లోకేష్ చదువుకు అయిన ఖర్చును బాబు తన ఐటీ రిటర్న్స్‌లో చూపారా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » లోకేష్ చదువుకు అయిన ఖర్చును బాబు తన ఐటీ రిటర్న్స్‌లో చూపారా?

లోకేష్ చదువుకు అయిన ఖర్చును బాబు తన ఐటీ రిటర్న్స్‌లో చూపారా?

Written By ysrcongress on Wednesday, February 8, 2012 | 2/08/2012

పత్రికలు, చానళ్లలో తప్పుడు వార్తలొస్తున్నా పట్టించుకోవడం లేదు
సీబీఐ నియమావళి ప్రకారం వాటిపై తప్పనిసరిగా వివరణ పంపాలి అధికారులకు ఇవేమీ పట్టడం లేదు 
జగన్ పేరు చెప్పాల్సిందిగా ఐఏఎస్‌లను బెదిరిస్తున్నారుఫ్యాక్షన్ నేతల తరహాలో కక్షగట్టి దర్యాప్తు చేస్తున్నారు

రాష్ట్రంలో సీబీఐ అధికారులు, జాయింట్ డెరైక్టర్(జేడీ) లక్ష్మీనారాయణ తమ సంస్థ సొంత నియమావళినే పట్టించుకోవడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. ‘సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసులకు సంబంధించి వివిధ పత్రికలు, చానళ్లలో అడ్డగోలు వార్తలు వస్తున్నా సీబీఐ అధికారులు పట్టించుకోవడం లేదు. వాస్తవానికి ఇలాంటి అసత్య కథనాలు పత్రికలు, టీవీల్లో వచ్చిన వెంటనే సీబీఐ అధికారులు అవసరమైన రిజాయిండర్(వివరణ) ఇవ్వడం ద్వారా ఆయా అంశాల్లో స్పష్టత ఇవ్వాలని సీబీఐ నియమావళి చెబుతోంది’ అని తెలిపారు. 

సీబీఐ నియమావళి 24వ అధ్యాయంలోని 28వ అంశం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోందన్నారు. ‘తప్పుడు సమాచారంతో కూడిన కథనాలు పత్రికలు, చానళ్లలో వచ్చిన వెంటనే ఆయా శాఖల ఎస్పీలు స్పందించి, వివరణ జారీ చేయాలి. అవసరమైన స్పష్టత ఇవ్వాలి. స్థానిక పత్రికల్లో వచ్చిన కథనాలను ఢిల్లీలోని డిప్యూటీ ప్రిన్సిపల్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్(డీపీఐవో) దృష్టికి తీసుకెళ్లాలి. విడుదల చేసిన వివరణ కాపీలను డీపీఐవోకు పంపించాలి. అయితే, సీబీఐ వీటన్నింటినీ తుంగలో తొక్కుతోంది’ అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో మరో అధికార ప్రతినిధి పి.జనక్‌ప్రసాద్‌తో కలిసి వాసిరెడ్డి పద్మ విలేకరులతో మాట్లాడారు. ఏదైనా కేసును సీబీఐ దర్యాప్తు చేసేటప్పుడు అనుసరించాల్సిన విధానాన్ని నిర్దేశిస్తూ.. దర్యాప్తు సంస్థల పాలసీ డివిజన్ ఒక నియమావళిని రూపొందించిందని.. అయితే, రాష్ట్రంలో సీబీఐ అధికారులు, లక్ష్మీనారాయణ వీటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. 

జగన్‌ను లక్ష్యంగా చేసుకుని దర్యాప్తు..: దర్యాప్తు సందర్భంగా మీడియా, పత్రికలతో సీబీఐ వ్యవహరించాల్సిన తీరుపై సంస్థ నియమావళిలోని 24.9 నుంచి 24.31 నిబంధనల్లో స్పష్టత ఇచ్చారని వాసిరెడ్డి పద్మ తెలిపారు. ‘ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్రను దర్యాప్తు సంస్థలు విస్మరించకూడదు. ప్రజాప్రాధాన్యం ఉన్న కేసుల వివరాలు తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన కేసు అయితే.. జాయింట్ డెరైక్టర్ అనుమతితో స్థానిక విభాగం ఎస్పీ వివరణజారీ చేయాలి. ఒకవేళ ఆ వివరణను పత్రికలు ప్రచురించకపోతే.. నిబంధనల ప్రకారం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు వారిపై ఫిర్యాదు చేయవచ్చు. కానీ మన రాష్ట్రంలో సీబీఐ అధికారులు మాత్రం అలా చేయడం లేదు. సాక్షాత్తూ జేడీ లక్ష్మీనారాయణే నియమావళిని పట్టించుకోవడం లేదు’ అని దుయ్యబట్టారు. సీబీఐ అధికారులు కొందరు మీడియా ప్రతినిధులతో గంటల కొద్దీ ఫోన్లలో మాట్లాడుతూ.. కేసుల సమాచారాన్ని చెబుతున్నారని ఆరోపించారు. కొన్ని పత్రికలు పనిగట్టుకుని అదే పనిగా పతాక శీర్షికల్లో ఉన్నవీ లేనివీ నెలల తరబడి ప్రచురిస్తున్నా సీబీఐ స్పందించడం లేదని ఆమె విమర్శించారు. 

‘ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) అధికారులు విచారణ నిమిత్తం వై.ఎస్.జగన్‌ను ఢిల్లీకి పిలిచారని ఓ చానెల్ తప్పుడు వార్త ప్రసారం చేస్తే.. వారు వెంటనే స్పందించి.. తాము రమ్మని కోరలేదని వివరణ ఇచ్చారు. ఇక్కడ ఎన్ని తప్పుడు వార్తలు వచ్చినా.. సీబీఐ నోరు మెదపడం లేదు’ అని విమర్శించారు. ఢిల్లీ పెద్దల మెప్పు కోసం, ఎక్కడి నుంచో అందుతున్న ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు చేస్తోందన్నారు. ‘జగన్ పేరు చెప్పాల్సిందిగా ఐఏఎస్ అధికారులను సీబీఐ బెదిరించడం చూస్తుంటే.. ఫ్యాక్షన్ నాయకుల తరహాలో వారు కక్ష గట్టి దర్యాప్తు సాగిస్తున్నారనే విషయం తెలిసిపోతోంది. సీబీఐ తానే ఓ రాజకీయ పార్టీ పాత్రను పోషిస్తూ జగన్‌ను లక్ష్యంగా చేసుకుని.. ఆయన చుట్టూ దర్యాప్తు తిప్పుతోంది’ అని ధ్వజమెత్తారు. 

బాబుకా నైతిక హక్కు లేదు..

దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి, ఆయన కుమారుడు జగన్‌ను ఉద్దేశించి టీడీపీ అధినేత చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తికి ఇది తగదని జనక్ ప్రసాద్ హితవు పలికారు. ‘జగన్ పెంపకం గురించి బాబు నోరు పారేసుకుంటున్నారు. తన కుమారుడు లోకేష్‌ను పరాయి సొమ్ముతో చదివించిన బాబుకు అలా మాట్లాడే నైతిక హక్కు లేదు. అత్తెసరు మార్కులతో ఇంటర్ పాసైన లోకేష్ స్టాన్‌ఫోర్డులాంటి వర్సిటీలో చదవడానికి అవసరమైన కోట్లాది రూపాయల ఖర్చును ఎవరు భరించారన్న విషయాన్ని బాబు ఇంతవరకూ ఎందుకు చెప్పడం లేదు’ అని నిలదీశారు. ఈ ఖర్చును సత్యం రామలింగరాజు భరించిన మాట వాస్తవం కాదా? అసలు లోకేష్ చదువుకు అయిన ఖర్చును బాబు తన ఐటీ రిటర్న్స్‌లో చూపారా? అని ఆయన ప్రశ్నించారు.
Share this article :

0 comments: