జగన్ అరెస్టు చారిత్రక తప్పిదం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ అరెస్టు చారిత్రక తప్పిదం

జగన్ అరెస్టు చారిత్రక తప్పిదం

Written By news on Thursday, June 6, 2013 | 6/06/2013

=కాంగ్రెస్ చుట్టాలుగా మారిన చట్టాలు
=జగన్ అరెస్టు చారిత్రక తప్పిదం
=కాంగ్రెస్ పార్టీ జనం హక్కులకు భంగం కలిగించింది
=డబ్బుకన్నా మాకు మనుషులు ముఖ్యం
=కన్న బిడ్డలకు తండ్రి ప్రేమను దూరం చేశారు


-న్యూస్‌లైన్, తిరుపతి కార్పొరేషన్/ మంగళం/ రూరల్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వం, సీబీఐ అనుసరిస్తున్న అప్రజాస్వామిక వైఖరిని ప్రజాస్వామ్య వాదులు తీవ్రంగా ఖండించారు. జగన్‌మోహ న్‌రెడ్డి ఓదార్పు యాత్ర చేయడం నచ్చని కాంగ్రెస్ అధిష్టానం ఆయనపై కేసులు మోపి అక్రమంగా అరెస్టు చేయడాన్ని పలువురు తప్పుబట్టారు. 

తిరుపతిలో బుధవారం నిర్వహించిన సాక్షి చైతన్య పథంలో జగన్ అక్రమ అరెస్టు, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని, ప్రజల హక్కులను కాలరాయడమేనని పలువురు స్పష్టం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డిని కేసులు, దర్యాప్తుల పేరుతో ఏడాది కాలంగా జైలులో ఉంచడం ప్రజాస్వామ్యాన్ని కారాగారం లో పెట్టడమే అవుతుందన్నారు. కాంగ్రెస్, టీడీపీ, సీబీఐ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయన్నారు. 

హక్కులను హరించడమే

ప్రజాస్వామ్యం, న్యాయస్థానాలపై నమ్మకం ఉన్నప్పటికీ, న్యాయ విచారణ చేస్తున్న సంస్థలపై నమ్మకం పోతోంది. ఎంపీగా గెలిపిస్తే తమకు సేవ చేస్తాడన్న నమ్మకంతో 5లక్షల మందికి పైగా ప్రజలు ప్రజాస్వామ్య బద్ధంగా ఓట్లేసి జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించారు. ఆయన ప్రజలకు సేవ చేయనీకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐతో జగన్‌పై అక్రమ కేసులు మోపి జైలుకు పంపింది. తద్వారా సేవ చేయించుకునే ప్రజల నమ్మకాన్ని, సేవ చేయాలన్న ఎంపీ జగన్ విధులను, హక్కులను హరించింది. కాంగ్రెస్, టీడీపీ పార్టీలు జనాగ్రహంలో కొట్టుకు పోవడం ఖాయం. 
- కృష్ణారెడ్డి, తిరుపతి 

ఇటలీ రాజకీయాలు సహించం 

ఇటలీ నుంచి వచ్చిన సోనియా ఆంధ్రాలో కుట్ర రాజకీయాలకు పాల్పడితే సహించం. తండ్రిని పోగొట్టుకుని బాధలో ఉన్న జగన్‌ను ఓదార్చాల్సిన సోని యా ఆంక్షలు విధించింది. తండ్రి ఆశయాల కోసం ఆంక్షలు, పదవిని లెక్క చేయకుండా ప్రజా సంక్షే మం కోసమే పాటుబడిన వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి. ఓదార్పు యాత్రలో జగన్ వెంట వచ్చిన జనాన్ని చూసి ఓర్వలేక అధికార, ప్రతిపక్ష పార్టీలు కుట్రలు, కుంత్రాలతో అక్రమ కేసులు బనాయించాయి. రాహుల్‌గాంధీకి రాని ప్రజాదరణ వస్తోందన్న అసూయతో సోనియాగాంధీనే జగన్‌ను జైలుకు పంపింది.
- లతారెడ్డి, తిరుపతి

క్విడ్ ప్రోకో అంటే చంద్రబాబే 

క్విడ్‌ప్రోకో మాటకొస్తే మొదటి దోషి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడే. రెండెకరాల ఆసా మి నేడు కోట్లకు పడగెత్త డం ఈ పాలకులకు కని పించదా. ఇది క్విడ్ ప్రోకో కాదా? 90 రోజుల్లో రా జ్యాంగ బద్ధంగా బెయిల్ ఇవ్వాల్సి ఉన్నా ఏడాది గడుస్తున్నా ఇంత వరకు జగన్‌కు బెయిల్ రాకుండా అడ్డుకోవడం అప్రజాస్వామికం. ప్రభుత్వం ఇచ్చిన 26 జీవోలు అక్రమం అయితే దానికి కారణమైన అప్పటి మంత్రులు అందరినీ ఎందుకు అరెస్టు చేయలేదు. ఆ జీవోలు అక్రమమైనా, సక్రమమైనా కేబినెట్‌లో లేని జగన్‌కు ఏం సంబంధం. 
- ఆదికేశవులరెడ్డి, రైతు సంఘం నాయకుడు 

మా బిడ్డలా ఆదరిస్తున్నాం...

వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం అంటే ఎనలేని అభిమానం. వైఎస్ కొడుకు జగన్‌ను మా బిడ్డలా ఆదరిస్తున్నాం. ఆయనపై పెట్టిన కేసులు అక్రమం, అప్రజాస్వామికం. జగన్ కోసం ఆ ఇంటి ఆడపడుచులందూ కన్నీటితో రోడ్డుపై నిరీక్షిస్తున్నారు. వారి కన్నీటిలో కుట్రదారులంతా మునిగిపోక తప్పదు. ఆకుటుంబానికి రాష్ట్రంలోని ఆడపడుచులంతా అండగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్‌ను సీఎంగా చేసేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఆడపడుచు కన్నీళ్లు పెట్టుకునేందుకు కారణమైనవారికే అరిష్టం కలుగుతుంది. ఈ సత్యాన్ని పాలకులు గ్రహించాలి. 
- కవితమ్మ, జీవకోన 

కాంగ్రెస్ కనుమరుగ వుతుందనే.. 

వైఎస్ జగన్‌కు జనం నుంచి వస్తున్న ఆదరణతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కనుమరుగువుతుందనే భయాందోళనతో జగన్‌ను అక్రమంగా జైల్లో పెట్టారు. ఓదార్పు యాత్రకు వచ్చిన జన సంద్రాన్ని చూసి ఓర్వలేకనే కక్ష సాధింపు చర్యలకు పూనుకున్నారు. అక్రమ కేసులు బనాయించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రజల సంక్షేమం కోసం పాటుబడ్డారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పునరుద్ధరించాలంటే ఒక్క జగనన్నేకే సాధ్యం. 2014లో జగన్ అన్నే మా సీఎం.
- పుష్పాచౌదరి, జీవకోన 

సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం

ప్రజల విశ్వసనీయతను గెలుచుకోవడంలో జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్‌ను మించిపోయారు. జగన్‌మోహన్‌రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టారు. అరెస్టు చేసిన ఏడాది కాలం జైల్లో ఉంచడం సహజ న్యాయ సూత్రాలకు భంగం కలిగించడమే. జగన్‌మోహన్‌రెడ్డికి రాజ్యాంగం కల్పించిన హక్కులకు అన్యాయం జరిగింది. హైకోర్టు, సుప్రీంకోర్టుల ఆదేశాలకు భిన్నంగా జగన్‌పై జరుగుతున్న కేసుల విచారణ ఆందోళనకు గురిచేస్తోంది. సీబీఐ స్వయంప్రతిపత్తి కోల్పోయింది. కాంగ్రెస్ జేబు సంస్థగా మారింది. కొన్ని పత్రికలు, మీడియా సంస్థలు జగన్ అక్రమ ఆస్తుల కేసంటూ ప్రచారం చేయడం అప్రజాస్వామికం. జగన్‌మోహన్‌రె డ్డి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం నేరమైతే, అంబాని నిర్వహించే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినా అక్రమమే.
- సదుం రవీంద్రనాథ్, తిరుపతి

వైఎస్ కుటుంబం కోసం ప్రాణాలైనా ఇస్తాం...

ప్రజా సంక్షేమం కోసం తన ప్రాణాలను అర్పించిన వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం కోసం మా ప్రాణాలు అర్పిస్తాం. లక్షలు ఖర్చు పెట్టి కార్పొరేట్ వైద్యం చేయించుకోలేని పేదల కోసం ఆరోగ్యశ్రీ, ఉన్నత విద్యను అభ్యసించాలని ఉన్నా చదువుకోలేని పేద విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్ పథకాలను ప్రవేశపెట్టి ఎందరో జీవితాల్లో వెలుగులు నింపిన మహానుభావుడు వైఎస్‌ఆర్. ఆయన ప్రవేశపెట్టిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంటే అందుకు వ్యతిరేకంగా పోరాడినందుకే జగన్‌పై అక్రమకేసులు బనాయించారు. జగన్‌మోహన్‌రెడ్డి బయట ఉంటే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవనే భయంతోనే జైలుకు పంపారు.
-ఆర్‌వీ శాంతారెడ్డి, తిరుపతి

వైఎస్ ఏ కొండలోంచో వస్తారు!

ఏం తప్పు చేశారని జగన్‌ను ఏడాదిగా జైల్లో పెట్టారు. ఆరోజు సోనియాను ఇటలీ దేశస్తురాలు అని ప్రతిపక్షాలు గోల చేస్తే అండగా నిలిచింది వైఎస్ కుటుంబమే. చేయని నేరాలను ఆపాదిస్తూ జగన్‌ను ఏడాదిగా జైల్లో నిర్బంధించారు. షర్మిలమ్మ పాదయాత్ర చేస్తుంటే ఏడుపొస్తోంది. పావురాల గుట్టలో ప్రమాదానికి గురైన వైఎస్ మరణించాడంటే నమ్మలేకపోతున్నాం. ఇంకా బతికే ఉన్నాడన్న నమ్మకంతో ‘వైఎస్ ఏ చెట్లోంచో... పుట్టలోంచో... కొండల్లో నుంచో వస్తాడేమో’ అన్న నమ్మకంతో కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాం. ఇప్పటికే జగన్‌మోహన్‌రెడ్డి కోసం పోలీసుల లాఠీ దెబ్బలు తిని రెండు సార్లు జైలుకు కూడా వెళ్లాను. జగన్‌ను సీఎం అయ్యేందుకు ఎంతటి ఉద్యమాన్ని నడపడానికి కూడా సిద్ధమే.
- మునీశ్వరి, మహిళా సంఘం నాయకురాలు, తిరుపతి

న్యాయవ్యవస్థ కీలుబొమ్మలా మారింది

ఎవరికీ తలవంచకుండా, ఎంతటి వారికైనా శిక్షలు విధించాల్సిన న్యాయవ్యవస్థ నేడు రాజకీయ నాయకుల చేతులో కీలు బొమ్మ అయ్యింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఏకమై జగన్‌పై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారు. జగన్‌ను జైల్లో పెడితే జనం ఓట్లు వేస్తారన్న భ్రమలో కాంగ్రెస్ పార్టీ ఉంది. జగన్‌ను జైల్లో పెట్టడం వల్ల ప్రజల్లో మరింత ఆదరణ పెరిగిందే తప్ప ఏమాత్రం తగ్గలేదు. జైల్లో పెట్టినా జయం జగన్ వెంటే ఉంటుంది. ఏక్షణాన ఎన్నికలు జరిపినా జగన్ సీఎం కావడం తధ్యం.
- దుద్దేల బాబు, బొమ్మగుంట

పెన్షన్‌తో గౌరవం పెరిగింది

వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన వృద్ధాప్య పెన్షన్ రావడం వల్ల ప్రతి ఒక్కరి ఇంట్లో వృద్ధులకు గౌరవం లభించింది. చంద్రబాబునాయుడు కేవలం రూ. 75లు పెన్షన్ ఇస్తే ఆమొత్తాన్ని రూ.200నుంచి 500 వరకు పెంచిన మహానుభావుడు వైఎస్‌ఆర్. ముస్లిం, మైనారిటీల అభివృద్ధికి పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఆయన మరణాంతరం ముస్లిం, మైనారిటీలను పట్టించుకున్న నాథుడే లేడు. వైఎస్‌ఆర్ తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయితేనే ముస్లిం, మైనారిటీల అభివృద్ధి సాధ్యం. - మహ్మద్‌బేగం, వృద్ధురాలు

డబ్బు కోసం పరుగులు తీయడంలేదు...

జగన్ వెంట ప్రజలు డబ్బు కోసం పరుగులు తీయడంలేదు. ఆయన తండ్రి వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలతో లబ్ధిపొందిన ప్రజలు జగన్‌మోహన్‌రెడ్డిని ఆదరిస్తున్నారు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ నిరంతరం పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్న వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి. జగన్‌పై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపేందుకు సోనియాకు మనసు ఎలా ఇచ్చింది. ఆమెకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఆ ఉసురు వారికి తగులుతుంది. జగన్ కోసం జైలు ముందు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తాం.. అవసరమైతే తమ ప్రాణాలను సైతం అర్పిస్తాం.
- లత, జీవకోన 

జగన్ అరెస్టు చారిత్రక తప్పిదం 

ఎమర్జెన్సీని తలపించే విధంగా వైఎస్ జగన్‌ను అరెస్టు చేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన చారిత్రక తప్పిదం. కాంగ్రెస్‌ను ఎదిరిస్తే దేశ ప్రజలకు రక్షణ లేదా. జగన్‌పై చేస్తున్న కుట్రలు ప్రజలు గమనిస్తున్నారు. 2014లో వైఎస్‌ఆర్ సీపీకి ఓట్లేసి జగన్ నిర్దోషి అని నిరూపిస్తాం. నిర్దోషిగా జగన్ బయటకు వస్తే ఇన్ని రోజుల అక్రమ నిర్బంధానికి ఎవరు బాధ్యత వహిస్తారు. జగన్ కోసం మేం ఏం చేయలేమా అని రాష్రంలోని యువకులు మండే గుండెలతో రగిలిపోతున్నారు. జగన్ విడుదల కోసం మరో ఉద్యమం ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. 
- షేక్.ఇమామ్, యువజన నాయకుడు 

జనశక్తిగా ఎదుగుతాడనే.. 

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో జనశక్తిగా ఎదుగుతాడనే భయంతోనే ఆయనపై కుట్ర పన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు టీడీపీ కలసికట్టుగా జగన్‌పై అక్రమ కేసులను మోపారు. జగతీ, భారతీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారు ఎలాంటి ఫిర్యాదు చేయక పోయినా అక్రమ పెట్టుబడులంటూ వాటిపై దాడులు చే యడం అప్రజాస్వామికం. ఒక పార్టీ అధ్యక్షుడు,ఎంపీగా ఉన్న వ్యక్తిపై ఈతరహాలో కేసులు పెట్టి జై ల్లో ఉంచడం దారుణం.
- కిరణ్‌రాయల్, సామాజిక సేవా కార్యకర్త 

మానవత్వం లేని సోనియా 

తన కొడుకు ఈదేశానికి ప్రధాని కావాలని కలలు కంటున్న సోనియా ఇతరులు ఎదగడాన్ని జీర్ణించుకోలేక పోయింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారన్న కక్షతో తానూ ఓ తల్లి అన్న కనీస మానవత్వాన్ని మరచి వైఎస్ జగన్‌ను అక్రమంగా అరెస్టు చేయించింది. ఇది యావత్తు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను అవమానించడంగా మేం భావిస్తున్నాం. ఇటలీ నుంచి వచ్చిన సోనియాకు ఇక్కడి మనుషుల మధ్య ఉన్న మానవ సంబంధాలు, విలువలు ఎలా తెలుస్తాయి. 2014 వరకు కాదు.. ఇప్పుడు ఎన్నికలు జరిపించినా జగన్‌మోహన్‌రెడ్డిని సీఎంగా గెలుపించుకునేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాం. 
- శరత్, తిరుపతి 

ప్రజాస్వామ్యం మూగబోయింది

రెండు సార్లు రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారు. తనను ఎదిరించిన జగన్‌ను జైల్లో పెడితే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం అయిపోతుందని అనుకోవడం మూర్ఖత్వం. వైఎస్ అందించిన పావలా వడ్డీ, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాల వలన నేటికీ జగన్ కుటుంబం పేద, బడుగు,బలహీన వర్గాల ప్రజల విశ్వసనీయతను చూరగొంటోంది. జగన్‌పై అక్రమ కేసులు బనాయించి జైల్లో ఏడాదిగా అక్రమంగా నిర్భందించడంతో ప్రజాస్వామ్యం మూగబోయింది.
- టీ రాజేంద్ర, దళిత నాయకుడు 
Share this article :

1 comments:

Laxminarayana Paladi said...

Vinashakale vipareetabuddhi.