జగన్ రిమాండ్ ఎందుకు పొడిగించాలి-కోర్టు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ రిమాండ్ ఎందుకు పొడిగించాలి-కోర్టు

జగన్ రిమాండ్ ఎందుకు పొడిగించాలి-కోర్టు

Written By news on Thursday, February 14, 2013 | 2/14/2013


జగన్ కేసులో రిమాండ్ పొడిగించడానికి స్పష్టమైన కారణాలు చెప్పాలని కోర్టు సిబిఐని ఆదేశించడం ఆసక్తికరంగా ఉంది. ఎనిమిది నెలలుగా జగన్ ను ఆస్తుల కేసులో రిమాండ్ లో ఉంచారు. బెయిల్ కూడా ఇవ్వకుండా సిబిఐ అడ్డుకుంటోంది.దానికి తోడు సుప్రింకోర్టు ఆదేశాల ను కారణంగా చూపుతూ బెయిల్ ఇవ్వవద్దని సిబిఐ వాదిస్తోంది.అయితే త్వరగా విచారణ పూర్తి చేస్తామని చెప్పిన విషయాన్ని మాత్రం సిబిఐ పట్టించుకుంటున్నట్లు లేదు. రాజకీయంగా మారిన ఈ కేసు విషయంలో సిబిఐ అనేక విమర్శలను ఎదుర్కుంటున్నా, తన ధోరణిలోనే దర్యాప్తును సాగదీస్తోందన్న అబిప్రాయం ప్రజలలో ఉంది. ఈ నేపధ్యంలో కోర్టు ఈ ప్రశ్న వేయడం విశేషం.జగన్ రిమాండ్ ను ఎందుకు పొడిగించాలో స్పష్టంగా చెప్పాలని, ప్రతి పదిహేను రోజులకు ఒకసారి దర్యాప్తు పురోగతి తెలపాలని కోర్టు కోరింది.అయితే సిబిఐ పాతపాటనే వల్లించింది.జగన్ జైలులో ఉంటేనే కేసు విచారణ సక్రమంగా కొనసాగించగలుగుతామని,బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారని సిబిఐ తరపు న్యాయవాది తెలిపారు. కేసు విచారణ చురుకుగానే సాగుతోందని, ఇది ఆషామాషి కేసు కాదని ఆయన కోర్టుకు తెలిపారు.


kommineni.info
Share this article :

0 comments: