వారి గుట్టు బయటపడుతుందనే సర్కారు ఆ రిపోర్టును తొక్కి పెట్టింది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వారి గుట్టు బయటపడుతుందనే సర్కారు ఆ రిపోర్టును తొక్కి పెట్టింది

వారి గుట్టు బయటపడుతుందనే సర్కారు ఆ రిపోర్టును తొక్కి పెట్టింది

Written By ysrcongress on Thursday, February 9, 2012 | 2/09/2012


20 మంది మంత్రులు, 40 మంది ఎమ్మెల్యేలు లిక్కర్ వ్యాపారం చేస్తున్నట్లు ఏసీబీ నివేదికిచ్చింది
వారి గుట్టు బయటపడుతుందనే సర్కారు ఆ రిపోర్టును తొక్కి పెట్టింది: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
 
నేను మాట తప్పనందుకే వైఎస్సార్‌పై బురదజల్లుతున్నారు
నాడు వైఎస్‌ను పొగిడిన మన్మోహన్, సోనియా.. నేడు నన్ను, నా తల్లిని ఇబ్బందుల పాల్జేస్తున్నారు
 
 
దివంగత నేత వైఎస్సార్ మన మధ్య నుంచి వెళ్లిపోయిన తరువాత ఈ రాష్ట్రం పరిస్థితి దొంగలూ దొంగలూ రాజ్యం పంచుకుంటున్నట్లుగా తయారైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘దివంగత నేత చనిపోయిన తరువాత ఇవాళ రాష్ట్రంవైపు ఒక్కసారి చూస్తే.. విశ్వసనీయత, విలువలు కోల్పోయి రాజకీయాలు దిగజారిపోయాయి. నేను ఇవాళే పేపర్‌లో చదివా.. మద్యం మంత్రి రూ.10 లక్షల లంచం తీసుకున్నాడని, ఆయన లిక్కర్ మాఫియా నడుపుతున్నాడని, ఆ.. సిండికేట్‌కు సంబంధించిన వ్యక్తే ఈ ఆరోపణలు చేశాడు అని చదివా. దీనికి సంబంధించి ఏసీబీ రిపోర్టు కొద్ది రోజుల కిందటే వచ్చింది.

ఒక్క మంత్రి కాదు.. 20 మంది మంత్రులు, 40 మంది శాసనసభ్యులు లిక్కర్ వ్యాపారం చేస్తున్నారని, బ్రాందీ దుకాణాలు నడుపుతున్నారని ఆ నివేదికలో ఉంది. ప్రభుత్వం ఆ నివేదికను తొక్కి పెడుతోంది’’ అని మండిపడ్డారు. గుంటూరు జిల్లా ఓదార్పు యాత్ర 61వ రోజు బుధవారం ఆయన నకరికల్లు, రొంపిచర్ల మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. 14 వైఎస్సార్ విగ్రహాలు ఆవిష్కరించారు. ఒక్క విప్పర్లరెడ్డిపాలెం గ్రామంలోనే ఐదు విగ్రహా లను ఏర్పాటు చేశారు. కొత్తపల్లిలో కొండా రత్తమ్మ కుటుం బాన్ని జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్చారు. పలు గ్రామాల్లో ప్రసంగించారు. ఈ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

నాడు ఈ కుళ్లు, కుతంత్రాలు లేవు..
ఒక వ్యక్తి చనిపోయి దాదాపు రెండున్నర సంవత్సరాలకు పైగానే అవుతోంది. ఆ వ్యక్తి వల్లే ఇవాళ కాంగ్రెస్ వాళ్లు రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ పరిపాలన చేస్తున్నారు. ఆ వ్యక్తి చనిపోయిన తరువాత ఆయన కోసం చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తానని ఒక మాట ఇచ్చా. నేను ఆ మాట ఇచ్చినప్పుడు ఎటువంటి కుళ్లూ, కుతంత్రాలూ లేవు. ఎలాంటి రాజకీయాలూ లేవు. ఆ మాటను వదిలి పెట్టాలని ఇదే కాంగ్రెస్ పెద్దలు చెప్పారు.. నేను మాట తప్పలేకపోయాను. మాటే కదా.. గాలికి వదిలేయమని ఒత్తిడి తెచ్చారు. అయినా ఆ పని చేయలేక పోయా..! నేను ఇచ్చిన మాట తప్ప లేదన్న కారణంగా.. ఇవాళ హఠాత్తుగా దివంగత నేత మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. దివంగత నేత అంత గొప్ప ముఖ్యమంత్రి దేశంలోనే ఎవరూ లేరని పొగిడిన ఇదే మన్మోహన్ సింగ్, సోనియా గాంధీగారు నన్ను, నా తల్లిని ప్రత్యర్థిగా ఎంచుకొని ఇబ్బందులపాలు చేస్తున్నారు.

కనీవినీ ఎరుగని కుళ్లు రాజకీయం..
రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ కనీవినీ ఎరుగని రీతిలో ఇవాళ ఒక సన్నివేశం జరుగుతోంది. దివంగత నేత మీద బురదజల్లేందుకు పాలకపక్షం, ప్రతిపక్షం పార్టీలకు అతీతంగా ఒక్కటయ్యాయి. వీళ్లిద్దరూ కూడా కుయుక్తులతో రాజకీయాలు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో రెండే రెండు పార్టీలు ఉండాలట... ప్రజలు ఓటు వేయడానికి మూడో పార్టీ ఉండకూడదట. ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై విసుగెత్తినప్పుడు టీడీపీకి ఓటు వేయాలట. టీడీపీ మీద విసుగొస్తే.. కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలట. ఇక్కడ మూడో పార్టీ, మూడో వ్యక్తి ఉండకూడదట. నేను ఒక్కమాటైతే చెప్తున్నాను. ఇవాళ అధికారం వీళ్ల చేతిలో ఉంది కాబట్టి ఏమైనా చేయొచ్చు. కానీ పై నుంచి దేవుడు చూస్తున్నాడని గుర్తుంచుకోండి.

ఒక్క వైఎస్సార్ మీదే సభా సంఘం విచారిస్తుందట.. 
‘‘ఇవాళ కాసేపటి కిందనే ఇంకొక విషయం కూడా విన్నా..! హౌస్ కమిటీ (సభా సంఘం) వేశారట.. శాసన సభ్యులతో కూడిన కమిటీ అది. ఆ దివంగత నేత వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004 నుంచి 2009 దాకా కొనసాగిన ఐదు సంవత్సరాల సువర్ణయుగాన్ని మాత్రమే ఈ శాసనసభ్యుల కమిటీ విచారణ చేస్తుందట. దివంగత నేత కంటే ముందు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పరిపాలన చేసిన ఆ తొమ్మిది సంవత్సరాలను మాత్రం పట్టించుకోరట. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చనిపోయిన తరువాత ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా రోశయ్య గారు వచ్చారు.. కిరణ్‌కుమార్‌రెడ్డి వచ్చారు. వాళ్లను కూడా ఈ సభా సంఘం పట్టించుకోదట. కేవలం వైఎస్సార్‌ను మాత్రమే పట్టించు కుంటుందట.’’
Share this article :

0 comments: