బహిరంగంగా ప్రకటించాల్సిన పెట్టుబడులపై రిలయన్స్ గోప్యత ఎందుకు పాటించింది? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బహిరంగంగా ప్రకటించాల్సిన పెట్టుబడులపై రిలయన్స్ గోప్యత ఎందుకు పాటించింది?

బహిరంగంగా ప్రకటించాల్సిన పెట్టుబడులపై రిలయన్స్ గోప్యత ఎందుకు పాటించింది?

Written By ysrcongress on Saturday, January 21, 2012 | 1/21/2012


ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్‌లో జేఎం ఫైనాన్షియల్ ద్వారా వాటా కొనుగోలు చేసింది తామేనని రిలయన్స్ ఇండస్ట్రీస్ హైకోర్టుకు చెప్పటంతో నేను నివ్వెరపోయా! దాంతో వారి బ్యాలన్స్ షీట్లో ఏవైనా వివరాలుంటాయేమోనని చూశా. ఏమీ కనిపించలేదు. చివరి కన్సాలిడేటెడ్ బ్యాలన్స్ షీట్లో మాత్రం రిలయన్స్ వివిధ సంస్థలకు రూ. 13,500 కోట్ల మేర రుణాలిచ్చినట్లుగా.. వాటిలో రూ. 7,800 కోట్లు నగదు రూపంలో తిరిగి వసూలయ్యేవిగా పేర్కొంది. అంతే! 

- ఎస్.పి.తుల్సియన్, ప్రముఖ స్టాక్ మార్కెట్ విశ్లేషకుడు (‘మింట్’ పత్రికలో వ్యాఖ్య)

రామోజీరావుకు చెందిన ఈటీవీలో కానీ, ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్‌లో కానీ తనకు వాటాలు ఉన్నాయనో, లేక తాను పెట్టుబడులు పెట్టాననో రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందే చెప్పిందా? అసలు రామోజీరావు సంస్థల్లో రిలయన్స్ పెట్టుబడులు ఎప్పుడు పెట్టింది? వార్షిక ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్లలో దీనికి సంబంధించిన వివరాల్ని పొందుపరిచిందా? ఒకవేళ పొందుపరచకుంటే ఆడిటర్లు దీనిని ఎందుకు గుర్తించలేకపోయారు? దీంట్లో ఎవరి వైఫల్యం ఎంతవరకూ ఉంది? బహిరంగంగా ప్రకటించాల్సిన పెట్టుబడులపై రిలయన్స్ గోప్యత ఎందుకు పాటించింది? రాష్ట్ర వ్యాప్తంగానే కాదు.. దేశవ్యాప్తంగానూ ఇపుడు అందరి మనసుల్నీ తొలుస్తున్న ప్రశ్నలివి. స్టాక్ మార్కెట్ నియంత్రణదారు ‘సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)’ కూడా ఇవే అంశాలపై సీరియస్‌గా దృష్టి సారించింది. ‘ఈటీవీ’లో తాను అంతకు ముందే వాటా కొన్నానని, దాంట్లో కొంత వాటాను నెట్‌వర్క్-18కు విక్రయిస్తున్నానని ఈ నెల 3న రిలయన్స్ ఇండస్ట్రీస్ తొలిసారిగా ప్రకటించింది.

నిజానికి లిస్టెడ్ సంస్థలు ఏ చిన్న పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాన్నయినా తొలుత స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేయాలి. ఆ తరవాతే సదరు నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటించాలి. కానీ రిలయన్స్ సంస్థ రూ. 2,600 కోట్లు రామోజీరావుకు చెందిన ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్‌లో పెట్టుబడి పెట్టి కూడా ఆ విషయాన్ని ఎక్స్ఛేంజీలకు చెప్పలేదు. ఈ పెట్టుబడిని నిమేష్ కంపానీకి చెందిన ఈక్వేటర్ ట్రేడింగ్ ఇండియా లిమిటెడ్, వినయ్ చజ్‌లానీకి చెందిన అనూ ట్రేడింగ్‌ల ద్వారా 2008 జనవరిలో తరలించినట్లుగా సాక్ష్యాధారాలతో సహా ‘సాక్షి’ ఇప్పటికే పలుమార్లు బయటపెట్టింది. 100 రూపాయల విలువైన ఒకో షేరును ఎక్కడా లేని విధంగా రూ. 5,28,630 చొప్పున కొనుగోలు చేసి కూడా.. నాలుగేళ్ల తరవాత ఈ నిర్ణయాన్ని రిలయన్స్ సంస్థ బహిరంగపరచటంతో దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. 

వార్షిక నివేదికల పరిశీలన 

ఈటీవీ చానళ్లలో గణనీయమైన వాటా కొనుగోలు చేసినట్లుగా, అందుకోసం రూ. 2,600 కోట్లు పెట్టుబడి పెట్టినట్లుగా రిలయన్స్ తన వార్షిక నివేదికల్లో చెప్పిందో లేదో ‘సెబీ’ ఇప్పటికే పరిశీలిస్తోంది. సదరు పరిశీలనతో ముడిపడి ఉన్న ముగ్గురు అధికారుల్ని ఉటంకిస్తూ ‘మింట్’ పత్రిక తాజాగా ఈ విషయం వెల్లడించింది. ఈ పత్రిక తెలిపిన వివరాల మేరకు.. ‘‘ఇలాంటి సమాచారాన్ని షేర్ హోల్డర్లకు (సంస్థ వాటాదారులకు) చెప్పటం తప్పనిసరి. రిలయన్స్ అలా వెల్లడించిందో లేదో చూస్తున్నాం’’ అని సెబీ సీనియర్ అధికారి ఒకరు తెలియజేశారు. ‘‘ప్రాథమిక సాక్ష్యాధారాల ప్రకారం చూస్తే ఈటీవీలో తనకున్న హోల్డింగ్స్ గురించి రిలయన్స్ ప్రత్యేకంగా ఎక్కడా వెల్లడించలేదు. లిస్టింగ్ ఒప్పంద నిబంధనల ప్రకారం ఇలా వెల్లడించటం తప్పనిసరి. వెల్లడించకపోవటం నిబంధనల ఉల్లంఘనే’’ అని రెండో అధికారి స్పష్టంచేశారు. ‘మింట్’తో పాటు స్టాక్ మార్కెట్ వ్యవహారాలను విశ్లేషించే పలు ప్రముఖ వెబ్‌సైట్లలో కూడా.. రామోజీ సంస్థల్లో రిలయన్స్ పెట్టుబడుల వ్యవహారంపై తీవ్ర చర్చ జరుగుతోంది. 

విజయమ్మ పిటిషన్ వేసేదాకా మౌనమే..!

నిజానికి రిలయన్స్ సంస్థ ‘ఈనాడు’లో పెట్టుబడులు పెట్టిన విషయాన్ని అధికారికంగా తెలియజేసింది మొదట ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనే. అది కూడా అసంపూర్ణంగా. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడి అక్రమాలు, అక్రమాస్తులపై రాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసిన దివంగత నేత వైఎస్ సతీమణి వై.ఎస్.విజయమ్మ తీవ్రమైన ఆరోపణలు చేశారు. చంద్రబాబు సీఎంగా ఉంటూ కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్లో గ్యాస్‌పై రాష్ట్రానికి గల హక్కును వదులుకున్నారని.. పెపైచ్చు రాయితీలు, ఇతర విషయాల్లో అడ్డగోలుగా రిలయన్స్‌కు సహకరించారని చెప్పారు. అందుకు ప్రతిఫలంగానే కష్టాల్లో ఉన్న రామోజీరావును ఆదుకోవటానికి నష్టాల్లో ఉన్న ఆయన సంస్థల్లో రిలయన్స్ పెట్టుబడులు పెట్టిందని, ఇది క్విడ్ ప్రో కో తప్ప మరొకటి కాదని ఆమె పేర్కొన్నారు. ఆమె పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు ధర్మాసనం.. దీనిపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్‌లతో విచారణకు ఆదేశించింది. ఆ కేసులో తన వాదన కూడా వినాలంటూ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్లో.. రామోజీ సంస్థలో తమ పెట్టుబడులు ఉంటే తప్పేమిటని, అది వ్యాపార నిర్ణయాల్లో భాగంగానే జరిగిందని రిలయన్స్ పేర్కొంది. అంతే తప్ప తమ పెట్టుబడి ఎంతనేది కానీ, ఎప్పుడు.. ఎవరి ద్వారా.. ఎలా పెట్టామన్నది కానీ వెల్లడించలేదు. జనవరి 3న డీల్ సందర్భంగా తమకు ఈటీవీలో రూ. 2,600 కోట్ల మేర వాటాలున్నట్లు తెలియజేసింది. అంతకుమించి స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇచ్చే ప్రకటనల్లో కానీ, వార్షిక నివేదికల్లో కానీ ఎక్కడా ఎన్నడూ వెల్లడించకపోవటం గమనార్హం.

నాడు ఈనాడులో అలా.. నేడు నెట్‌వర్క్-18లో ఇలా...

రిలయన్స్ పెట్టిన రూ. 2,600 కోట్లకు గాను.. ‘ఈటీవీ’కి చెందిన ఐదు ప్రాంతీయ భాషా న్యూస్ చానళ్లు, ఐదు ప్రాంతీయ భాషా వినోద చానళ్లలో 100 శాతం వాటా; ‘ఈటీవీ’ తెలుగు, ఈటీవీ-2లలో 49 శాతం వాటా రిలయన్స్‌కు దక్కింది. ఒకవేళ కంపానీ, చజ్‌లానీలు పెట్టిన రూ. 2,600 కోట్లే రిలయన్స్‌విగా భావిస్తే.. మొదట్లో వారికి ఆ పెట్టుబడికి గాను ఈటీవీ చానళ్లు, ఈనాడు, ప్రియా ఫుడ్స్ అన్నింట్లో 39 శాతం వాటా దక్కింది. అయితే ఈనాడులో, ప్రియా ఫుడ్స్‌లో వాటా పూర్తిగా వదులుకున్నందుకు కొన్ని చానళ్లలో 100 శాతం వాటా దక్కింది. ఈ బదలాయింపు ఎప్పుడు జరిగిందన్నది మాత్రం ఇప్పటిదాకా రిలయన్స్ కానీ, ఈనాడు కానీ వెల్లడించలేదు. 

ఇక తనకు దక్కిన వాటాల్లో.. ‘ఈటీవీ’ ప్రాంతీయ న్యూస్ చానళ్లను పూర్తిగాను, ప్రాంతీయ వినోద చానళ్లలో 50 శాతం వాటాను, తెలుగు చానళ్లలో 24.5 శాతం వాటాను టీవీ-18కు రూ. 2,100 కోట్లకు విక్రయిస్తున్నట్లుగా రిలయన్స్ పేర్కొంది. 

ఈ లెక్కన చూస్తే రిలయన్స్ బాగా లాభపడినట్లే. కానీ ఇక్కడో చిక్కుంది. ఈ వాటా కొనటానికి టీవీ-18 దగ్గర పైసా కూడా లేదు. పైగా దానికి రూ. 1,900 కోట్లకు పైగా అప్పులున్నాయి. మరెలా? 
తన వాటాను కొనటానికి అవసరమైన రూ. 2,100 కోట్లను, అప్పులు తీర్చుకోవటానికి అవసరమైన రూ. 1,900 కోట్లను.. మొత్తం రూ. 4,000 కోట్లను నెట్‌వర్క్-18 గ్రూపుకు రిలయన్సే అందజేస్తోంది. ప్రతిగా ఆ కంపెనీ జారీ చేస్తున్న రైట్స్‌ను రిలయన్స్ కొనుగోలు చేస్తోంది. ఇదీ లెక్క. అంటే మీ దగ్గరున్న వస్తువును వేరొకరికి అమ్ముతూ.. కొనుగోలు చేయటానికి వారి దగ్గర డబ్బులు లేకపోయినా.. ఆ డబ్బులు కూడా మీరే ఇచ్చి మరీ మీ ఆస్తిని అమ్ముతున్నారన్న మాట. పెపైచ్చు వారికి ఉన్న అప్పులు తీర్చుకోవటానికి అదనపు సొమ్ము సైతం ఇస్తున్నారన్న మాట. చిత్రమైన ఒప్పందం కదూ!!

రిలయన్స్ ఉల్లంఘనలివీ...


నిమేష్ కంపానీ, వినయ్ చజ్‌లానీ ద్వారా పెట్టిన పెట్టుబడులు తమవేనని రిలయన్స్ ఇప్పుడు అంగీకరించింది. కానీ ఈ పెట్టుబడులు పెట్టింది 2008లో. రిలయన్స్ వెల్లడించింది 2012లో. అంటే నాలుగేళ్లపాటు ఇంత పెద్ద నిర్ణయాన్ని వెల్లడించకపోవటం లిస్టింగ్ అగ్రిమెంట్‌ను తీవ్రంగా ఉల్లంఘించినట్లే. 

రిలయన్స్ ఇంత పెద్ద ఎత్తున మీడియాలోకి ప్రవేశిస్తున్నట్లు 2008లోనే ప్రకటించి ఉంటే.. ‘ఈనాడు’ లాంటి నష్టజాతక కంపెనీలో పెట్టుబడి పెట్టినందుకు ఆ ప్రభావం షేరు ధరపై తీవ్రంగా ఉండేది. వెల్లడించకపోవటమనేది నిబంధనల్ని కాలరాయటమే. 

రిలయన్స్ నుంచి పలు సంస్థలకు డిబెంచర్ల రూపంలో పెట్టుబడులు తరలినట్లు.. అవి ఈక్వేటర్ ట్రేడింగ్‌లోకి డిబెంచర్ల రూపంలో తరలినట్లు.. అక్కడి నుంచి ఉషోదయాలోకి పెట్టుబడిగా ప్రవహించినట్లు అప్పట్లో ఆ కంపెనీలు ఆర్‌వోసీకి దాఖలు చేసిన పత్రాల్లో చూపించాయి. డిబెంచర్లంటే ఒకరకంగా అప్పు ఇచ్చినట్లే. ఇప్పుడేమో తాను పెట్టుబడి పెట్టినట్లు, ప్రతిగా వాటా కొనుగోలు చేసినట్లు రిలయన్స్ చెబుతోంది. ఇదెలా సాధ్యమైంది? ఈ బదలాయింపు ఎప్పుడు జరిగిందనేది ఇంతవరకూ వెల్లడించలేదు. ఇది కూడా సెబీ నిబంధనలకు విరుద్ధమే. 

సెబీ నిబంధనలు ఇవిగో...

లిస్టింగ్ అగ్రిమెంట్ నిబంధనల ప్రకారం.. భౌతికంగా జరిగే ఏ లావాదేవీ గురించయినా లేక ధరపై ప్రభావం చూపించే ఏ నిర్ణయాన్నయినా కంపెనీ తక్షణం స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేయాలి. 

భౌతిక లావాదేవీలకు సంబంధించిన సమాచారం అంటే.. ఏవైనా వాటాలు జారీ చేసినా, కంపెనీల కొనుగోలు, విలీనాలు, డీ-మెర్జర్, అమాల్గమేషన్, రీస్ట్రక్చరింగ్, స్కీమ్ ఆఫ్ అరేంజ్‌మెంట్, కంపెనీ విభాగాల విక్రయం, మూసివేత తదితరాలకు సంబంధించింది. ఇతరత్రా సమాచారమూ దీని పరిధిలోకి వస్తుంది. 

సెబీ నిబంధనల ప్రకారం ఏదైనా త్రైమాసికంలో జరిగిన సంఘటన, లావాదేవీల్ని కంపెనీలు వెల్లడించటం తప్పనిసరి. ఆయా త్రైమాసిక ఫలితాల్ని అవగాహన చేసుకోవటానికి ఉపకరించే అంశాల్లో విస్తరణ పూర్తికావటం, ఇతర రంగాల్లోకి ప్రవేశించటం, సమ్మెలు-లాకౌట్లు, మేనేజిమెంట్‌లో మార్పు, మూలధన తీరుతెన్నుల్లో మార్పు వంటివి, ఇతరత్రా అంశాలు కూడా ఉంటాయి కనుక వాటి సమాచారమూ వెల్లడించటం తప్పనిసరి.
Share this article :

0 comments: