నేతన్న భవితకు భరోసా! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేతన్న భవితకు భరోసా!

నేతన్న భవితకు భరోసా!

Written By ysrcongress on Saturday, February 11, 2012 | 2/11/2012


సరళీకృత ఆర్థిక విధానాలను ఇష్టారాజ్యంగా అమలుచేసిన రోజులవి. ప్రపంచ వాణిజ్య సంస్థతో చేసుకున్న ఒప్పందం మేరకు పామోలిన్, చైనీస్ సిల్క్ దేశంలోకి చొరబడి రాష్ట్ర వ్యాప్తంగా అటు రైతాంగాన్ని, ఇటు చేనేత రంగాన్ని ఏకకాలంలో సంక్షోభంలోకి నెట్టి వేసిన దుర్భర సన్నివేశం అది. పామోలిన్ పుణ్యమా అని అనంతపురం జిల్లాలో వేరుశనగ పండించిన రైతన్నకు గిట్టుబాటు ధర లభించకుండాపోయింది. సంప్రదాయ మగ్గాలకు పోటీగా మరమగ్గాలను ప్రవేశపెట్టే విధానాన్ని నాటి ప్రభుత్వం ఆ రోజుల్లో పెద్దఎత్తున చేపట్టింది. దిగు మతి చేసుకొన్న చైనీస్ సిల్క్‌తో మరమగ్గాలపై చేనేత చీర లను పోలిన చీరలను, ఇతర వస్త్రాలను పెద్దఎత్తున ఉత్పత్తి చేశారు. ఫలితంగా ధర్మవరం పట్టుచీరలకు ఆదరణ కరు వైంది. మరమగ్గంపై తయారు చేసిన నకిలీ నేతచీరలు, చేనేత చీరలకన్నా తక్కువ ధరకే మార్కెట్‌లో లభించడం ఈ పరిణామానికి దోహదం చేసింది. 

దక్షిణ భారతంలో మొట్టమొదటిసారిగా రైతులు, నేతన్నల ఆత్మహత్యలు అనంతపురం జిల్లాలో జరగడానికి గల తక్షణ నేపథ్యం ఇది. ఈ ఆత్మహత్యలను గుర్తించడానికి నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరా కరించారు. చేనేతరంగ ప్రముఖులు ఆనాటి రాష్ట్ర మంత్రి పరిటాల రవీంద్ర నాయకత్వంలో ప్రతినిధి బృందంగా ఏర్పడి చంద్రబాబును కలిసి మగ్గాలకు పోటీగా మరమ గ్గాలు (పవర్‌లూమ్స్) రావడంవల్ల చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న కష్టనష్టాలను ఆయనకు వివరించారు. చేనేత రంగానికి రక్షణలు కల్పించాల్సిందిగా కోరుతూ అందుకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రభుత్వ జీఓ- 557ఈకి లోబడి చేనేత పరిశ్రమ ఉత్పత్తి చట్టం అమలు పరచాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అందుకు బదులుగా ‘గుంతల మరమగ్గాల స్థానే’ పవర్‌లూమ్స్ యంత్రాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నదని, విజన్-2020లో అందుకు ప్రాధాన్యం ఇస్తున్నామని చంద్రబాబు వారికి ‘హితవు’ చెప్పారు. 

చేనేత రక్షణకు 11 రకాల వస్త్రాలపై 1986లో కేంద్ర చేనేత, జౌళి మంత్రిత్వశాఖ స్పష్టమైన ఆదేశాలను విడుదల చేసింది. చీర, ధోవతి, బెడ్‌షీట్లు, తువాళ్లు, గావంచ/ అంగోస్త్రం, లుంగీ, బెడ్‌షీట్, బెడ్ కవర్లు, షర్టింగ్, పరదా, జంపఖాన వంటివన్నీ ప్రత్యేకంగా చేనేత రంగంలో ఉత్ప త్తి కావాలని నిర్దేశించారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఈ జీఓను యథేచ్ఛగా ఉల్లంఘించింది. వ్యవసాయ రంగం శుద్ధ దండగ అన్న చంద్రబాబు చేనేత రంగాన్ని కాలగ ర్భంలో కలిసిపోయిన జీవన విధానంగా తిరస్కరించడం మనకు ఆశ్చర్యం కలిగించదు. 

నీటిపారుదల, వ్యవసాయ, విద్యుత్, సంక్షేమ రంగాలను ఆయన పూర్తిగా నిర్లక్ష్యం చేసిన వైనం మన కళ్లముందున్నదే. గతంలో ఎన్టీఆర్ చేనేతరంగానికి ఇచ్చిన చేయూత ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్తావించుకోవాలి. రూ.2 కిలోల బియ్యంతో పాటు జనతా వస్త్రాలు-చీరలు, ధోవతులు పౌరసరపరాల విభాగం ద్వారా ప్రజలకు అందించారు. ఆ విధంగా చేనేత ఉత్పత్తులకు అధిక ప్రాముఖ్యం ఇచ్చారు. అలాగే వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా చేనేత రంగాన్ని ప్రత్యేకించి ఖద్దరు దుస్తుల వినియోగాన్ని అమితంగా ప్రోత్సహించారు. ప్రభుత్వో ద్యోగులు విధిగా వారానికి ఒకమారు చేనేత దుస్తులు ధరించి కార్యాలయాలకు హాజరు కావాలని వైఎస్ ఏకంగా జీవో జారీచేశారు. ఎన్టీఆర్, వైఎస్ విధానాలకు విరుద్ధంగా చంద్రబాబు వ్యవహరించడం వల్లే చేనేత సంక్షోభాన్ని పెంచి పోషించారు. బాబు అడుగుజాడల్లోనే ఈ రోజున కిరణ్ సర్కార్ పయనించడంలో విడ్డూరం ఏమీ లేదు.

రైతులు, చేనేత వృత్తి కళాకారుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్న రోజుల్లో... ‘‘రైతన్నలారా... నేతన్న లారా! ఆత్మహత్యలు మానండి... మీకు కుటుంబం, భార్యాపిల్లలు ఉన్నారన్న సంగతి గుర్తుంచుకోండి. పౌర సమాజంగా, రాజకీయ పార్టీగా మేమంతా మీతో ఉంటాం. వేరుశనగ రైతులను ఆదుకోవడానికి మేము పోరాడతాం. మీ వెంట మేముంటాం. అధైర్యపడకండి. ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కోండి’’ అంటూ 2001లో వైఎస్ అనంతపురం జిల్లాలో రెండు రోజులు పర్యటించి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

‘‘సరళీకృత ఆర్థిక విధానాల ఫలి తంగా రంగప్రవేశం చేసిన పామోలిన్, చైనీస్ సిల్క్ దిగుమతుల అంశంపై మేము అధికారంలోకి వచ్చాక పునః పరిశీలన చేస్తాం’’ అంటూ ముదిగుబ్బ మండలంలో పత్రికా విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఆనాటి ‘ప్రజాశక్తి’ విలేకరి విశ్వేశ్వరరావు ‘‘సరళీకృత ఆర్థిక విధానాలకు సంబంధిం చిన ఒప్పందాలు ప్రపంచ వాణిజ్య సంస్థతో మీ నాయకుడు పి.వి.నరసింహారావు హయాం లో చేసుకున్నవే కదా’’ అని ప్రశ్నించగా ‘‘అయితే ఏమిటి? (సో వాట్?) ప్రజలకు ఉపయోగపడని, ప్రజల శ్రేయస్సుకు భంగం కలిగించే ఏ విధానమైనా మార్చుకుంటాం. ప్రపంచ బ్యాంకు, ప్రపంచ వాణిజ్య సంస్థతో చేసుకున్న ఒప్పందాలను పునఃపరిశీలిస్తాం’’ అని బదులిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడై ఉండి వైఎస్ ఇటువంటి సంచలన వ్యాఖ్యలు చేయడం ఆ రోజుల్లో రాజకీయవర్గాల్లో అలజడి రేపింది. 1985 నాటి చేనేత రిజర్వేషన్ చట్టాన్ని చంద్రబాబు సర్కార్ ఉల్లంఘించిన ఫలితంగా రైతన్నలు, నేతన్నల ఆత్మహత్యలు జరిగాయన్నది దాచేస్తే దాగని సత్యం. కానీ, చంద్రబాబు మాత్రం కళ్లముందు కనిపిస్తున్న సత్యాన్ని చూసేందుకు సిద్ధపడలేదు.

వైఎస్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆత్మహత్య చేసుకున్న రైతులు, చేనేత కార్మికుల కుటుంబాలకు తలా రూ.1,50,000 ఆర్థికసహాయం ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఒక్కొక్కరికీ రూ.25,000 చొప్పున అందించారు. బాబు పాలనా కాలం లో ఒక్క అనంతపురం జిల్లాలోనే మొత్తం 33 మంది నేత న్నల ఆత్మహత్యలు నమోదయ్యాయి. అనంతపురం జిల్లా పామిడి, రాయదుర్గంలో రూ.25 కోట్లతో టెక్స్‌టైల్ పార్కు ల ఏర్పాటుకు చొరవ చూపించారు. హిందూపురంలో 73 ఎకరాల విస్తీర్ణంలో రూ.104 కోట్ల పెట్టుబడితో హిందూపు రం వ్యాపార అపెరల్ పార్కును మంజూరు చేశారు. త ద్వారా 20 వేల మందికి ప్రత్యక్షంగానూ, పది వేల మందికి పరోక్షంగాను ఉపాధి కల్పనకు చర్యలు చేపట్టారు. 
‘రైతు పోరు యాత్ర’ పేరుతో ఊకదంపుడు ఉపన్యాసాలతో రాష్ట్రంలో పర్యటిస్తున్న చంద్రబాబు... వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రైతులకు, చేనేత కార్మికులకు కల్పించిన భరోసా, ప్రోత్సాహం కారణంగా వారు సుఖసంతోషాలతో జీవించారనే అంశాన్ని అంగీకరించేం దుకు తిరస్కరిస్తున్నారు. తన పాలనలో జరిగిన వలసలు, రైతుల, చేనేత కార్మికుల ఆత్మహత్యలను మరచి, అబద్ధాలను పుక్కిటపడుతూ తన ప్రతిపక్ష నాయకుని హోదా ను న్యూనపరుచుకుంటూ పర్యటన కొనసాగిస్తున్నారు. 

చేనేత కార్మికులకు నేడు వృత్తి కొనసాగించడానికి మగ్గాలు, ముడిసరుకు కావాలి. అందుకు రుణవసతి కల్పిం చాలి. ఉత్పత్తి చేసిన చేనేత సరుకులకు మార్కెట్ సృష్టిం చాలి. చేనేత కార్మికులను మధ్య దళారీల దోపిడీ నుంచి రక్షించాలి. మరోవైపు వైఎస్ ప్రవేశపెట్టిన సామాజిక భద్రత, ఆరోగ్య భద్రత, ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగ భద్రత లాంటి పథకాలు జతచేయాలి. 2009లో వైఎస్ నేతన్నల బకాయిలను రూ.312 కోట్ల మేర మాఫీ చేశారు. 

కానీ, నేటికీ ఆ రుణాల మాఫీకి గాను రూ.109 కోట్లకు మించి విడుదల చేయలేదు. మహిళా సంఘాలకు పావలా వడ్డీ లేదా వడ్డీలేని రుణాలు ఇచ్చినట్లుగానే చేనేత కార్మికులకు వడ్డీలేని రుణాలను రాష్ట్ర సర్కార్ ఇవ్వాలి. చేనేత సహకార కార్మిక సంఘాలన్నీ పారదర్శకత లోపించి కార్మికేతరుల చెప్పుచేతుల్లోకి పోవడంపై అధ్యయనం జరగాలి. జయతీఘోష్ కమిషన్ లాగా చేనేత రంగం రక్షణకు చట్టబద్ధత ఉన్న కమిషన్ ఏర్పాటు చేయాలి. ఉచిత విద్యుత్తు, ఇంటిపన్ను పెంచకపోవడం, ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచకపోవడం, ఉచిత వివాహాలు, ఫీజు రీయింబర్స్‌మెంటు, ఆరోగ్యశ్రీ, పెన్షన్లు ద్వారా నేతన్నలకు వైఎస్ సర్కార్ సామాజిక భద్రత కల్పించింది. కానీ, ఈ సంక్షేమ కార్యక్రమా లన్నీ నేడు ప్రశ్నార్థకంగా మారాయి.

కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ అధినాయకి సోనియా గాంధీని కాదని సొంత పార్టీని నెలకొల్పిన జగన్‌మోహన్‌రెడ్డిపై కేవలం పదవి కోసం కాంగ్రెస్‌ను వదిలారని ఆరోపణలు చేసిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు తమ బాధ్యత మరచి ముఠాతత్వంతో ప్రజాప్రయోజనాలకు తిలోదకాలిచ్చా యి. ఈ నేపథ్యంలో నేతన్నల మేలు కోరుతూ జననేత జగన్‌మోహన్‌రెడ్డి అనంతపురం జిల్లా ధర్మవరంలో ‘చేనేత దీక్ష’ను 12 నుంచి చేపడుతున్నారు. వైఎస్సార్ పార్టీ స్థాపించి సంవత్సరం కూడా గడవక ముందే జగన్ విద్యా ర్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు సహా, నీటిపారు దల, వ్యవసాయ, విద్యుత్ రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళనలు చేపట్టారు. అదే వరసలో చేనేత కార్మికుల్లో ఏర్పడ్డ నిరాశ, నిస్పృహలను పారదోలడానికి, వారికి తాను వెన్నుదన్నుగా ఉంటానని చెప్పడానికి ఆయన ఇందుకు పూనుకున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి జీవనోపాధి కల్పించే రంగమిది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా వ్యవసాయం తరువాత చెప్పుకోదగ్గ ప్రాముఖ్యం కలిగిన ఈ రంగాన్ని కాపాడుకోవడం తప్పనిసరి.
Share this article :

0 comments: