రాక్షస విలువలు రాజ్యమేలుతున్నాయి... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాక్షస విలువలు రాజ్యమేలుతున్నాయి...

రాక్షస విలువలు రాజ్యమేలుతున్నాయి...

Written By news on Saturday, June 8, 2013 | 6/08/2013

ఓ కవి అన్నారు: ‘‘చట్టాలన్నీ కోర్టులన్నీ... నేతి బీరలో నేయి చందమే... సామాన్యులకవి ఎండమావులే... రాక్షస విలువలు రాజ్యమేలెడి నరకప్రాయపు సంఘంలోన, మనిషికి మనిషికి బంధాలన్నీ మార్కెట్లోని సరుకులాయెనే, గుండెగాయం కెలుకుతున్నా... రాక్షస పీడన నెదిరించాలి. పిశాచ గుణాల ఆనందానికి మారణహోమం జరుగుతున్నది.. నీతి న్యాయం భారమవుతోంది...’’ అని. ఈ చరణాలన్నీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వర్ణించడానికి కరెక్ట్‌గా అమరిపోతాయి. యువనేత జగన్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కక్షసాధింపుకు నిదర్శనగా నిలుస్తాయి. కుమ్మక్కు రాజకీయాల సిగ్గులేనితనానికి ఆనవాళ్లుగా నిలుస్తాయి. న్యాయం గొంతు నొక్కే సీబీఐ వంటి కేంద్ర కాపలాదారులకీ ఇది వర్తిస్తుంది. కుట్రలకు కుతంత్రాలకు కేంద్రంగా మారిన విశ్వాస ఘాతుకులకు సరిగ్గా అతికినట్లు సరిపోతుంది. 

ఎవరికి తెలియనివి... జగన్ విషయంలో కేంద్రరాష్ట్రాల కుట్రలు! ఎవరికి తెలియదు తెహల్కా పత్రిక బాబును కుంభకోణాల సూత్రధారిగా ప్రపంచంలోనే అవినీతి నేతగా చూపించినా, ఆయన కాంగ్రెస్‌తో కుమ్మక్కై రాష్ట ప్రభుత్వాలను కాపాడుతున్నాడని, ప్రతిఫలంగా అవినీతి విషయంలో సీబీఐ విచారించకుండా ప్రభుత్వం నుండి భరోసా పొందాడని. సీబీఐని కాంగ్రెస్ జేబుసంస్థగా అత్యున్నత న్యాయస్థానం కూడా పరిగణించిందని ప్రజలందరికీ తెలిసిన విషయమే. జగన్ విషయంలో చట్టాలన్నీ... కోర్టులన్నీ నేతి బీరలో నేతి చందంగానే మారాయని, మూకుమ్మడి దాడిలో జగన్‌ను బలిపశువును చేస్తున్నారని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.

జగన్ విషయంలో కింకర్తవ్యం... వివేకానందుడి హితవుల్లాగే... ‘ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరుగుతాయి’ అన్నట్లు, ‘గెలుపు భారమైనా భరించు... ఓటమిని తేలికగా అంగీకరించకు’ అన్నట్లు ఉండాలి. నేటిమాటగా చెప్పాలంటే ‘ఓ పోరాట యోధుడా... యువనేతా... రేపటి విజయం నీదైనప్పుడు నీ ఓరిమే ఆయుధంగా విజయ దుందుభి ఎగురవెయ్. సిగ్గులేని కుమ్మక్కునేతలకు, చేతగాని ప్రభుత్వాలకు... నీ నిశ్శబ్దాన్ని రేపటి మహోద్యమంగా చరిత్ర నిలిపే సాక్షిగా ఎదుగు. న్యాయం కరువైనా, నీ సంకల్పమే పోరాటంగా ఉవ్వెత్తున ఎగిసిపడు. ప్రజాభిమానం నీ వెంటే. కుమ్మక్కు రాజకీయాలు ప్రజాగ్రహంలో కొట్టుకుపోవటం ఖాయం.

- పోలేపల్లి శ్రీనివాస్‌రెడ్డి, వ్యాపారవేత్త, విరుగంబాక్కం, చెన్నై
Share this article :

0 comments: