సర్కారు ఎవరినీ వదలడం లేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సర్కారు ఎవరినీ వదలడం లేదు

సర్కారు ఎవరినీ వదలడం లేదు

Written By news on Monday, May 20, 2013 | 5/20/2013

- సర్కారు ఎవరినీ వదలడం లేదు
- నేతన్నలు ఆత్మస్థయిర్యం కోల్పోవద్దు
- అన్నివర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు
- వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ
- సిరిసిల్ల నేత కార్మికుల కుటుంబాలకు పరామర్శ

ప్రస్తుత ప్రభుత్వ పాలనతో అన్నివర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. చార్జీల పెంపు పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్కరినీ వదలకుండా ఇబ్బంది పెడుతోందని విమర్శించారు. కొన్ని నెలలు ఓపిక పడితే మంచిరోజులు వస్తాయన్నారు. నేతన్నలు ఆత్మస్థయిర్యం కోల్పోవద్దని భరోసా ఇచ్చారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో రెండు వారాల్లోనే ఆత్మహత్యలు చేసుకున్న ఇద్దరు నేత కార్మికుల కుటుంబాలను విజయమ్మ ఆదివారం పరామర్శించారు. అనంతరం సిరిసిల్లలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వచ్చాను. వాళ్ల బాధలు చెప్పారు. ఆరోగ్యశ్రీ ఆదుకునేలా లేదు. ప్రభుత్వం ఇచ్చే బియ్యం సరిపోవడం లేదు. పిల్లలు చదువుకోలేకపోతున్నా రు. పాలకులకు ప్రజల బాధలు పట్టడం లేదు. 

వీరెవరూ ప్రజల్లోంచి వచ్చిన నాయకులు కాదు. చంద్రబాబు, ఇప్పుడున్న పాలకులకు ప్రజల బాధలు పట్టవు. వైఎస్ ఉన్నప్పుడు పేదలపై ఒక్కపైసా భారం పడనీయలేదు. ఐదున్నరేళ్లలో కరెంటు చార్జీ లు పెంచలేదు. బస్సు చార్జీలు పెంచలేదు. పన్నులువేయలేదు. అది సువర్ణయుగం. దేశంలో ఎక్కడా లేనివిధంగా చేనేతకార్మికుల సంక్షేమానికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. చేనేతవర్గాలకు సబ్సిడీపై ఇళ్లు కట్టించారు. సిరిసిల్లలోనే 5వేల ఇళ్లు నిర్మించారు. 1600 సంఘాలకు రూ.5 లక్షల చొప్పున ఇచ్చి ఆదుకున్నారు. అంత్యోదయ కార్డులు ఇచ్చారు. 75 శాతం రాయితీపై కరెంటు సరఫరా చేశారు. పవర్‌లూమ్ కూలీరేట్ల సబ్సిడీని పెంచారు. 

చంద్రబాబు హయాంలో ఆప్కోను మూసివేస్తే వైఎస్ తెరిపించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు పేదలు బతకడమే కష్టంగా ఉంది. సామాన్యులు అష్టకష్టాలు పడుతున్నారు. చంద్రబాబు గతంలో కరెంటు చార్జీలు ఇష్టారాజ్యంగా పెంచారు. ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి నేనేం తక్కు వా అంటూ పెంచుకుంటూ పోతున్నారు. నేతన్నలకు ధైర్యం చెప్పడానికే నేను సిరిసిల్లకు వచ్చాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేతలకు విజ్ఞప్తి చేస్తున్నా. భయపడవద్దు. ఆత్మస్థయిర్యం కోల్పోవద్దు. కొన్ని నెలలు ఓపిక పట్టండి. మంచి కాలం వస్తుంది. వైఎస్ సువర్ణయుగాన్ని జగన్‌బాబు మళ్లీ తీసుకువస్తారు. జగన్‌బాబు వచ్చాక అంతా మంచే జరుగుతుంది. అన్నిరకాలుగా మీకు అండగా ఉంటాం. మా ప్రభుత్వం, మా కుటుంబం మీకు అండగా ఉంటుంది. జగన్ అధికారంలోకి వస్తారు. నేతన్నలకు రూ.700 పింఛన్ ఇస్తారు. ఇప్పుడున్నట్లు కుటుంబాల పరంగా కాకుండా మగ్గాల ప్రాతిపదికన సబ్సిడీ ఇస్తారు. నూలును సబ్సిడీపై అందజేస్తారు. రూ.లక్ష లోపు రుణాలకు వడ్డీ లేకుండా చేస్తారు. ఆత్మహత్యలు అసలే వద్దు. అప్పులు లేకుండా ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటాం. అమ్మ ఒడి పథకం కింద అందరికీ కేజీ నుంచి పీజీ వరకు ఇంగ్లిష్ మీడియంలో ఉచిత విద్యను అందిస్తారు. పదో తరగతి వరకు రూ.500, ఇంటర్ వరకు రూ.700, డిగ్రీ వరకు రూ.1000 చొప్పున తల్లుల ఖాతాల్లోనే వేస్తారు’ అని వివరించారు. 

పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు, సిరిసిల్ల నియోజకవర్గ సమన్వయకర్త కేకే. మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, నేతన్నలకు భరో సా కల్పించడానికే వైఎస్సార్ సీసీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సిరిసిల్లకు వచ్చారని. రాజకీయాల కోసం తాము పాకులాడబోమని, నేతన్నలకు మనోధైర్యం కల్పించడానికే ప్రాధాన్యం ఇస్తామన్నారు. అనుకోకుండా జరిగిన పర్యటన అయినప్పటికీ చేనేత కార్మిక కుటుంబాలు, ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో వచ్చి విజయమ్మకు స్వాగతం పలికారు. వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్, వేములవాడ, రామగుండం, మంథని, హుజూరాబాద్ నియోజకవర్గాల పార్టీసమన్వయకర్తలు ఆది శ్రీనివాస్, ఎంఎస్.రాజ్‌ఠాకూర్, పుట్ట మధు, పాడి కౌశిక్‌రెడ్డిలతో పాటు పలువురు జిల్లా నాయకులు పాల్గొన్నారు. 

మృతుల కుటుంబాలకు పరామర్శ
ఆత్మహత్యలు చేసుకున్న ఇద్దరు నేతన్నల చిత్రపటాలకు పూలమాలలు వేసిన విజయమ్మ బాధిత కుటుంబాలను ఓదార్చారు. నారాయణ భార్య చంద్రమ్మ తాను హోటల్‌లో పనిచేస్తే రోజు ముప్పయ్ రూపాయలు వస్తున్నాయని చెప్పింది. పనిలేక, ప్రాణం బాగాలేక అప్పులపాలై తనభర్త ఆత్మహత్య చేసుకున్నాడని రోదిస్తూ తెలిపింది. చలించిన విజయమ్మ ఆమెను ఓదార్చి భరోసా ఇచ్చారు. అనంతరం ప్రభాకర్ కుటుంబసభ్యులను పరామర్శించారు. విద్యుత్ చార్జీల బిల్లులను విజయమ్మ చేతికి అందించి ప్రభాకర్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను ఆయన భార్య వసంత, పిల్లలు సాయికుమార్, రేఖ వివరించారు. ఎఫ్‌ఎస్‌ఏ చార్జీలు, విద్యుత్ బిల్లు కలిపి రూ.59,417 వచ్చిన కరెంటు బిల్లులను చూసి విజయమ్మ ఆశ్చర్యపోయారు. బాధపడొద్దని, తాము అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు ఆమె హామీ ఇచ్చారు. సాంచాల మధ్య ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్న ప్రదేశాన్ని విజయమ్మ పరిశీలించారు.
Share this article :

0 comments: