కేంద్రాన్ని నిలదీయకుండా వైఎస్‌పై విమర్శలా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కేంద్రాన్ని నిలదీయకుండా వైఎస్‌పై విమర్శలా?

కేంద్రాన్ని నిలదీయకుండా వైఎస్‌పై విమర్శలా?

Written By news on Sunday, January 27, 2013 | 1/27/2013

కేంద్రాన్ని నిలదీయకుండా వైఎస్‌పై విమర్శలా?
కేసీఆర్‌ను విమర్శిస్తే ప్రజలను విమర్శించినట్లా?
వైఎస్ హయాంలో అత్యధిక లబ్ధి తెలంగాణకే

సాక్షి, హైదరాబాద్: ప్రజల ఆకాంక్షకు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఆడిస్తున్న రాజకీయ రాక్షస క్రీడకు టీఆర్‌ఎస్ తబలా వాయిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు విమర్శించారు. ఢిల్లీ పెద్దలు ఆడిస్తున్న తోలుబొమ్మలాటలో రాష్ట్రంలోని కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతలు నటిస్తూ ప్రజల్ని గందరగోళపరుస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణపై మోసగిస్తున్న కేంద్రాన్ని నిలదీయకుండా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆడిపోసుకోవడం అత్యంత హేయమైన చర్య అని ధ్వజమెత్తారు. ఆయన శనివారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. ప్రజల సెంటిమెంటును ఆసరా చేసుకొని కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కలిసి డ్రామాలాడుతున్నాయని మండిపడ్డారు.

కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌పై టీఆర్‌ఎస్ నేత కేటీఆర్ మాట్లాడిన ప్రతీమాట వైఎస్‌ను టార్గెట్ చేసి మాట్లాడటం చూస్తుంటే ఈ పార్టీల డ్రామాలు అర్థమవుతున్నాయన్నారు. రాజశేఖరరెడ్డి ఏనాడు కూడా తెలంగాణ వాదానికి, ప్రజలకు వ్యతిరేకంగా ప్రవర్తించలేదని తెలిపారు. తెలంగాణ అంశం కేంద్రం పరిధిలో ఉన్నందువల్లే సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో 42 మంది ఎమ్మెల్యేలను వైఎస్ ఢిల్లీకి పంపించిన విషయాన్ని గుర్తుచేశారు. వాస్తవాలు ఇలా ఉండగా 2009 ఎన్నికల సందర్భంగా వైఎస్ చేసిన వ్యాఖ్యలకు వక్రభాష్యం చెప్తున్న కేటీఆర్ ఒకసారి ఆ మాటల్ని పరిశీలించాలని హితవు పలికారు. ‘‘టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ అధికారంలో ఉంటే వీసా తీసుకోవాల్సి వస్తుందేమోనని ఆయన అన్నారు.

అంతేత ప్ప తెలంగాణవాదాన్ని, ప్రజలను ఎక్కడా కించపరచలేదు. టీఆర్‌ఎస్, కేసీఆర్‌ను విమర్శిస్తే ప్రజలను విమర్శించినట్లా? అలాగైతే అసెంబ్లీలో 610 జీవోపై సమైక్యవాదం వినిపించిన కేసీఆర్‌ను ఏమనాలో కేటీఆర్ చెప్పాలి. ఇచ్చంపల్లి గురించి మాట్లాడుతున్న కేటీఆర్ తన తండ్రి కేసీఆర్ 20 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగి కేంద్ర, రాష్ట్ర మంత్రి పదవులు కూడా నిర్వర్తించి ఆ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయారో వెల్లడించాలి’’అని డిమాండ్ చేశారు. వైఎస్ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమం అందించడంతో పేదప్రజలు ఆయన్ని ఆదరించడాన్ని ఓర్వలేక కాంగ్రెస్, టీఆర్‌ఎస్ దుష్ర్పచారం చేస్తున్నాయని గట్టు విమర్శించారు. ఉచితవిద్యుత్, రుణమాఫీ, జలయజ్ఞం ద్వారా అత్యధికంగా లబ్ధి పొందింది తెలంగాణ ప్రాంతమేనని వివరించారు.

జలయజ్ఞం ద్వారా తెలంగాణలో ఎనిమిదిన్నర లక్షల ఎకరాలకు సాగునీరందించారని తెలిపారు. ‘‘కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశాన్ని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బోగస్ అంటారు. కాదు బ్రహ్మాండంగా జరిగిందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కీర్తిస్తారు. పరస్పర విరుద్ధంగా మాట్లాడుకుంటూనే మళ్లీ అంతా కలిసి తిరుగుతారు. ఆ రెండు పార్టీల నేతలు ప్రజల్ని గందరగోళపరుస్తున్నారు’’ అని గట్టు విమర్శించారు. ‘‘తెలంగాణ వస్తే కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ కలుస్తదట. ఒకవేళ రాకుంటే కాంగ్రెస్ టీఆర్‌ఎస్‌లో కలుస్తదట. మళ్లీ ఇద్దరూ కలిసి సోనియమ్మకు కాళ్లు మొక్కుతారట’’ అని ఎద్దేవా చేశారు.
Share this article :

0 comments: