కాజీపేటలో విజయమ్మకు ఘనస్వాగతం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాజీపేటలో విజయమ్మకు ఘనస్వాగతం

కాజీపేటలో విజయమ్మకు ఘనస్వాగతం

Written By news on Tuesday, May 21, 2013 | 5/21/2013

వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నేతలు ఘన స్వాగతం పలికారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ సందర్శనకు విజయమ్మ మంగళశారం ఉదయం హైదరాబాద్ నుంచి ఏపీ ఎక్స్‌ప్రెస్ లో బయల్దేరారు. ఆమె11.15 గంటలకు కాగజ్‌నగర్ పట్టణానికి చేరుకుంటారు.

రోడ్డు మార్గం గుండా కౌటాల మండలం తుమ్మిడిహెట్టికి వెళ్తారు. మార్గమధ్యంలోని సిర్పూర్(టి)లో వైఎస్సార్ సీపీ జెండా ఆవి ష్కరణ, టొంకిని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు, కౌటాల మండలం ముత్తం పేట గ్రామంలో వైఎస్సార్ సీపీ జెండా ఆవి ష్కరణ, కౌటాల మండల కేంద్రంలో జెండావిష్కరణ చేస్తారు.

తుమ్మిడిహెట్టిలోని ప్రాణహిత-చేవెళ్ల ప్రాజె క్టు శిలాఫలకానికి క్షీరాభిషేకం అనంతరం అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తా రు. ప్రాణహిత నదిలో పడవలో ప్రయాణిం చి పరిశీలిస్తారు.కాగజ్‌నగర్ పట్టణంలోని ఎస్పీఎం గ్రౌండ్‌లో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే బహిరంగసభలో ప్రసంగించనున్నారు. అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరుతారు.

ఆదిలాబాద్ జిల్లా బయల్దేరిన విజయమ్మ
 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మంగళవారం ఉదయం ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు బయల్దేరారు. ప్రాణహిత-చేవెళ్ళను జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తించాలని డిమాండ్‌ చేస్తూ విజయమ్మ నేడు ప్రాజెక్ట్‌ సైట్‌ను సందర్శించనున్నారు.

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల పథకం అమలులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఆమె నిలదీయనున్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు సాగుతున్న తీరును విజయమ్మ స్వయంగా పరిశీలించనున్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి వేసిన శిలాఫలకాలకు ఆమె క్షీరాభిషేకం చేయనున్నారు. అనంతరం కాగజ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె పాల్గొని ప్రసంగిస్తారు.
Share this article :

0 comments: