ఎవరెన్ని అవరోధాలు కల్పించినా...చివరికి ప్రజల అభీష్టమే.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎవరెన్ని అవరోధాలు కల్పించినా...చివరికి ప్రజల అభీష్టమే..

ఎవరెన్ని అవరోధాలు కల్పించినా...చివరికి ప్రజల అభీష్టమే..

Written By news on Sunday, February 10, 2013 | 2/10/2013


ఈ రోజున వైఎస్సార్‌గారి కుటుంబంపై కొనసాగుతున్న కక్ష సాధింపు చర్యలు చూస్తుంటే బాధ కలుగుతోంది. ఏ రోజూ కూడా చంద్రబాబుపై విచారణ జరిపించనివారు కేవలం జగన్‌కి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే, కనీస విచారణైనా లేకుండా ఆయన్ని అరెస్టు చేశారని మేం భావిస్తున్నాం. దివంగత నేత వైఎస్సార్ ఉండగా మాట్లాడటానికి భయపడిన నాయకులు, ఈరోజు ఆయనపై, ఆయన తనయుడిపై అవినీతి ఆరోపణలు చేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. వైఎస్సార్‌పై ప్రజల్లో ఉన్న ప్రేమ, అభిమానం, గౌరవాన్ని దెబ్బతీయడానికే ఆ కుటుంబంపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇవాళ రాష్ట్ర ప్రజానీకం యావత్తూ జగన్‌నే సీఎంగా చూడాలని కోరుకుంటోంది. ఎవరెన్ని అవరోధాలు కల్పించినా జగనే ఈ రాష్ట్ర నాయకుడౌతారు.

- ఎం.డి.లయిఖ్ అహ్మద్ (అక్తర్), భువనగిరి, నల్లగొండ

జగన్‌పై దుష్ర్పచారాన్ని జనమెవ్వరూ నమ్మరు

ప్రపంచంలో ఏ సోషలిస్ట్ దేశంలోనూ లేని అనేక ప్రజాహిత సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తెలుగుజాతి హృదయాలలో దేవుడిగా కొలువుదీరిన దివంగత నేత వైఎస్సార్.... ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో రాష్ట్రం రామరాజ్యంలా వెలుగొందింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతున్న పరిస్థితిలో, నియంత చంద్రబాబు పాలనలో ప్రజలు విలవిలలాడుతున్న నేపథ్యంలో తెలుగుజాతికి అండగా నిలిచి ప్రత్యామ్నాయం అందిస్తానని వై.ఎస్. చేపట్టిన పాదయాత్ర చారిత్రాత్మకంగా నిలిచిపోయింది. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన వెంటనే రైతులు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలను రద్దుచేసి, రైతుబాంధవుడిగా వై.ఎస్. అహర్నిశలూ శ్రమించారు.

అన్నదాతకు శాశ్వతంగా సాగునీరు అందించాలన్న ఆలోచనతో జలయజ్ఞం చేపట్టి అపర భగీరథుడిగా ఖ్యాతిగాంచారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయటానికి, విద్యుత్ హబ్‌గా తీర్చిదిద్దటానికి అనేక పవర్ ప్రాజెక్టులకు వై.ఎస్. రూపకల్పన చేశారు. కానీ ఆయన మృతితో రాష్ట్రమే అంధకారంలో పడింది. వై.ఎస్. సంక్షేమ పథకాలకు సైతం ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ తిలోదకాలు ఇచ్చేందుకు సిద్ధపడుతున్న నేపథ్యంలో వై.ఎస్. ఆశయాలను నిజం చేయటానికి ముందుకు వచ్చిన జగన్‌ను నియంత్రించటానికి అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు ఏకమై దుష్ర్పచారం చేస్తున్నాయి. ఈ ప్రచారాన్ని ప్రజలంతా తిప్పికొట్టి, జగన్‌కు పట్టం కట్టే రోజు ఎంతో దూరంలో లేదు.

- వజ్జ బాబూరావు, పలాస 

వై.ఎస్. అభిమానులను ఆవేదనకు గురిచేస్తోంది

జీవితమంతా ప్రజలతోనే మమేకమై, ప్రజల కోసమే జీవించి, ఆ ప్రజల కోసమే ప్రాణాలు అర్పించిన మహానాయకుడు వైఎస్సార్. అటువంటి నాయకుడిని బతికున్నప్పుడు పొగిడిన నాయకులు అయితేనేమి, కాంగ్రెస్ అధిష్టానమైతేనేమి, చనిపోయిన తర్వాత విమర్శలు చేస్తూ చివరకు చార్జ్‌షీట్‌లో కూడా పేరు చేర్చి, వారి కుటుంబాన్ని, రాష్ట్రంలోని వై.ఎస్. అభిమానులను వేదనకు గురిచేస్తున్నారు. వీటన్నిటికీ త్వరలో ప్రజలే జవాబు చెబుతారు. తండ్రి లక్షణాలు పుణికిపుచ్చుకుని, ఇంత చిన్న వయసులో అమితమైన ఓపికతో, ప్రతి క్షణం ప్రజాసంక్షేమం కోసం నాన్న బాటలో నడుస్తూ ఉన్న జగన్‌ని చూసి ప్రజలంతా వైఎస్సార్ తర్వాత అంతటి నాయకుడు ఉన్నాడనుకుంటున్న తరుణంలో ఈ ప్రభుత్వం కక్ష కట్టి ఆ యువనేతను అరెస్ట్ చేసింది.

రాత్రీ పగలు లేకుండా ప్రజల్లోనే తిరుగుతూ, ప్రజాసమస్యలపై పోరాడుతూ, ప్రజల కోసమే పుట్టాడు అని అనిపించే ఒక నాయకుడిని, రాజకీయంగా ఎదుర్కోలేక అన్యాయంగా కేసులు పెట్టి జైలుకు పంపించింది. ఈ చర్య రాష్ర్ట ప్రజలను తీవ్ర వేదనకు గురిచేస్తోంది. బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న ప్రతిసారీ ఏదో ఒక అడ్డంకి సృష్టిస్తూ బెయిల్ రాకుండా చేస్తూ, ఎన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నా ఎంతో ధైర్యంతో, ఓపికతో చిరునవ్వు చెదరకుండా ఉన్న జగన్‌ని చూస్తే అంత ఆవేదనలోనూ ప్రజలు ఆశ్చర్యపడుతున్నారు. మా నాయకుడివి నువ్వేనని ఆశీర్వదిస్తున్నారు. ఆ కుటుంబాన్ని అభిమానించే ప్రజలను ఇంత క్షోభకు గురిచేస్తున్నవారిని ఆ దేవుడు శిక్షించి తీరుతాడు. త్వరలోనే జగనన్నను బయటకు రప్పిస్తాడు.

- కె.మురళీధర్‌రెడ్డి, పులివెందుల

 చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34.e-mail: ysjagankosam@gmail.com
Share this article :

0 comments: