తిరుపతి ప్రజలపై కక్ష సాధింపు చర్యలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తిరుపతి ప్రజలపై కక్ష సాధింపు చర్యలు

తిరుపతి ప్రజలపై కక్ష సాధింపు చర్యలు

Written By news on Monday, June 3, 2013 | 6/03/2013


ఎమ్మెల్యే భూమన ఆరోపణ
25 వేల మందితో రణభేరి

 ప్రజా సమస్యలను పట్టించుకోకుండా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రోజుకో పథకం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. తిరుపతి ప్రజలపై సీఎం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. స్థానిక రాజీవ్‌నగర్ పంచాయతీలో నెలకొన్న సమస్యలపై ఆదివారం ఆయన రణభేరి పేరుతో దాదాపు 25 వేల మందితో మహాధర్నా నిర్వహించి రాష్ట్రప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీపై రాష్ట్ర ప్రభుత్వానికి కించిత్ ప్రేమ కూడా లేదని, ఉంటే రాజీవ్‌నగర్ పంచాయతీలో మౌలిక సదుపాయాలు కల్పించి ఉండేదని వ్యాఖ్యానించారు. సీఎం కిరణ్‌కు అధికార దుగ్ధ తప్ప ప్రజల బాగోగులు పట్టించుకోవాలన్న ఆలోచనే లేదని దుయ్యబట్టారు.

తిరుపతి ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారనే కసితో కక్ష సాధింపునకు పాల్పడుతున్నారన్నారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి రాహుల్‌గాంధీ కన్నా మంచి పేరు రావడాన్ని సహించలేని సోనియాగాంధీ ఆయన్ను పార్టీ నుంచి బయటకు పంపించడమేగాక తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే జగనన్న కడిగిన ఆణిముత్యంలా వస్తారని, ఆయన సీఎం కాగానే రాజీవ్‌నగర్ పంచాయతీకి రూ.వంద కోట్లు కేటాయించి కనీస సౌకర్యాలు కల్పిస్తారని భూమన హామీ ఇచ్చారు. ‘వస్తున్నా మీకోసం యాత్ర’ను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అర్ధరాత్రి నిశాచరుల్లా చేపట్టారని ఎద్దేవా చేశారు. జగనన్న సోదరి షర్మిలమ్మ మం డుటెండల్లో ప్రజల్లోకి వెళుతూ వారి కష్టసుఖాలను తెలుసుకుంటున్నారని తెలిపారు. ప్రజల్లో విప్లవాగ్ని రగులుతోందని, అదే వైఎస్సార్ సీపీని అధికారంలోకి తీసుకువస్తుందని భూమన పేర్కొన్నారు. 
Share this article :

0 comments: