టీడీపీ-కాంగ్రెస్ మిలాఖత్ రాజకీయాలు బట్టబయలు కావడంతో.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టీడీపీ-కాంగ్రెస్ మిలాఖత్ రాజకీయాలు బట్టబయలు కావడంతో..

టీడీపీ-కాంగ్రెస్ మిలాఖత్ రాజకీయాలు బట్టబయలు కావడంతో..

Written By news on Friday, June 7, 2013 | 6/07/2013

వైఎస్సార్ సీపీ ధ్వజం

 టీడీపీ-కాంగ్రెస్ మిలాఖత్ రాజకీయాలు బట్టబయలు కావడంతో.. రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ రెండు పార్టీలు పన్నిన కుట్రలో భాగంగానే వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి జైలు ములాఖత్‌లను వివాదం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్షం ధ్వజమెత్తింది. పార్టీ శాసనసభాపక్షం ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి, కార్యదర్శి తెల్లం బాలరాజు, విప్ బాలినేని శ్రీనివాసరెడ్డిలు ఈ మేరకు గురువారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి రాని రాష్ట్ర జైళ్ల శాఖకు సంబంధించిన అంశంపై టీడీపీ కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేకు లేఖ రాయడాన్ని నేతలు తప్పుబట్టారు. 

సుమారు పదిహేనేళ్లు మంత్రిగా, శాసనసభ స్పీకర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు యనమల రామకృష్ణుడు ఆ లేఖ రాయడం హాస్యాస్పదమన్నారు. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్న యనమల శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉండటానికి కూడా అనర్హుడని వారు దుయ్యబట్టారు. చట్ట ప్రకారమే జగన్‌కు ములాఖత్‌లు ఇస్తున్నామని జైళ్ల శాఖ డీజీ కృష్ణరాజు ప్రకటించడంతో ఓర్వలేక.. తప్పుడు ఆరోపణలతో, సంబంధం లేనివారికి లేఖలు రాసి దుష్ర్పచారం చేయడం టీడీపీ దివాళాకోరు రాజకీయాలకు మరో నిదర్శనమని వారు వ్యాఖ్యానించారు. ఆర్టీఐ చట్టం కింద ములాఖత్‌లపై సమాచారం సేకరించిన టీడీపీ నాయకులు.. వాటిలో ఎలాంటి లొసుగులు దొరకలేదనే అక్కసుతో తప్పుడు, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ నేతలు మండిపడ్డారు. 

యనమల ట్యూటర్‌ను పెట్టుకుంటే మంచిది

తెలుగు-కాంగ్రెస్ అధినేత చంద్రబాబు తనకు శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడి పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఆయన సూచనల మేరకు యనమల ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా రామకృష్ణుడు ఒక మంచి ట్యూటర్‌ను పెట్టుకుని ప్రజాస్వామ్య నియమావళి, రాజ్యాంగం తదితర అంశాలపై తర్ఫీదు పొందాలని సూచించారు. లేనిపక్షంలో ఇప్పటికే రాష్ట్ర ప్రజానీకం దృష్టిలో ప్రతిపక్ష పదవికి అనర్హుడుగా మారిన చంద్రబాబులాగే, మండలిలో ప్రతిపక్ష నేత హోదాకు యనమల అనర్హుడిగా మారిపోతారని ఎద్దేవా చేశారు. ప్రధాన ప్రతిపక్ష కనీస బాధ్యతను మర్చిపోయిన తెలుగుదేశం పార్టీ అధికారపక్షంతో చేతులు కలపడం మిలాఖత్ రాజకీయాలు కాక మరేమిటి? అని వారు ప్రశ్నించారు.
Share this article :

0 comments: