18 కొత్త రెవెన్యూ డివిజన్లు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 18 కొత్త రెవెన్యూ డివిజన్లు

18 కొత్త రెవెన్యూ డివిజన్లు

Written By ysrcongress on Tuesday, March 19, 2013 | 3/19/2013

మొదటి విడతలో 10 రెవెన్యూ డివిజన్లు.. 25 అర్బన్ మండలాలు

సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలో 18 కొత్త రెవెన్యూ డివిజన్లు, 52 తహసీళ్లను దశలవారీగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రకటించారు. మొదటి విడత కింద 10 రెవెన్యూ డివిజన్లు, 25 అర్బన్ తహసీళ్ల (మండలాలు) ఏర్పాటుకు సంబంధించిన ఫైలు సీఎం పేషీలో ఉంది. ఈ వారంలోనే సీఎం ఆమోదిస్తారని అధికార వర్గాల ద్వారా తెలిసింది. 

తొలివిడత కింద ఏర్పాటుకానున్న రెవెన్యూ డివిజన్లు, వాటిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు...
రాజేంద్రనగర్ డివిజన్: కూకట్‌పల్లి, శేర్‌లింగంపల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గాలు (రంగారెడ్డి జిల్లా)
మల్కాజ్‌గిరి: మల్కాజ్‌గిరి, ఉప్పల్, మేడ్చల్, కుత్బుల్లాపూర్ (రంగారెడ్డి)
కల్యాణదుర్గం: కల్యాణదుర్గం, రాయదుర్గం (అనంతపురం)
కదిరి: కదిరి, పుట్టపర్తి (అనంతపురం)
గురజాల: మాచెర్ల, గురజాల, వినుకొండ (గుంటూరు)
రామచంద్రపురం: రామచంద్రపురం, అనపర్తి, మండపేట (తూర్పు గోదావరి)
దేవరకొండ: దేవరకొండ పూర్తిగా, నాగార్జునసాగర్, మునుగోడు నియోజకవర్గాల్లో కొన్ని మండలాలు (నల్లగొండ)

అనకాపల్లి: ఎలమంచిలి నియోజకవర్గం (విశాఖపట్నం)
ఆత్మకూరు: వెంకటగిరి, ఆత్మకూరు, ఉదయగిరి (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా)
నాయుడుపేట డివిజన్: నాయుడుపేట నియోజకవర్గం (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా)

కొత్త అర్బన్ మండలాలివీ..

విశాఖ-2, విశాఖ-3, విజయవాడ-2, విజయవాడ-3 , తెనాలి, గుంటూరు, నెల్లూరు, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, విజయనగరం, శ్రీకాకుళం, రాజమండ్రి, ఏలూరు, ఒంగోలు, కడప, కర్నూలు, ఖమ్మం, వరంగల్-2, ఆదిలాబాద్, నల్లగొండ, రంగారెడ్డి అర్బన్ మండలాలు ఏర్పాటు చేయాలన్న రెవెన్యూ శాఖ ప్రతిపాదన ప్రస్తుతం సీఎం ఆమోదం నిమిత్తం ముఖ్యమంత్రి పేషీలో ఉంది. వీటిని ఏర్పాటు చేసిన తర్వాత రెండో విడత 18 రెవెన్యూ డివిజన్లు, 27 మండలాల ఏర్పాటుకు రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు పంపనుంది. 
Share this article :

0 comments: