లోకేష్‌ను ఉద్దరించడమే లోకకళ్యాణమా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » లోకేష్‌ను ఉద్దరించడమే లోకకళ్యాణమా?

లోకేష్‌ను ఉద్దరించడమే లోకకళ్యాణమా?

Written By news on Tuesday, June 4, 2013 | 6/04/2013

 రాజకీయంగా తొక్కేయాలనే కాంగ్రెస్, టీడీపీ వంద కుట్రలు పన్ని జగనన్నను జైలుకు పంపాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఆరోపించారు. విలువలు, విశ్వసనీయతకు కట్టుబడే మనిషి గనక ఎన్ని కష్టాలు ఎదురయిన జగన్ మాటపై నిలబడ్డారని చెప్పారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఈ సాయంత్రం రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండ్ సెంటర్ లో జరిగిన సభలో షర్మిల ప్రసంగించారు. 

దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాళ్లూ ప్రతిక్షణం ప్రజల గురించే అలోచించారని గుర్తు చేశారు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. రూ. లక్ష కోట్లతో హరితాంధ్రప్రదేశ్ చేయాలనుకున్నారని చెప్పారు. వైఎస్సార్ మరణించిన తర్వాత ఆయన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై జగన్ ఎన్నో ధర్నాలు, నిరాహార దీక్షలు చేసినా ఈ ప్రభుత్వం స్పందించలేదన్నారు. పేదలంటే ఈ ప్రభుత్వానికి కనికరం లేదన్నారు. కిరణ్ ప్రజానాయకుడు కాదని, అందుకే ప్రజల సమస్యలు ఆయనకు తెలియడం లేదని షర్మిల విమర్శించారు. ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్ లో దిగిపడిన సీఎం కిరణ్ కు ప్రజల బాధలు పట్టడం లేదని ధ్వజమెత్తారు. 

రాబందులు రాజ్యమేలుతుంటే గుంటనక్కలు తాళం వేసినట్లుగా కిరణ్ ప్రజావ్యతిరేక పాలన సాగిస్తుంటే చంద్రబాబు చప్పట్లు కొడుతున్నారని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వంపై చంద్రబాబు ఈగ కూడా వాలనీయడం లేదన్నారు. మైనారిటీలో ఉన్న కిరణ్ సర్కారు చంద్రబాబు మద్దతుతో పాలన సాగించడం లేదా అని షర్మిల సూటిగా ప్రశ్నించారు. టీడీపీని కాంగ్రెస్ ప్రభుత్వానికి చంద్రబాబు రాసిచ్చారని అన్నారు. వ్యవసాయం దండగ అన్న ఏకైక సీఎం చంద్రబాబని గుర్తు చేశారు. లోకకళ్యాణం కోసం పాటుపడతానన్న చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందిస్తూ.. తన కొడుకు లోకేష్ ఒక్కడినే పైకి తేవాలనుకోవడం లోకకళ్యాణం కాదన్నారు. పదవీకాంక్ష లేకపోతే ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీ ఎందుకు లాగేసుకున్నారని నిలదీశారు. చంద్రబాబుకు సీఎం కావాలని లేదంటే టీడీపీ వాళ్లు కూడా నమ్మరని ఎద్దేవా చేశారు. 

కాంగ్రెస్ తో కుమ్మక్కయివుంటే జగన్ జైల్లో ఉండేవాడా అని ప్రశ్నించారు. జగన్ బయటవుంటే మనుగడ ఉందని అబద్దపు కేసులు పెట్టి సీబీఐని ప్రయోగించి జైలుపాలుచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విలువలతో కూడిన రాజకీయాలు చేసే దమ్ము, ధైర్యం కాంగ్రెస్, టీడీపీ నేతలకు లేదన్నారు. ఏదోక రోజు జైలు నుంచి జగన్ బయటకు వస్తారని, రాజన్న రాజ్యం దిశగా నడిపిస్తారని ప్రజలకు షర్మిల భరోసా ఇచ్చారు. తనకోసం వచ్చిన వారికి ఆమె కృతజ్ఞతలు తెలిపా
Share this article :

0 comments: