వెయ్యి రూపాయల మేలు జరిగిందని లక్ష రూపాయలు వదిలేస్తారా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వెయ్యి రూపాయల మేలు జరిగిందని లక్ష రూపాయలు వదిలేస్తారా?

వెయ్యి రూపాయల మేలు జరిగిందని లక్ష రూపాయలు వదిలేస్తారా?

Written By ysrcongress on Friday, February 10, 2012 | 2/10/2012

అందుకే ప్రతాప్‌రెడ్డి పెట్టుబడులపై విషపు రాతలు
పయనీర్ హోటల్‌కు అనుమతిచ్చింది 2005లో
నాటి కార్యదర్శి లేఖ ఆధారంగానే సడలింపులపై జీవో
దాంతో పాటు మరో ఐదు హోటళ్లకూ అవే సడలింపులు
వాటిలో ఒక సెవన్‌స్టార్ హోటల్ కూడా ఉంది
ఇవేవీ పట్టించుకోని ‘ఈనాడు’
అనుమతిచ్చినందుకే పెట్టుబడులంటూ అడ్డగోలు రాతలు

సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వెయ్యి రూపాయల మేలు జరిగిందని లక్ష రూపాయలు వదిలేస్తారా? రూపాయి కలిసొచ్చిందని వంద రూపాయలు ఎదురిస్తారా? ఇంగితజ్ఞానం ఉన్నవాళ్లెవరూ అలా చేయరు. అసలలా చేస్తారని ఏ కొంచెం తెలివిడి ఉన్నవాళ్లయినా అనుకోరు కూడా. కానీ వైఎస్ రాజశేఖరరెడ్డిపై, ఆయన కుటుంబంపై నరనరానా ద్వేషం పెంచుకుని, నిలువెల్లా విషం నింపుకున్న రామోజీరావు మాత్రం అలా తప్ప ఇంకోలా ఆలోచించలేరు. సరికదా! ఆ ఊహల్నే తన పుత్రిక... ఎల్లో సిండికేట్ కరపత్రిక ‘ఈనాడు’లో రాసేసి... పాఠకులూ అలానే ఊహించాలని భావిస్తారు. పత్రికా విలువల్ని పాతాళానికి పడేస్తూ... కుక్కకీ-కుందేలుకీ ముడి వేస్తూ వైఎస్ ‘పెన్నా’గం శీర్షికతో గురువారం ఆయన అచ్చేసిన రోత కథనం సరిగ్గా ఆ బాపతే!


పెన్నా సిమెంట్స్ అధినేత ప్రతాప్‌రెడ్డి బంజారాహిల్స్‌లో తనకున్న స్థలంలో హోటల్ నిర్మిద్దామని భావించి... అందుకు అవసరమైన అనుమతులివ్వాలం టూ పురపాలకశాఖకు దరఖాస్తు చేసింది 2005లో. ప్రభుత్వానికి గనక ఆయనపై ప్రత్యేకమైన ప్రేమాభిమానాలుంటే... రామోజీ ఫిలింసిటీకి చంద్రబాబు చేసినట్టుగా దరఖాస్తు చేసిన వెంటనే సరేననాలి. దానికోసం ప్రత్యేక అధికారుల్ని నియమించి రామోజీ ఇంటికి పంపినట్టుగా పంపాలి. నిబంధనలన్నిటికీ నీళ్లొదలాలి. కానీ నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ ఇలాంటివేమీ చేయలేదు. కొత్త హోటళ్లకు అనుమతులు, సడలింపులు ఇవ్వాల్సిన అవసరాన్ని నాటి పర్యాటక శాఖ కార్యదర్శి వి.నాగిరెడ్డి లేఖ ద్వారా తెలియజేయడంతో... ప్రభుత్వ విధానా న్ని సవరించాలనుకున్నారు తప్ప ప్రతాప్‌రెడ్డికి అయాచిత లబ్ధి చేకూర్చాలనుకోలేదు. అందుకే నిబంధనల్ని సవరిస్తూ జీవో విడుదల చేశారు. ప్రతాప్‌రెడ్డితో పాటు దరఖాస్తు చేసిన మరో ఐదుగురి ప్రతిపాదనలూ ఓకే చేశారు. 

దీన్లో ప్రతాప్‌రెడ్డి ప్రతిపాదించింది చిన్న హోటలే కాగా... ప్రభుత్వం ఆమోదించిన వాటిలో ఓ సెవన్‌స్టార్ హోటల్ కూడా ఉంది. వీళ్లకు వైఎస్సార్ అయాచితంగా లబ్ధి చేకూర్చారని అనుకుంటే... వీళ్లందరూ ‘సాక్షి’లో పెట్టుబడి పెట్టి ఉండాలి. కానీ రామోజీకి ఇవేమీ అక్కర్లేదు. ఈ నిజాలతో పనే లేదు. ఇలా హోటళ్లు పొందినందుకు ఎవ్వరూ ‘సాక్షి’లో పెట్టుబడులు పెట్టలేదని, పెట్టరని తెలిసినా... ‘సాక్షి’ ఆర్థిక అంచనాలపై నమ్మకంతో, లాభాలొస్తాయన్న ఉద్దేశంతో పెన్నా ప్రతాప్‌రెడ్డి ఇన్వెస్ట్ చేశారని కూడా తెలిసినా... వైఎస్సార్ ప్రతిష్టను దిగజార్చటమే తన లక్ష్యం కాబట్టి... తన అడ్డగోలు రాతల్ని రాస్తూనే ఉంటారు.

‘ఈనాడు’ పాటి చెయ్యదనా?

‘సాక్షి’ పత్రిక ఆరంభంలోనే అత్యధిక సర్క్యులేషన్‌ను సాధించి జాతీయ స్థాయిలో 9వ స్థానంలో నిలిచింది. ‘ఈనాడు’కన్నా మెరుగైన టెక్నాలజీని, యంత్రాల్ని వాడుతోంది. ఎక్కడా అంచనాలు తప్పకుండా నాలుగేళ్లుగా అశేష పాఠకాదరణతో ముందుకెళుతూనే ఉంది. అలాంటి పత్రికలో షేరును రూ.350కి విక్రయిస్తే అది ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా, ప్రభుత్వం వద్ద లబ్ధి పొందినందుకే ఆ ధరకు షేర్లు కొన్నారన్నట్టుగా రామోజీ చెలరేగి రాసేస్తున్నారు. మరి నిండా అప్పుల్లో మునిగి... పాతకాలపు టెక్నాలజీతో, సెకండ్ హ్యాండ్ యంత్రాలతో నెట్టుకొస్తున్న ‘ఈనాడు’లో రూ.100 విలువైన ఒక్కో షేరును రూ.5,28,630 చొప్పున అమ్మితే రిలయన్స్ లాంటి సంస్థ వాటిని దొంగ కంపెనీల ద్వారా ఎందుకు కొనుక్కుంది? అలా రూ.2,600 కోట్లు ఎందుకు పెట్టుబడి పెట్టింది? నాలుగేళ్ల తరవాత ఆ డబ్బును పుణ్యానికి వదిలేసి ఎందుకు వెనక్కెళ్లిపోయింది? ఈ ప్రశ్నలు వేటికీ రామోజీ జవాబివ్వనే ఇవ్వరు. ఎందుకంటే ఆయనది ఒకటే నైజం. తన ఒళ్లు ఎంత కంపు కొడుతున్నా పట్టించుకోకుండా ఎదుటివారిపై బురదజల్లటమే!!!

బాక్సైట్‌పై కన్నేసింది బాబే...

విశాఖపట్నంలోని బాక్సైట్ నిక్షేపాలకు సంబంధించి ‘ఈనాడు’ అసత్యాలు ఏ స్థాయికి వెళ్లాయనేది మాటల్లో చెప్పలేం! ఎందుకంటే 2000లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబే ఈ నిక్షేపాల్ని తన బినామీ కోనేరు ప్రసాద్‌కు కట్టబెట్టాలనుకున్నారు. దుబాయ్‌కి చెందిన దుబాయ్ అల్యూమినియం కంపెనీ తరఫున కోనేరు రావటం, ప్రభుత్వ ఆతిథ్యం స్వీకరించి బాక్సైట్ నిక్షేపాల విలువను అంచనా వేసుకుని వెళ్లటం అన్నీ జరిగాయి. అప్పట్లో మాత్రం ‘ఈనాడు’కు ఇవన్నీ అభివృద్ధి దిశగా తమ ‘బాబు’ వేస్తున్న అడుగులుగా కనిపించాయి! అదే విచిత్రమంటే!!

అసలు జరిగిందిదీ...

బంజారాహిల్స్‌లోని తన స్థలంలో హోటల్ నిర్మాణం కోసం పెన్నా సిమెం ట్స్ అధినేత ప్రతాప్‌రెడ్డి 2005లో దరఖాస్తు చేశారు. 
నాటి నిబంధనల మేరకు అక్కడి భవనాల ఎత్తు 15 మీటర్లు మించకూడదు.

కానీ అదే ఏడాది పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాలశాఖ కార్యదర్శి వి.నాగిరెడ్డి ప్రభుత్వానికొక లేఖ రాశారు. ‘‘2006లో ఏడీబీ గవర్నర్ల సమావేశం జరగబోతోంది. వచ్చేవారికి బస తదితరాల కోసం హోటల్ నిర్మాణాల్ని ప్రోత్సహించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. నిర్మించబోయే హోటళ్లు గరిష్ట స్థాయిలో ఉపయోగపడేందుకు వీలుగా నిబంధనలు మార్చాలని, సాధ్యమైనంత ఎక్కువ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎస్‌ఎస్‌ఐ) అందుబాటులోకి వచ్చేట్టుగా అనుమతులివ్వాలని కేంద్రం సూచించింది’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.

కావాలనుకుంటే... ఈ లేఖ ఆధారంగా ప్రతాప్‌రెడ్డి ఒక్కరినే నిబంధనల నుంచి మినహాయించే అవకాశం నాటి ముఖ్యమంత్రి వైఎస్‌కు ఉంది. అలా సడలింపు ఇవ్వాలని పురపాలకశాఖ నుంచి ఆయనకు ఫైల్ కూడా వచ్చింది.

కానీ ఇలా ఒక్క వ్యక్తికి మినహాయింపులివ్వటం సరికాదంటూ వ్యతిరేకిం చిన సీఎం... ప్రభుత్వ విధానాన్ని సవరించాలని సూచించారు. దీన్ని కేబినెట్లో చర్చించి... వాణిజ్య భవనాల ఎత్తు పరిమితిని సడలిస్తూ జీవో-329ను, ఆ తరవాత కొన్ని సవరణలతో జీవో 771ను జారీ చేశారు. పెపైచ్చు ఈ భవనాలకు ఎయిర్‌పోర్టు వర్గాల అనుమతిని తప్పనిసరి చేయటంతో పాటు జోనింగ్ నిబంధనల్ని కూడా పాటించి తీరాల్సిందేనన్నారు.

జీవో వచ్చిన ఆరు నెలల్లోగా ఎందరు దరఖాస్తు చేస్తే అందరికీ అనుమతిస్తామన్నారు. దానిప్రకారం ఎవరెవరికి అనుమతులు దక్కాయంటే...

పెన్నా ప్రతాప్‌రెడ్డికి చెందిన పయనీర్ సంస్థకు. ఇది బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లో తలపెట్టిన హోటల్. ఇంకా నిర్మాణంలోనే ఉంది.

రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డికి చెందిన గాయత్రీ సంస్థకు. రోడ్ నంబర్ 3లో ఇది నిర్మిస్తున్న హోటల్ ముగింపు దశకు చేరింది.

రోడ్ నంబర్ 13లో బ్లిట్జ్ హోటల్‌కు. దాని పనులు ప్రాథమిక దశలోనే నిలిచిపోయాయి.
జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద ఎన్‌సీసీ, ఐసీఐసీఐ కన్సార్షియం తలపెట్టిన సెవన్‌స్టార్ హోటల్‌కు. కానీ పర్యావరణ సమస్యలు, ఆర్థికమాంద్యం కారణంగా ఇది మొదలు కాలేదు.

జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో అనుమతి పొందిన గ్రీన్‌పార్క్ హోటల్. దీని నిర్మాణమూ ప్రాథమిక దశలోనే ఉంది.

రోడ్ నంబర్ 37లో అనుమతులు పొందిన హోటల్ దసపల్లా. ఇది పూర్తయి కార్యకలాపాలు సాగిస్తోంది.

ఇదంతా జరిగింది 2005లో కాగా... ‘సాక్షి’లో ప్రతాప్‌రెడ్డి రూ.45 కోట్లు పెట్టుబడి పెట్టింది 2008 ఫిబ్రవరి, 2009 మార్చిలో రెండు విడతలుగా.

నాగిరెడ్డి లేఖ రాయలేదా?

మంత్రుల్ని వదిలి తమను టార్గెట్ చేస్తున్నారంటూ ఇటీవల ఐఏఎస్‌లంతా సీబీఐపై తిరగబడగా... అది వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధించిన విచారణ కాబట్టి, ఐఏఎస్‌లు ఎదురు తిరిగితే కష్టం కాబట్టి... ఏకంగా వారినే చీల్చే కుయుక్తులకు కూడా దిగారు రామోజీ! ‘‘తప్పు చేయకపోతే భయమెందుకు?’’ అని కొందరు ఐఏఎస్‌లతో చెప్పించి, దాన్ని తన పత్రికలో పతాక శీర్షికల్లో వరుసబెట్టి ప్రచురించారు. ఇలా వ్యాఖ్యానించిన, ‘ఈనాడు’ ప్రచురించిన ఐఏఎస్ అధికారుల జాబితాలో వి.నాగిరెడ్డి కూడా ఉన్నారు. నిజానికి ఏడీబీ గవర్నర్ల సమావేశం తదితరాల దృష్ట్యా హోటళ్లకు అనుమతులివ్వాలని, నిబంధనలు సడలించాలని ప్రభుత్వానికి లేఖ రాసింది ఆయనే. దాని ఆధారంగానే ప్రభుత్వం 329 జీవోను జారీ చేసింది. తప్పు చేయని అధికారులెవరూ భయపడాల్సిన పనిలేద ంటున్న నాగిరెడ్డి మాటల ప్రకారం చూసినప్పుడు... ఆయన తప్పు చేయలేదనే భావించాలిగా! ఆయన లేఖను అనుసరించి ప్రభుత్వం జీవో ఇచ్చినప్పుడు, ఆ జీవో ప్రకారం అనుమతులిచ్చినప్పుడు... అవి మాత్రం తప్పుడువవుతాయా? ఈ మాత్రం ఆలోచన రామోజీకి ఎందుకు లేదు?!
Share this article :

0 comments: