‘నేను బాగున్నా.. నౌ ఐ యామ్ పర్‌ఫెక్ట్..’ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘నేను బాగున్నా.. నౌ ఐ యామ్ పర్‌ఫెక్ట్..’

‘నేను బాగున్నా.. నౌ ఐ యామ్ పర్‌ఫెక్ట్..’

Written By news on Sunday, January 27, 2013 | 1/27/2013

‘నేను బాగున్నా.. నౌ ఐ యామ్ పర్‌ఫెక్ట్..’ అని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చెప్పారు. మరో ప్రజాప్రస్థానంలో షర్మిల మోకాలికి గాయమవడంతో ఆపరేషన్ జరిగిన విషయం తెలిసిందే. డాక్టర్ల సలహా మేరకు ఆరు వారాల విశ్రాంతి అనంతరం తదుపరి వైద్య పరీక్షల కోసం శనివారం ఆమె అపోలో ఆసుపత్రికి వచ్చారు. వైద్యులు షర్మిల మోకాలికి ఎంఆర్‌ఐ స్కాన్ తదితర పరీక్షలు నిర్వహించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు చంద్రశేఖర్‌రెడ్డి, మదన్‌మోహన్‌రెడ్డిలు షర్మిల ఆరోగ్య పరిస్థితిని మీడియాకు వివరించారు. ‘‘షర్మిల మోకాలి గాయం తగ్గింది. మోకాలి లోపలి భాగంలో ఉండే లిగమెంట్ సాధారణ స్థితికి చేరుకుంది. 

ఆమె నడక ప్రారంభించవచ్చు. కానీ కొన్ని సూచనలు పాటించాలి. ఉదయం, సాయంత్రం ఫిజియోథెరిపీ చేయాల్సి ఉంటుంది’’ అని చెప్పారు. మరోవైపు షర్మిల త్వరలో పాదయాత్రను మొదలుపెట్టాలనే ఆలోచనతో ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తెలిపారు. మరో ప్రజాప్రస్థానం పునఃప్రారంభంపై పార్టీలో చర్చించి రెండు మూడు రోజుల్లో తేదీని ప్రకటిస్తామన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో మొదలు కావొచ్చని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. షర్మిల వెంట ఆమె భర్త బ్రదర్ అనిల్‌కుమార్, వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, పార్టీ డాక్టర్ల విభాగం కన్వీనర్ గోసుల శివభరత్‌రెడ్డి తదితరులున్నారు.
Share this article :

0 comments: