మెగా జల్సా! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మెగా జల్సా!

మెగా జల్సా!

Written By news on Thursday, May 23, 2013 | 5/23/2013

http://www.sakshi.com/Main/Featuredetails.aspx?Newsid=62796&subcatid=0&categoryid=28


ప్రజాధనం వినియోగంపై బాద్యతయుతంగా వ్యవహరించాల్సిన నేతలే నిబంధనలను గాలికి వదిలేశారు. అవినీతి, కుంభకోణాలకు వ్యతిరేకంగా ఉపన్యాసాలు దంచే చిరంజీవి అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు వెలుగులోకి రావడం అందర్ని షాక్ కు గురిచేసింది. కేంద్ర మంత్రి హోదాలో హైదరాబాద్ లో నిర్వహించిన టూరిజం సదస్సుకు ప్రభుత్వ ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం అనేక విమర్శలకు చోటిచ్చింది.

ఇటీవల దేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసేందుకు హైదరాబాద్‌లో వరల్డ్‌ టూరిజం ఆర్గనైజేషన్‌ కాన్ఫరెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది . టూరిజం వంకతో స్వామి కార్యం స్వకార్యాన్ని టూరిజం శాఖ మంత్రి చిరంజీవి రెండు నెరవేర్చుకున్నట్టు తెలుస్తోంది. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేశారు. సమాచార హక్కు చట్టంతో ఈ విషయం వెలుగులోకి రావడంతో ప్రజలు ముక్కున వేలేసుకున్నారు.

భారత్‌లో టూరిజం అభివృద్ది పేరుతో హైదరాబాద్‌లో నిర్వహించిన సదస్సులో కేంద్ర మంత్రి చిరంజీవి ప్రజాధనాన్ని నీళ్లలా ఖర్చు పెట్టారు. కొత్తగా పదవిలోకి వచ్చాక చిరు హడావుడి తీవ్రమైంది. అందుకు నిదర్శనమే హైదరాబాద్‌ సదస్సు ఖర్చు. శాఖను ప్రమోట్‌ చేస్తున్నట్టు కలరిస్తూనే వ్యక్తిగతంగానూ తనను తాను ఫేమ్‌ చేసుకునేందుకు అమాత్యులు పెట్టిన ఖర్చు చర్చనీయాంశమైంది. టూరిజం అభివృద్ధి సంగతేమోగాని 3 రోజుల్లోనే 2 కోట్ల 14 లక్షల ప్రజాధనానికి మంగళం పాడేశారు.

టూరిజం సదస్సుకు సంబంధించిన వివరాలు అందించాలని ఆంధ్రప్రదేశ్‌కే చెందిన సమాచారహక్కు కార్యకర్త సాయిప్రసాద్‌ సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయించారు. సమాచార చట్టం అందించిన వివారాలను చూసి పలువరు దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచార హక్కు చట్టం వివరాల ప్రకారం తాజ్‌ ఫలక్‌నుమాలో 150 మంది ప్రతినిధులకు భోజనానికి 5 లక్షల 25 వేలు వెచ్చించారు. టీ లేదా కాఫీకి 90 వేల రూపాయలు ఖర్చు చేశారు. గోల్కొండ కోటలో ఏర్పాటు చేసిన సౌండ్‌ అండ్‌ లైట్‌ కార్యక్రమానికి మరో 6 లక్షలు వెచ్చించారు. తాజ్‌ ఫలక్‌నుమాలో ఏర్పాటైన హైటీకి 2 లక్షల 40 వేల రూపాయలు, ఆరు జ్ఞాపికల కోసం ఏకంగా 9 లక్షల రూపాయలు సమర్పించుకువడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రజా ధనం వెచ్చించే సమయంలో సంయమనం పాటించాలని, ఖర్చు తగ్గించుకోవాలంటూ ఓవైపు ప్రధాని మన్మోహన్‌, యూపీయే ఛైర్‌పర్సన్‌ సోనియా సమయం సదర్భం వచ్చినప్పుడల్లా చెబుతూన్న మాటలను కేంద్రమంత్రి చిరంజీవి గాలికి వదిలేశారు. ఖర్చు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారన్న పేరుతో జల్సాలకు పాల్పడటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం మాటల్ని పెడచెవిన పెట్టిన శశిథరూర్, ఎస్ఎం కృష్ణ దారిలోనే చిరంజీవి కూడా ప్రయాణించడం చర్చనీయాంశమైంది.
Share this article :

0 comments: