నేటి నుంచి మళ్లీ ఓదార్పు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేటి నుంచి మళ్లీ ఓదార్పు

నేటి నుంచి మళ్లీ ఓదార్పు

Written By ysrcongress on Tuesday, January 17, 2012 | 1/17/2012

నాలుగో విడత ఓదార్పుయాత్రకు జిల్లా సన్నద్ధమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగో విడత ఓదార్పుయాత్ర మంగళవారం అమరావతి మండలం దిడుగు నుంచి ప్రారంభం కానుంది. దివంగత మహానేత వైఎస్ మరణం తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలను పరామర్శించడానికి నిర్వహిస్తున్న ఓదార్పుయాత్ర గుంటూరు జిల్లాలో కొన్ని రోజులుగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు మొత్తం 48 రోజులపాటు మూడు విడతలుగా ఓదార్పుయాత్ర నిర్వహించి తొమ్మిది నియోజకవర్గాల్లో పర్యటించిన జగన్ ప్రస్తుతం పదో నియోజకవర్గంలో యాత్ర కొనసాగిస్తున్నారు. అడుగడుగునా వినతులు, ప్రతి చోటా ఆత్మీయ స్వాగతాలు, ఆప్యాయతతో కూడిన పలకరింపులతోపాటు వెల్లువెత్తిన జనాభిమానం నడుమ ఓదార్పుయాత్ర నిర్ణీత షెడ్యూలు కంటే కొంత మేరకు ఆలస్యంగా సాగుతోంది.

గత ఏడాది అక్టోబర్ 16న మంగళగిరి నియోజకవర్గంలోని సీతానగరం నుంచి ప్రారంభమైన ఓదార్పుయాత్ర తెనాలి, వేమూరు నియోజకవర్గాల్లో పూర్తి చేసుకొని రేపల్లె పట్టణంలోకి ప్రవేశించి బహిరంగసభతో నవంబర్ 2వ తేదీన ముగిసింది. మళ్లీ రెండో విడత యాత్ర నవంబర్ 16న రేపల్లెలో ప్రారంభమై బాపట్ల, పొన్నూరు, పత్తిపాడు నియోజకవర్గాల్లో డిసెంబర్ 2వ తేదీ వరకు కొనసాగింది. ఐదురోజుల స్వల్ప విరామం తర్వాత డిసెంబర్ 7వ తేదీ పొన్నూరు నియోజకవర్గంలో ప్రారంభమై పొన్నూరు, తాడికొండ, నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగి, మేడికొండూరు మండలంలో ముగిసింది. మళ్లీ జనవరి 4వ తేదీన ప్రారంభమై 8 వరకు తాడికొండ, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పూర్తి చేసుకొని పెదకూరపాడు నియోజకవర్గంలో కొనసాగుతుంది.

నేటి ఓదార్పుయాత్ర షెడ్యూల్
జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర మంగళవారం గుంటూరు జిల్లా అమరావతి మండలం దిగుడు గ్రామం నుంచి ప్రారంభమవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు.

వివరాలు..

17-1-2012 మంగళవారం

అమరావతి మండలం
* దిడుగు నుంచి యాత్ర ప్రారంభం, వైఎస్సార్ విగ్రహావిష్కరణ
* జూపూడిలో విగ్రహావిష్కరణ
* అత్తలూరులో రెండు విగ్రహాల ఆవిష్కరణ

పెదకూరపాడు మండలం
* బుచ్చయ్యపాలెంలో పర్యటన
* రామాపురంలో పర్యటన
* పెదకూరపాడులో రెండు విగ్రహాల ఆవిష్కరణ


Share this article :

0 comments: