విద్యుత్‌పై లెఫ్ట్ పోరుకు వైఎస్సార్‌సీపీ సంఘీభావం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విద్యుత్‌పై లెఫ్ట్ పోరుకు వైఎస్సార్‌సీపీ సంఘీభావం

విద్యుత్‌పై లెఫ్ట్ పోరుకు వైఎస్సార్‌సీపీ సంఘీభావం

Written By ysrcongress on Friday, March 22, 2013 | 3/22/2013

 విద్యుత్ చార్జీల పెంపును ఉపసంహరించాలని కోరుతూ పది వామపక్ష పార్టీలు చేపట్టనున్న ఆందోళనకు సంఘీభావం తెలపడంతోపాటు తాము కూడా ఈ సమస్యలపై ముందుండి పోరాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. వామపక్షాల తరపున వై.వెంకటేశ్వరరావు (సీపీఎం), గాదె దివాకర్ (న్యూడెమోక్రసీ), జానకిరాములు (ఆర్‌ఎస్‌ిపీ) గురువారం వైఎస్సార్ సీపీ కార్యాలయానికి వచ్చి పార్టీ నేతలు ఎం.వి.మైసూరారెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, ఎస్.రామకృష్ణారెడ్డి, గట్టు రామచంద్రరావు, జనక్‌ప్రసాద్‌తో చర్చలు జరిపారు. తమ ఆందోళనకు మద్దతివ్వడంతోపాటు విడిగా కూడా ఉద్యమం చేపడితే మంచిదని వామపక్ష నేతలు సూచించారు. 

అనంతరం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి విద్యుత్ చార్జీలపై దిగివచ్చేలా చేయడానికి అంతా కలిసి పోరాడాలని సూచించినట్టు తెలిపారు. విద్యుత్ కోతలు తగ్గించాలని, ఏప్రిల్ 1వ తేదీ నుంచి భారీగా పెంచతలపెట్టిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించాలని, మర్చంట్ (వ్యాపార) పవర్ ప్లాంటుల విధానాన్ని రద్దు చేయాలని, ఇంధన సర్‌చార్జి సర్దుబాటును రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 23 నుంచి వామపక్షాలు నిరాహారదీక్షలు ప్రారంభిస్తున్నట్లు వివరించారు. చార్జీల పెంపును ఈ నెల 23, 26వ తేదీల మధ్యలోనే రెగ్యులేటరీ కమిషన్ ఆమోదించే అవకాశం ఉన్నందున ఈ ఆందోళనకు పూనుకుంటున్నామని దివాకర్ తెలిపారు
Share this article :

0 comments: