జనాదరణ ఉన్న నేత జగన్: గాదె వెంకట రెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జనాదరణ ఉన్న నేత జగన్: గాదె వెంకట రెడ్డి

జనాదరణ ఉన్న నేత జగన్: గాదె వెంకట రెడ్డి

Written By ysrcongress on Saturday, January 21, 2012 | 1/21/2012

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డికి నాయకత్వ లక్షణాలు లేవని ఎవరు అంచనా వేసినా తప్పేనని మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి అన్నారు. జగన్‌కు జనాదరణ ఉందన్నారు. ఆయన సభలకు జనం విపరీతంగా వస్తున్నారని గాదె గుర్తు చేశారు. ఆయనకు రాజకీయ లక్షణాలు లేవని తానెన్నడూ అనలేదన్నారు. 

సీనియర్ల సేవలు అవసరం లేదని పార్టీ భావిస్తోందేమోనన్న సందేహాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో కులభావన పెరుగుతోందని చెప్పారు. ఎన్నికల్లో అన్ని పార్టీలు కులాల ప్రాతిపదికనే టికెట్లు ఇస్తున్నాయని, ఈ విధానం సరికాదని గాదె అన్నారు

కేబినెట్‌లో తెలంగాణ ప్రాంతానికి ప్రాంతీయ సమతుల్యత దెబ్బతిందన్నారు. దామాషా ప్రకారం తెలంగాణ ప్రాంతానికి మరికొన్ని మంత్రి పదవులు రావాలని పరోక్షంగా ముఖ్యమంత్రికి ఆయన చురకలంటించారు.
Share this article :

1 comments:

sitams eie a sec 2010-14 said...

jagan ku prajadharana undi ani gade venkata reddy cheppalsina pani ledu maku telusu aa visayam. we are always with jagan