చేనేత దీక్షను ప్రారంభించిన జగన్! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చేనేత దీక్షను ప్రారంభించిన జగన్!

చేనేత దీక్షను ప్రారంభించిన జగన్!

Written By ysrcongress on Sunday, February 12, 2012 | 2/12/2012

చేనేతల రుణ మాఫీ చేయాలంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ధర్మవరంలో ఆదివారం చేనేత దీక్షను ప్రారంభించారు. మూడు రోజులపాటు మొత్తం 48 గంటల దీక్షను జగన్ చేపట్టారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. పట్టు చీరలకు రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా.. దేశ వ్యాప్తంగా ధర్మవరంప్రసిద్ధి చెందాయన్నారు. అలాంటి ధర్మవరంలో 15 మంది చేనేత కార్మికులు మరణించారని.. రాష్ట్రంలో 50 మందికి పైగా చేనేత కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆత్మహత్యలకు పాల్పడిన చేనేత కార్మికులను ఏ ఒక్కరు పరామర్శించిన పాపాన పోలేదని ఆయన అన్నారు. చేనేత రంగానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వానికి తెలిసేలా దీక్షను చేపట్టానన్నారు. 

ప్రతి చేనేత కార్మికులకు రుణ మాఫీ చేయాలన్నదే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయమని.. అందుకే బడ్జెట్‌లో 300 కోట్ల రూపాయల్ని కేటాయించారని.. మహానేత మరణించిన తర్వాత చేనేతలకు రుణమాఫీ ఎందుకు చేయలేదని.. ఎప్పుడు చెల్లిస్తారని ఆయన ప్రశ్నించారు. అంతేకాక పేద విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఎందుకు చెల్లించడం లేదని ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. చేనేత రంగంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని.. చేనేత కార్మికునికి కనీస కూలీ కూడా గిట్టడం లేదన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిపించేలా.. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఢిల్లీ పెద్దల దిమ్మ తిరిగేలా సమాధానం చెప్పాలని స్వల్పంగా మాట్లాడారు.

Share this article :

1 comments:

sudheer said...

A great response to Y.S.Jagn Mohan Reddy in Anantapur.