‘పంచాయతీ’ ఫిక్సింగ్! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘పంచాయతీ’ ఫిక్సింగ్!

‘పంచాయతీ’ ఫిక్సింగ్!

Written By news on Thursday, June 6, 2013 | 6/06/2013

లోపాయికారీ అవగాహనలతో వైఎస్సార్‌సీపీని దెబ్బకొట్టడమే ధ్యేయం
ఇతర పార్టీలతో, ముఖ్యంగా టీడీపీతో రహస్య దోస్తీయే ఈ వ్యూహంలోని మర్మం
ఢిల్లీ టూర్‌లో గులాం నబీతో సీఎం భేటీ
రెండుగంటలపాటు సమాలోచనలు

సాక్షి, హైదరాబాద్:సాక్షి, న్యూఢిల్లీ: రాష్ర్టంలో రానున్న పంచాయతీ ఎన్నికల్లో ‘ఫిక్సింగ్’కు కాంగ్రెస్ అధినాయకత్వం రంగం సిద్ధం చేస్తోంది. కాంగ్రెస్‌ని ఉన్నతస్థాయి వర్గాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ ఈ వ్యూహానికి మెరుగులు దిద్దుతున్నారు. రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని చాటడం, అదే సమయంలో అసలైన ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్‌కుజనాదరణ లేదని చూపడమే లక్ష్యంగా ఆజాద్ ఈ వ్యూహాన్ని రూపొందిస్తున్నారు. కొద్దిరోజులుగా ఆజాద్ రాష్ట్ర నేతలను ఢిల్లీకి రప్పించి తన నివాసంలో గంటలకొద్దీ మంతనాలు జరుపుతున్నది దీనిపైనేనని ఆ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో పార్టీ చిక్కుల్లో ఉన్న పలు సందర్భాల్లో అందివచ్చిన ‘ఫిక్సింగ్’ ఎత్తుగడనే ఆజాద్ తాజా వ్యూహంలోనూ ప్రధానాంశంగా చేస్తున్నట్టు సమాచారం.

కిరణ్‌కు ‘ఫిక్సింగ్’ సూచనలు..

సోమ, మంగళవారాల్లో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి కె.జానారెడ్డితో పంచాయతీ మంత్రాంగం నెరపిన ఆజాద్ బుధవారం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో రెండు గంటలకుపైగా సమాలోచనలు జరిపారు. అంతర్గత భద్రతపై సీఎంల సదస్సులో పాల్గొనడం కోసం ఉదయం ఢిల్లీ వచ్చిన కిరణ్ మధ్యాహ్నం సదస్సు వేదికైన విజ్ఞాన్‌భవన్ నుంచి నేరుగా ఆజాద్ నివాసానికి వెళ్లారు. అక్కడే భోజనం చేసి రెండుగంటల చర్చల తర్వాత తిరిగి విజ్ఞాన్‌భవన్‌కు వచ్చి నక్సల్ బాధిత రాష్ట్రాల సీఎంల భేటీలో పాల్గొన్నారు. సాయంత్రం కేంద్ర మంత్రి ఎం.ఎం.పళ్లంరాజును కలిసి హైదరాబాద్‌కు పయనమయ్యారు. తనతో జరిపిన భేటీ సందర్భంగానే పంచాయతీ ‘ఫిక్సింగ్’ వ్యూహం రూపురేఖలను కిరణ్‌కు ఆజాద్ వివరించి దాని అమలు కోసం ఇప్పటినుంచే తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారని తెలిసింది. పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆజాద్, పార్టీల అసలు బలాలేమిటో ఈ ఎన్నికల్లో తేటతెల్లమవుతాయని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆజాద్ అమలు చేయతలపెట్టిన ‘ఫిక్సింగ్ వ్యూహం’, కిరణ్‌కు ఇచ్చిన మార్గదర్శకాలు అమిత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

క్షేత్రస్థాయిలో మిలాఖత్‌లు..

ఇప్పటివరకూ రాష్ట్రంలో ప్రభుత్వం తీవ్ర చిక్కుల్లో పడ్డ సందర్భాల్లో ప్రతిపక్ష టీడీపీతో రాష్ట్రస్థాయిలో రహస్య అవగాహన కుదుర్చుకుని గట్టెక్కుతూ వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు సదరు అవగాహనను కొత్త పుంతలు తొక్కించడానికి సిద్ధపడుతోంది. పంచాయతీ ఎన్నికలు జరిగేది దిగువస్థాయిలో అయినందున... రాష్ట్ర స్థాయిలో రహస్య అవగాహనకు వస్తే అది పనిచేయదని, క్షేత్రస్థాయిలోనే ఎక్కడికక్కడ తెరవెనక ఒప్పందాలు చేసుకుంటే తప్ప రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పై గెలుపు అసాధ్యమని భావించిన ఆజాద్ ఆ మేరకే వ్యూహాన్ని తయారుచేస్తున్నారని తెలుస్తోంది. పార్టీలో నేతల మధ్య పలు విభేదాలున్న నేపథ్యంలో వారందరినీ ఏకతాటిపైకి ఇప్పటికిప్పుడు తీసుకురావడం కష్టమని, పార్టీ నేతలకంటే పరులపై ఆధారపడటమే ఉత్తమమనేది ఆజాద్ మనోగతమని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్‌కు జనాదరణ లేదని ఫలితాల రూపంలో చూపడానికి టీడీపీతో సహా ముందుకొచ్చే పార్టీలన్నింటితోనూ.. ప్రధానంగా టీడీపీతో స్థానికంగా రహస్య ఒప్పందాలు కుదుర్చుకునే పనిని ఇప్పటినుంచే ఆరంభించాలని సీఎంకు చెప్పారని తెలిసింది.
Share this article :

0 comments: