిన పులివెందుల పోలీసులు ....