జన ప్రభంజనంతో షెడ్యూలు ఆరు గంటల ఆలస్యం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జన ప్రభంజనంతో షెడ్యూలు ఆరు గంటల ఆలస్యం

జన ప్రభంజనంతో షెడ్యూలు ఆరు గంటల ఆలస్యం

Written By ysrcongress on Monday, February 6, 2012 | 2/06/2012

కిక్కిరిసిన పెదవాల్తేరు, అడ్డరోడ్డు 
బహిరంగ సభలు.. జన ప్రభంజనంతో షెడ్యూలు ఆరు గంటల ఆలస్యం
ఫలితంగా నేడు కూడా విశాఖలో పర్యటించనున్న వైఎస్ జగన్ 

విశాఖపట్నం, న్యూస్‌లైన్: దారివెంట వేలాదిగా జనం ఎదురు చూపులు. పిల్లా, పెద్దా తేడా లేకుండా పెద్ద ఎత్తున బారులు. తమ గుండెల్లో కొలువై ఉన్న మహానేత తనయుడిపై మమకారం, అభిమానం వెరసి.. ఆదివారం విశాఖ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రోడ్డుషో జాతరను తలపించింది. ప్రజాభిమానం తాకిడితో పర్యటన షెడ్యూలులో దాదాపు ఆరు గంటల ఆలస్యం చోటుచేసుకుంది. పాయకరావుపేట నియోజకవర్గం పరిధిలో ఆయన జరపతలపెట్టిన రోడ్‌షో ఆదివారం అర్ధరాత్రికి సగం కూడా పూర్తికాలేదు. దీంతో మిగిలిపోయిన ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా జగన్ సోమవారం కూడా విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు.

విశాఖ నగర కార్యాలయం ప్రారంభం..

ఉదయం తొమ్మిదిన్నరకు విశాఖలో వైఎస్సార్ కాంగ్రెస్ నగర పార్టీ కార్యాలయాన్ని జగన్ ప్రారంభించారు. అక్కడి నుంచి రోడ్డుషోతో డాబాగార్డెన్స్ వెళ్లారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. పెదవాల్తేరులో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి కిక్కిరిసిన సభలో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో ఎటు చూసినా.. ఆందోళనలు, ధర్నాలే. జూనియర్ వైద్యులు, 104, 108 సిబ్బంది, కాంట్రాక్ట్ లెక్చరర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు సమస్యల పరిష్కారం కోరుతూ రోజులతరబడి రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సిన దుస్థితి’’ అని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇదే వేదికపై తెదేపా మాజీ ఎమ్మెల్యే పిన్నింటి వరలక్ష్మికి కండువా వేసి జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం అనంతరం మద్దిలపాలెం వద్ద స్థానిక 10వ వార్డు కార్పొరేటర్ తెదేపా నేత మొల్లి లక్ష్మి, అప్పారావుతోపాటు పీఆర్పీ నేత బైపా అరుణ్‌కుమార్ తదితరులు ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. జగన్ మధ్యాహ్నం రెండున్నర గంటలకు జాతీయ రహదారి మీదుగా రోడ్డుషో చేపట్టారు. నగరంలోని తాటిచెట్లపాలెం, ఊర్వశి, ఎన్‌ఏడీజంక్షన్, షీలానగర్, గాజువాక, అగనంపూడిల్లో అడుగడుగునా జనం బారులు తీరి కనిపించారు. 

ర్యాలీగా తరలివచ్చిన అభిమానులు

జగన్‌మోహన్‌రెడ్డి అనకాపల్లి వచ్చే సరికి వందలాది వాహనాల్లో కార్యకర్తలు, నాయకులు తొలి బైపాస్ నుంచి ర్యాలీగా పూడిమడక జంక్షన్ వరకూ వచ్చారు. అక్కడ జగన్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం కశింకోట చేరుకున్నారు. అక్కడ జగన్‌కు ఘనస్వాగతం పలికారు. అనంతరం తాళ్లపాలెం, నరసింగపల్లి మీదుగా యలమంచిలి చేరుకున్నారు. యలమంచిలి పర్యటన జాబితాలో లేకపోయినా వేలాదిగా అభిమానులు పోటెత్తారు. అనంతరం అడ్డరోడ్డుకు చేరుకున్నారు. అక్కడ బహిరంగసభలో ప్రసంగించి నక్కపల్లి, వేంపాడు, ఉద్దండపురంల మీదుగా తుని వెళ్లి రాత్రికి అక్కడ బస చేశారు. యాత్రలో జన తాకిడితో పలుచోట్ల జాతీయరహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. యాత్రలో జగన్‌వెంట ఎంపీ సబ్బం హరి, వైఎస్సార్ కాంగ్రెస్ నేత కొణతాల రామకృష్ణ, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తదితరులున్నారు.
Share this article :

0 comments: