పిడుగురాళ్ల చేరుకున్న వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పిడుగురాళ్ల చేరుకున్న వైఎస్ జగన్

పిడుగురాళ్ల చేరుకున్న వైఎస్ జగన్

Written By ysrcongress on Tuesday, February 7, 2012 | 2/07/2012

ఓదార్పు యాత్ర కోసం ఈ ఉదయం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చేరుకున్నారు. విశాఖ పర్యటన ముగించుకొని ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో ఆయన పిడుగురాళ్లకు వచ్చారు. ఉదయం ఐదున్నర ప్రాంతంలో వచ్చిన జగన్‌కు అభిమానులు ఘనస్వాగతం పలికారు. 

పార్టీ నేతలు అంబటి రాంబాబు, జంగా కృష్ణమూర్తి, అప్పిరెడ్డితోపాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు స్వాగతం పలికారు. అసంఖ్యాకంగా జనం రైల్వేస్టేషన్‌ రావడంతో బయటకు రావడానికే ముప్పావు గంటకు పైగా పట్టింది. అక్కడి నుంచి ఆయన బస చేసిన నర్సరావుపేట అడ్డరోడ్డులోని సాగర్‌ప్రియ గెస్ట్‌ హౌస్‌ వరకు రోడ్డు వెంట ప్రజలు అడుగడుగునా జగన్‌కు స్వాగతం పలికారు.

జిల్లా లో ఓదార్పు యాత్ర మంగళవారం నుంచి పునఃప్రారంభం కానుంది. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం రాత్రి విశాఖ పర్యటన ముగించుకుని ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంగళవారం వేకువజామున పిడుగురాళ్ళ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గాన నకరికల్లు వెళతారు. ఉదయం 9.30 గంటల నుంచి యాత్రను ప్రారంభించేలా నేతలు షెడ్యూల్‌ను సిద్ధం చేశారు. తొలుత నరసరావుపేట నియోజకవర్గం రొంపిచర్ల, నకరికల్లు మండలాల పరిధిలోని నకరికల్లు అడ్డరోడ్డు, ఎడ్వర్టుపేట, పాపిశెట్టిపాలెం, చేజర్ల, కుంకులగుంటలలో పర్యటిస్తారని, ఎడ్వర్టుపేటలో వైఎస్సార్ మరణం తట్టుకోలేక మృతిచెందిన వెన్నపూస పిచ్చిరెడ్డి కుటుంబాన్ని ఓదారుస్తారని పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ప్రోగ్రామ్స్ కమిటీ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. తర్వాత కొత్తపల్లి చేరుకుని కొండా రత్తమ్మ కుటుంబాన్ని ఓదారుస్తారని, అనంతరం విప్పర్లరెడ్డిపాలెంలో ఓదార్పు యాత్ర నిర్వహించనున్నారని తెలిపారు.
Share this article :

0 comments: