పిటిషన్ ఉపసంహరించుకున్న విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పిటిషన్ ఉపసంహరించుకున్న విజయమ్మ

పిటిషన్ ఉపసంహరించుకున్న విజయమ్మ

Written By ysrcongress on Monday, January 16, 2012 | 1/16/2012

న్యాయవ్యవస్థపై గౌరవంతో సుప్రీంకోర్టులో తాను వేసిన కేసును వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ ఉపసంహరించుకున్నారు. చంద్రబాబు అక్రమాస్తుల కేసు విచారణను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాన్న విజయమ్మ వినతిపై సుప్రీంలో వాదనలు ముగిశాయి. 

చంద్రబాబు ఆయన బినామీలు కోర్టు ప్రక్రియను దుర్వినియోగ పరుస్తున్నారని విజయమ్మ తరఫు న్యాయవాదులు ముకుల్‌ రోహిత్గీ, సుశీల్‌కుమార్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఏ కోర్టయితే చంద్రబాబు అక్రమాస్తులపై విచారణకు ఆదేశించిందో ఆ కోర్టుకే వెళ్లకుండా ఉండేందుకు నాట్‌ బిఫోర్‌ మీ న్యాయవాదులతో వకాలత్‌లు వేయించారని వివరించారు. అందుకు తగిన ఆధారాలు చూపించారు.

దీనిపై విచారించిన జస్టిస్‌ బీఎస్ చౌహాన్‌, జస్టిస్‌ సీఎస్.ఠాకూర్‌ ధర్మాసనం నాట్‌ బిఫోర్‌ మీ వేయడం న్యాయవాదులు చేసిన ప్రక్రియ అని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థపై గౌరవం ఉంచి పిటిషన్‌ ఉపసంహరించాలని విజయమ్మ తరఫు న్యాయవాదులకు సూచించారు. మీరు జోక్యం చేసుకుంటారని భావించి సుప్రీంకోర్టుకు వచ్చామని, ఉపసంహరించుకోవాలని సూచించినందున ఆదేశాలు పాటిస్తున్నట్లు న్యాయవాది ముకుల్‌ రోహిత్గీ కోర్టుకు తెలిపారు.
Share this article :

0 comments: